Raj Tarun New Movie 2021: Power Play Movie Trailer Released - Sakshi
Sakshi News home page

'పవర్‌ ప్లే' ట్రైలర్‌ వచ్చేసింది..

Published Thu, Feb 4 2021 11:31 AM | Last Updated on Thu, Feb 4 2021 12:55 PM

Raj Tarun Power Play Movie Trailer Released - Sakshi

లవ్‌, కామెడీ సినిమాలకు కామా పెట్టి "పవర్‌ ప్లే"తో థ్రిల్లర్‌ మూవీ ట్రాక్‌ ఎక్కాడు హీరో రాజ్‌ తరుణ్‌. తన గత చిత్రం 'ఒరేయ్‌ బుజ్జిగా'ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండ మరోసారి ఈ సినిమాకు డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టాడు. కానీ ఈ సారి కామెడీ జోలికి పోకుండా విభిన్న కథాