Vijay Kumar Konda
-
‘లెహరాయి’ ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
‘‘లెహరాయి’ దర్శకుడు రామకృష్ణ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. సెన్సిబుల్ వ్యక్తి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు విజయ్‌కుమార్ కొండా అన్నారు. రంజిత్, సౌమ్యా మీనన్, గగన్ విహారి ముఖ్య పాత్రల్లో రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విజయ్‌కుమార్ కొండా విడుదల చేశారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. రామకృష్ణ భవిష్యత్‌లో పెద్ద దర్శకుడవుతాడు’’ అన్నారు. ‘‘మంచి కాన్సెప్‌్టతో వస్తున్న మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మద్దిరెడ్డి శ్రీనివాస్. ‘‘ఫ్యామిలీ ఎమో షన్స్ మిళితమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు రామకృష్ణ పరమహంస. -
నెత్తురోడిన రోడ్లు, హీరోయిన్‌తో లిప్‌లాక్‌లు
లవ్, కామెడీ సినిమాలకు కామా పెట్టి "పవర్ ప్లే"తో థ్రిల్లర్ మూవీ ట్రాక్ ఎక్కాడు హీరో రాజ్ తరుణ్. తన గత చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండ మరోసారి ఈ సినిమాకు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాడు. కానీ ఈ సారి కామెడీ జోలికి పోకుండా విభిన్న కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో పవర్ ప్లే చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం ఉదయం రిలీజ్ చేశారు. ఒక్క డైలాగ్ లేకుండా సాగిపోయిన ఈ ట్రైలర్లో నేరాలు, ఘోరాలే ఎక్కువగా కనబడ్డాయి. (చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. యంగ్ హీరోతో..) ఇదిలా వుంటే రాజ్ తరుణ్ ఈసారి కూడా హీరోయిన్‌తో లిప్‌లాక్ సీన్లో నటించి మరోసారి రెచ్చిపోయాడు. మరి ఈ పవర్ ప్లేలో చివరికి ఎవరు గెలిచారు? రాజ్ తరుణ్ తన కంటి నుంచి జాలువారిన కన్నీటి బొట్లకు ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే! ఇక ఈ పవర్ ప్లేలో హేమల్ ఇంగ్లే కథానాయికగా కనిపించనుండగా పూర్ణ, మధునందన్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహిధర్, దేవేష్ నిర్మిస్తున్నారు. మరోవైపు రాజ్ తరుణ్ 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ కీలక పాత్రలో నటిస్తోంది. (చదవండి: పుష్ప’టీమ్‌కు షాక్.. రెండు సీన్లు లీక్) -
‘జాగ్వార్’తో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ డైరెక్టర్!
కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జాగ్వార్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అది బెడిసికొట్టడంతో నిఖిల్ వచ్చిన సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ కన్నడలో మాత్రం నిఖిల్ బిజీగానే ఉన్నాడు. అయితే ఈ కన్నడ హీరోను మన టాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మూవీతో హిట్ కొట్టిన విజయ్‌కుమార్ కొండ.. ఆ తరువాత ‘ఒక లైలా కోసం’ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగచైతన్య, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ఈ సినిమా ఫర్వాలేదనిపించినా.. మళ్లీ ఇంతవరకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. శ్యాండిల్‌వుడ్‌లో తన ప్రతిభను చాటుకుని.. టాలీవుడ్ మళ్లీ అవకాశాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నాడేమో దర్శకుడు విజయ్. దీనిలో భాగంగానే నిఖిల్ గౌడతో సినిమా చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం నిఖిల్ సీతారామ కళ్యాణ, కురుక్షేత్ర సినిమాలో అభిమన్యుడిగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. -
నితిన్ డైరెక్టర్‌తో రాజ్ తరుణ్..!
గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సక్సెస్ ఫుల్ సినిమాతో పరిచయం అయిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించిన ఈ యువ దర్శకుడు రెండో సినిమాతో నిరాశపరిచారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో విజయ్ కుమార్ కెరీర్ లో గ్యాప్ వచ్చింది. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందించేందుకు రెడీ అవుతున్నారు విజయ్ కుమార్ కొండా. ప్రస్తుతం రాజుగాడు సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తున్న మరో సినిమాతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్, ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన తరువాత విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందన్న టాక్ వినిపిస్తోంది. -
వరుణ్ తేజ్ మరో సినిమా ఓకె చేశాడు..?
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, ఇప్పుడు కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ల మీద దృష్టి పెట్టిన వరుణ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం కామెడీ స్పెషలిస్ట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమాతో పాటు కాఫీలాంటి సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఒకేసారి కానిచ్చేస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మూడో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్లను అందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
ప్రేమలో ఏడు కోణాలు
‘మనం’, ‘ఇష్క్’ చిత్రాలకు కథా సహకారం అందించిన ముకుంద్ పాండే తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎల్ 7’. అరుణ్ అదిత్, పూజా జవేరి జంటగా బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం లోగోను దర్శకుడు విజయ్ కుమార్ కొండా, ట్రైలర్‌ను నిర్మాతలు గొట్టిముక్కల పద్మారావు, డీఎస్ రావు విడుదల చేశారు. గొట్టిముక్కల పద్మారావు మాట్లాడుతూ- ‘‘ భోజ్‌పురిలో స్టార్ హీరోలతో చిత్రాలు తీసి, బడా నిర్మాతగా పేరు తెచుకున్నారు ఓబుల్ సుబ్బారెడ్డి. తెలుగులో ఆయనకు ‘ఎల్ 7’ రెండో చిత్రం. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తోంది. దర్శకుడు మంచి ప్రతిభ ఉన్నవాడు. బాగా తెరకెక్కించాడు’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రేమలోని ఏడు కోణాలను ఇందులో చూపించాడు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని విజయ్ కుమార్ కొండా పేర్కొన్నారు. ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ- ‘‘భోజ్‌పురిలో మంచి చిత్రాలు నిర్మించి విజయాలను అందుకున్నా. తెలుగులో కూడా మంచి నిర్మాత అనిపించుకోవాలని ఉంది. ముకుంద్ చెప్పిన కథ నచ్చడంతో తననే దర్శకత్వం వహించమన్నా. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ వంటి అన్ని అంశాలు ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం. కిశోర్, సహ నిర్మాతలు: మోహనరావు.బి, సతీష్ కొట్టె, కె.పున్నయ్య చౌదరి, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్. -
మూడో సినిమాను ఫైనల్ చేశాడు
ఏ స్టార్ వారసుడూ పరిచయం కానంత స్థాయిలో గ్రాండ్‌గా లాంచ్ అయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. పలు సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీనివాస్, తొలి సినిమా అల్లుడు శీనుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా, సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఈ సారి మినిమమ్ గ్యారెంటీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో, ఓ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందరపాండియన్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా చేస్తున్నారు. తొలి సినిమాతోనే మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన శ్రీనివాస్... ఆ తరువాత మాత్రం లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ మూడో సినిమాగా లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం లాంటి క్యూట్ లవ్ స్టోరీస్‌ను డైరెక్ట్ చేసిన విజయకుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన స్వాతి హీరోయిన్గా నటించే ఛాన్స్ కనిపిస్తోంది. -
సినిమా రివ్యూ: ఒక లైలా కోసం
నటీనటులు: నాగ చైతన్య, పూజా హెగ్డే, సుమన్, షియాజీ షిండే, చలపతిరావు తదితరులు.. సంగీతం: అనూప్ రూబెన్ నిర్మాత: అక్కినేని నాగార్జున దర్శకుడు: విజయ్ కుమార్ కొండా కథ.. కార్తీక్ (నాగచైతన్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో టాప్ ర్యాంకర్. చదువు పూర్తయిన తర్వాత పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగాలను వచ్చిన ఆఫర్లను తిరస్కరించి.. ఓ ఏడాదిపాటు హాలీడే ట్రిప్‌కు కార్తీక్ వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే నందన(పూజా హెగ్డే)ను కార్తీక్ ప్రేమిస్తాడు. అయితే చిన్న చిన్న కారణాల వలన కార్తీక్‌ను నందన ద్వేషిస్తుంది. కాని నంద న, కార్తీక్‌ల తల్లి తండ్రులు వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. తల్లితండ్రులను బాధపెట్టడం ఇష్టంలేని నందూ పెళ్లికి ఒప్పుకున్నప్పటికి.. కార్తీక్‌ను ద్వేషించడం మాత్రం మానదు. చివరికి కార్తీక్ ప్రేమకు నందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? నందన మనసును కార్తీక్ ఎలా గెలుచుకున్నాడు, కార్తీక్‌ను ద్వేషించడానికి కారణాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరమీద చూడాల్సిందే. ఆకట్టుకునే అంశాలు: నాగచైతన్య, పూజా హెగ్డే ఫెర్ఫార్మెన్స్ ఫోటోగ్రఫి ఆలీ కామెడీ రీరికార్డింగ్ నిరాశపరిచే అంశాలు: రోటిన్కథ, ఆకట్టుకోలేని కథనం దర్శకత్వం పాటలు డైలాగ్స్ నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే.. నందన ప్రేమకు కోసం తపన పడే ప్రేమికుడిగా కార్తీక్ పాత్రలో నాగచైతన్య పర్వాలేదనిపించారు. ఫెర్ఫార్మెన్స్ విషయంలో గతంలో కంటే కొంత మెరుగ్గా కనిపించినప్పటికి.. ఇంకా మెచ్యురిటీని సాధించాల్సిన అవసరం ఉంది. ఈ చిత్ర విజయ భారం మొత్తం నాగచైతన్య తన మీద వేసుకున్నారు. నందన పాత్రలో పూజా హెగ్డే గ్లామర్‌తో ఆకట్టుకుంది. నందన పాత్రలో పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్నప్పటికి.. పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదనే అనిపించింది. మిగితా పాత్రలన్నింటినిలోనూ కొత్తదనం కనిపించకపోగా తెరమీద పరమ రోటిన్‌గానే కనిపిస్తాయి. ఈ చిత్రంలో ఆలీ కామెడీ కొంత ఊరట కలిగించే విధంగా ఉంటుంది. సాంకేతిక విభాగాల పనితీరు: ఓ లవ్ స్టోరికి సరిపడే ఫీల్‌ను కలిగించడానికి తన ఫోటోగ్రఫి ద్వారా ఐ ఆండ్రూ శాయశక్తులా ప్రయత్నించాడు. నాగచైతన్య, పూజా హెగ్డేలను గ్లామర్‌గా తెర మీద చూపించడంలో అండ్రూ సఫలయ్యారు. పేలవమైన కథనాన్ని కనిపించకుండా తన ఫోట్రోగ్రఫి ద్వారా అండ్రూ మేనేజ్ చేశాడని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనూప్ రూబెన్స్ ఆకట్టుకున్నా.. పాటలు మాత్రం ఆలరించలేకపోయాయి. అద్నాన్ సమీ పాడిన ‘ఓ చెలి నువ్వే నా..’ బాగుంది. ఒక లైలా కోసం పాట తెరమీద ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో కంటెంట్ లేని సీన్లు ఎక్కువగానే కనిపించాయి. ఎడిటర్ ప్రవీణ్ పుడి పూర్తి స్థాయిలో తన ప్రతిభకు పని పెట్టాల్సిందనే అభిప్రాయం కలుగుతుంది. చివరగా.. ఎన్నుకున్న కథలో పస లేకపోవడంతో తొలి భాగ ం నిస్సారంగా సాగుతుంది. మధ్య మధ్యలో ఆలీ కామెడీ మెనేజ్ చేసేందుకు ప్రయత్నించారు. పూజా హెగ్డే ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరణ దర్శకుడి టేస్ట్ కు అద్దం పడుతుంది. కొన్ని ఫీల్ గుడ్ సన్నివేశాలను చిత్రీకరించడంలో దర్శకుడి నైపుణ్యం కనిపించింది. అయితే కథనంలో వేగం లేకపోవడం.. సాధారణ ప్రేక్షకుడు సైతం ఊహించగలిగే క్లైమాక్స్ ఉన్నప్పటికి.. ఓ మంచి ఫీల్‌తో ముగించలేకపోవడం లాంటి అంశాలు ప్రతికూలంగా మారాయి. ‘స్టార్’ ఎపిసోడ్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆతర్వాత అదే ఊపును దర్శకుడు కొనసాగించలేపోయారు. రొటిన్ కథ, రెగ్యులర్ కథనానికి డైలాగ్స్ కూడా బలంగా మారలేకపోయాయి. ‘గుండె జారి గల్లంతయిందే’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయారని చెప్పవచ్చు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు బీ,సీ సెంటర్ల ప్రేక్షకులు ‘ఒక లైలా..’తో కనెక్ట్ అవ్వడంపైనే భారీ విజయం అధారపడి ఉంది. --రాజబాబు అనుముల -
అప్పట్లో నాన్నగారు... తర్వాత నేను...ఇప్పుడు చైతు.. : నాగార్జున
‘‘మజ్ను, గీతాంజలి చిత్రాలతో నాకు రొమాంటిక్ హీరో ఇమేజ్ వచ్చింది. ‘శివ’ తర్వాత నేను యాక్షన్ హీరో అనిపించుకున్నాను. నాగచైతన్యకు కూడా యాక్షన్ ఇమేజ్ రావడానికి కాస్త టైమ్ పడుతుంది. తప్పకుండా త్వరలో మంచి యాక్షన్ హీరో అనిపించుకుంటాడు’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ -‘‘అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఫీల్‌గుడ్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. నాన్నగారు ఎక్కువ శాతం అలాంటి చిత్రాల్లోనే నటించారు. నన్ను కూడా అలాంటి సినిమాల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. అలాగే ఇప్పుడు చైతూను కూడా. మా కుటుంబానికి ఇలాంటి కథలే నప్పుతాయేమో. నాగచైతన్యకు ఏమాయ చేశావె, 100%లవ్ చిత్రాలతో లవర్‌బోయ్ ఇమేజ్ ఎప్పుడో వచ్చేసింది. ఈ సినిమా కూడా వాటి తరహా రొమాంటిక్ ఎంటర్టైనరే. ఇందులో చైతూ పరిణతి చెందిన కుర్రాడిగా నటించాడు. నటునిగా చైతూని మరింత ఎత్తులో నిలబట్టే సినిమా ఇది’’ అని అన్నారు. ఫీల్‌గుడ్ సినిమా ఇదని, పూజా గ్లామర్, అలీ కామెడీ అందరికీ నచ్చుతాయనీ నాగచైతన్య చెప్పారు. ఏ ప్రేమికుడూ ఏ ప్రేయసికీ ఇవ్వని బహుమతిని ఈ సినిమాలో హీరోయిన్‌కి హీరో ఇస్తాడని, అదేంటో తెరపైనే చూడాలనీ, ప్రతిష్ఠాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన 25వ చిత్రానికి తాను దర్శకుణ్ణి కావడం ఆనందంగా ఉందని విజయ్‌కుమార్ కొండా చెప్పారు. పాటలకు మంచి స్పందన లభిస్తోందని అనూప్ ఆనందం వెలిబుచ్చారు. ఇందులో హీరోయిన్గా చేయడం కాస్త కష్టంగా అనిపించిందనీ, అయితే... అవుట్‌పుట్ చూశాక చాలా సంతోషం అనిపించిందనీ పూజా హెగ్డే అన్నారు. -
నా లైలా ట్రయల్స్‌లో నేనున్నాను : నాగ చైతన్య
‘‘భారీ నిర్మాణం, వాణిజ్య అంశాల వల్ల సినిమాలు విజయం సాధిస్తాయంటే నమ్మను. దేనికైనా కథ ముఖ్యం. ఆ కథ ద్వారా ప్రేక్షకులకు సరైన వినోదాన్ని పంచడం ముఖ్యం’’ అని నాగచైతన్య అంటున్నారు. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు నాగచైతన్య. మీ తాతగారి పాటలోని పల్లవిని సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు. ఆ ఆలోచన ఎవరిది? దర్శకునిదే. కథకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఓ అమ్మాయి కోసం ఓ అబ్బాయి చేసిన ప్రయత్నాలేంటి? ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి ఎంత దూరం వెళ్లాడు? అనేది ఈ సినిమా కథ. తాతగారి ‘రాముడుకాదు కృష్ణుడు’ సినిమాలోని ‘ఒక లైలాకోసం’ పాట పెద్ద హిట్. క్రేజ్ కూడా ఉంటుంది కదా. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఆ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ కూడా చేశాం. నిజంగా ఆ పాటను రీమిక్స్ చేయడం కత్తిమీద సామే. రీమిక్స్‌లకు అనూప్‌రూబెన్స్ త్వరగా ఒప్పుకోడు. కానీ... సందర్భం చెప్పి, పాట వినిపించగానే ఒప్పుకున్నాడు. ఇంతకు ముందు ప్రేమకథలు చేశారు కదా. వాటికీ దీనికి తేడా ఏంటి? వాటితో పోలిస్తే ఇది పరిణతి చెందిన కుర్రాడి ప్రేమకథ. గ్రాడ్యుయేషన్ పూర్తయిన కుర్రాడిగా ఇందులో కనిపిస్తా. ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. నాకేమో పెళ్లంటే ఆసక్తి ఉండదు. అలాంటి వాడు ప్రేమలో పడితే ఏమవుతుంది? అనేది ఈ సినిమా. నా ‘100% లవ్’ సినిమాలాగే పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. తుఫాన్ బీభత్సం వల్ల ఆంధ్రా పరిస్థితి బావుండలేదు కదా. ఈ టైమ్‌లో విడుదల కరెక్టేనా? నష్టం ఉంటుంది. సిద్ధపడే విడుదల చేస్తున్నాం. వారికి ఎదురైన నష్టంతో పోలిస్తే మన నష్టం ఏముంది చెప్పండి. చాలా బాధగా ఉంది. ఈ సినిమా విడుదలకు కావాల్సిన అన్ని పనులూ పూర్తయిపోయాయి. అందుకే తప్పడంలేదు. నాగార్జునగారు సినిమా చూసి కొన్ని మార్పులు చెప్పారట? ఒక సినిమాతో చాలారోజులుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ప్రతి సన్నివేశం మనకు బాగానే ఉంటుంది. కానీ... కొత్తగా చూసేవారికి తెలుస్తుంది అందులోని లోపాలు. రీసెంట్గా నాన్న చూసి కొన్ని మార్పులు సూచించారు. మాకు సబబే అనిపించి రీషూట్ చేశాం. అంటే మీ సినిమాల విషయం మీ నాన్నగారి జోక్యం ఉంటుందన్నమాట? కథలు నేనే వింటాను. నాకు నచ్చాక నాన్నగారిని వినమంటాను. హీరోగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావాలనేది నాన్నగారి కోరిక. అందుకే సలహాలిస్తుంటారు. నేను సొంతంగా నిర్ణయం తీసుకోవడమే నాన్నకు ఇష్టం. రెండు సినిమాలు ఫ్లాపైనా పర్లేదు.. అనుభవం వస్తుందంటారు నాన్న. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. పబ్లిసిటీ వ్యవహారాలు కూడా నేనే చూసుకుంటున్నా. స్టార్ హీరోల భారీ పారితోషికాల వల్లే నిర్మాణ వ్యయం పెరిగిపోతోందనీ, తద్వారా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు వాటిల్లుతున్నాయనే విమర్శపై మీ కామెంట్? నేను సినిమా ఒప్పుకునే ముందు బడ్జెట్ ఎంతో తెలుసుకుంటాను. సేఫ్ అనుకున్న తర్వాతే ముందుకెళ్తా. మనం చేసే సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదనేది నా సిద్ధాంతం. సినిమా ఫ్లాపైతే ఆ నష్టాన్ని హీరోలు భరించాలనే వాదనను ఏకీభవిస్తారా? సినిమా అనేది సమష్టి కృషి. ఒకరి వల్ల హిట్ అవ్వదు. ఒకరి వల్ల ఫ్లాప్ అవ్వదు. యూనిట్ మొత్తం కలిసి నష్టాన్ని భరిస్తామంటే నేనూ సిద్ధమే. అఖిల్ సినిమా ఎప్పుడు? కథలు వింటున్నాడు. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఏమైనా సందేహాలు ఉంటే అడుగుతుంటాడు. ఫైనల్ నిర్ణయం మాత్రం తనదే. మీ నెక్ట్స్ సినిమాలు? సుధీర్‌వర్మ దర్శకత్వంలో చేస్తున్నాను. మిగిలినవి చర్చల దశలో ఉన్నాయి. ఇంతకీ మీ లైలా తారసపడిందా? పెళ్లెప్పుడు? ఇంట్లో వాళ్లు కూడా అడిగారు. చూడమని చెప్పాను. వారి ప్రయత్నాల్లో వారున్నారు. నా లైలా ట్రయల్స్‌లో నేనున్నాను (నవ్వుతూ). -
అక్కణ్ణుంచి ఉత్తరాలు రాస్తా : నాగార్జున
‘‘నాకు తెలిసి చరిత్రలో ఏ నటుడూ చివరి క్షణం వరకు నటించలేదు. ఆ ఘనత నాన్నగారికే దక్కింది. కుటుంబమంతా కలిసి చూసే చిత్రాలంటే ఆయనకు ఇష్టం. నాన్నగారి చివరి చిత్రం ‘మనం’ ఆ తరహాలోనే ఉంటుంది. అనుకోకుండా ఆ సినిమా కుదరడం, అదే నాన్నగారి చివరి సినిమా కావడం అంతా కాకతాళీయంగా జరిగిపోయింది’’ అని నాగార్జున అన్నారు. ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మనం’ చిత్రం వందరోజుల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నాగచైతన్య హీరోగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహించిన ‘ఒక లైలా కోసం’ ఆడియో విజయోత్సవం, ఏయన్నార్ జయంతి వేడుకలు కూడా ఇదే వేదికపై జరిగాయి. ఏయన్నార్ పేరు మీద అమెరికాలో విడుదలైన పోస్టల్ స్టాంప్‌ను అక్కినేని వెంకట్, నాగార్జున, నాగసుశీల విడుదల చేశారు. ఈసారి అమెరికా వెళ్లినప్పుడు ఈ స్టాంప్‌లను ఉపయోగించి తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఉత్తరాలు రాస్తానని ఈ సందర్భంగా నాగ్ పేర్కొన్నారు. తాతయ్య ‘ఒక లైలా కోసం’ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో, తాను నటించిన ‘ఒక లైలా కోసం’ చిత్రం కూడా అంతే ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నాగచైతన్య అన్నారు. అఖిల్ మాట్లాడుతూ- ‘‘ఓ బ్లాక్ బస్టర్ చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతోనే నా తొలి చిత్రాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను’’ అని చెప్పారు. అమితాబ్ బచ్చన్‌కి ఏయన్నార్ అవార్డు సినిమా రంగానికి అద్భుతమైన సేవలు అందించిన ప్రతిభావంతులను గౌరవించాలనే సదుద్దేశంతో అక్కినేని నాగేశ్వరరావు ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ని ఈ అవార్డుకు ఎంపిక చేశామని అవార్డు కమిటీ ఛైర్మన్ డా. టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ వేడుకలో అమల, విక్రమ్‌కుమార్, విజయ్‌కుమార్, సుశాంత్, పూజ హెగ్డే తదితరులు పాల్గొన్నారు. -
ఒక లైలా కోసం మూవీ పోస్టర్స్
-
'నాగచైతన్య' ఒక లైలా కోసం మూవీ స్టిల్స్
-
ఐ లవ్ విజయవాడ
సినీహీరో అక్కినేని నాగచైతన్య విజయవాడలో ఘనంగా ‘ఒక లైలా కోసం..’ ఆడియో రిలీజ్ ‘విజయవాడంటే నాకెంతో ఇష్టం. ఐ లవ్ విజయవాడ. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నాను.’ అని హీరో అక్కినేని నాగచైతన్య అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నిర్మించిన ‘ఒక లైలా కోసం..’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆదివారం బందరురోడ్డులోని పీవీపీ స్క్వేర్స్‌లో సందడిగా జరిగింది. వేలాదిమంది అభిమానుల నడుమ ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఇంతమంది అభిమానుల మధ్య ఆడియో రిలీజ్ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. హీరోయిన్ పూజా హేగ్డే మాట్లాడుతూ ‘హలో బాగున్నారా..’ అంటూ తెలుగులో మాట్లాడటంతో అభిమానులు కేరింతలు కొట్టారు. పెద్దసంఖ్యలో వచ్చిన అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారడంతో కొద్ది నిమిషాల్లోనే కార్యక్రమం ముగించి వెళ్లిపోయారు. తొలుత కళాకారులు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. కిక్కిరిసిన పీవీపీ స్క్వేర్స్ ‘ఒక లైలా కోసం..’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ పీవీపీ స్క్వేర్‌లో జరగనున్నట్లు తెలుసుకున్న అభిమానులు సాయంత్రం 4 గంటల నుంచి పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు వేడుక జరిగే సమయూనికి పీవీపీ భవనంలోని నాలుగు అంతస్తులు, గ్రౌండ్‌ఫ్లోర్‌లో అభిమానులు కిక్కిరిసిపోయారు. దీంతో బందరురోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. వేడుకలో అపశ్రుతి ఆడియో రిలీజ్ సమయంలో మొదటి అంతస్తులో తోపులాట జరిగింది. ఇద్దరు యువకులు ఎస్కలేటర్పైగా జారుతూ కిందపడ్డారు. దీంతో ఎస్కలేటర్ అద్దాలు పగిలి వారికి గాయూలయ్యూరుు. ఈ కార్యక్రమంలో డెరైక్టర్ విజయ్‌కుమార్, మ్యూజిక్ డెరైక్టర్ అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు. -
ఈ చిన్ని లైఫ్... చేజారిపోతే రాదు!
‘‘ఇందులో నా పాత్ర ఫ్రీడమ్‌ను కోరుకుంటుంది. ఆ నేచర్‌కి తగ్గట్టుగా క్రియేట్ చేసిన ఈ ఫ్రీడమ్ సాంగ్‌ని స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయడం సబబు అనిపించింది. ఈ సినిమాలోని అంశాలన్నీ జనరంజకంగా ఉంటాయి’’ అని నాగచైతన్య చెప్పారు. ఆయన కథానాయకునిగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘ఒక లైలా కోసం’. సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరో మనస్తత్వాన్ని ఆవిష్కరించే ఫ్రీడమ్ సాంగ్ ‘ఈ చిన్ని లైఫ్ నీదే... సరదాగా సాగాలి. చేజారిపోతే రాదే... చెలరేగిపోవాలి’ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ -‘‘స్వాతంత్ర దినోత్సవం రోజున తొలి పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అందరూ పాడుకునేలా ఇందులో పాటలుంటాయి. నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు. దర్శక, నిర్మాతల సహకారం వల్ల అద్భుతమైన ఆల్బమ్ రూపొందిందని సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ చెప్పారు దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఫ్రీడమ్‌ని ఇష్టపడే కార్తీక్, నందన అనే అమ్మాయిని చూడగానే ఇష్టపడతాడు. మరి నందనను దక్కించుకోడానికి కార్తీక్ ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ. అన్ని రకాల భావోద్వేగాలూ ఉన్న కథ ఇది’’ అన్నారు. -
ఈ కథ సూపర్బ్!
‘‘విజయ్‌కుమార్ కొండా చెప్పిన కథ సూపర్బ్. ప్రేమకథలోనే ఇది ఓ వినూత్న ప్రయత్నం అవుతుంది’’ అని నాగచైతన్య అన్నారు. ‘గుండెజారి గల్లంతయ్యింది’ ఫేం విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకునిగా అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి బేబి సాగరి కెమెరా స్విచాన్ చేయగా, బేబి సత్య క్లాప్ ఇచ్చారు. అక్కినేని అమల, అఖిల్, సుశాంత్, నాగసుశీల, సుప్రియ, యార్లగడ్డ సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు చెప్పారు. తొలి షెడ్యూలు ఈ నెల 23 వరకూ జరుగుతుందని, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీ షెడ్యూల్స్ చేసి ఏప్రిల్‌లో షూటింగ్ పూర్తి చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత సాయిబాబా అన్నారు. మిస్ ఇండియా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, ప్రభు, నాజర్, ఆశిష్‌విద్యార్థి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: ప్రవీణ్ పూడి, కళ: పీఎస్ వర్మ, సమర్పణ: అక్కినేని అన్నపూర్ణ; నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్. -
ఒక లైలా కోసం...అంటున్న చైతూ?
80ల్లో వచ్చిన అక్కినేని ‘రాముడు కాదు కృష్ణుడు’ సినిమా మ్యూజికల్‌గా ఓ సెన్సేషన్. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘ఒక లైలా కోసం...’ పాటైతే అప్పటి యూత్‌ని ఓ రేంజ్లో అలరించింది. ఆ పాట ఇప్పుడెందుకు గుర్తొ చ్చిందా? అనుకుంటున్నారా! అక్కినేని అడుగు కదిపిన ఆ పాటనే... తన సినిమా టైటిల్‌గా మార్చుకుంటున్నారట అక్కినేని మనవడు నాగచైతన్య. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో చైతూ నటించనున్న చిత్రానికి ‘ఒక లైలా కోసం’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం ఈ నెలాఖరున సెట్స్‌కి వెళ్లనుందట. చైతూ కెరీర్లో గుర్తుండిపోయేలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఫిలింనగర్ సమాచారం. మిస్ ఇండియా పూజా హెగ్డే ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు తెలియాల్సి ఉంది. -
చైతూకి జోడీగా...
మిస్సిండియా పూజా హెగ్డే త్వరలో తెలుగుతెరపై తళుక్కున మెరవనున్నారు. అక్కినేని నటవారసుడు నాగచైతన్యకు జోడీగా ఈ ముద్దుగుమ్మ నటించనున్నారు. ఇంతకీ వీరిద్దరూ కలిసి నటించనుంది ఏ సినిమాలో అనుకుంటున్నారా? ‘గుండెజారి గల్లంతయ్యిందే...’ లాంటి అందమైన విజయాన్ని టాలీవుడ్‌కి అందించిన విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించనున్న చిత్రంలో వీరి జోడీ అలరించనుంది. డిసెంబర్లో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించనున్నందుకు పూజా చెప్పలేనంత ఆనందంగా ఉన్నారు. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ బ్యూటిఫుల్ మూవీ ఇదని, ఇందులో తన పాత్ర నేటి టీనేజ్ అమ్మాయిలకు ప్రతినిథిలా ఉంటుందని పూజా చెబుతున్నారు. నాగచైతన్య కూడా ఇందులో హుషారైన యువకునిగా, అన్యాయాన్ని ప్రతిఘటించే ధీరునిగా కనిపిస్తారట. అక్కినేని అభిమానులు పండగ చేసుకునేలా విజయ్‌కుమార్ కొండా ఈ చిత్రం స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.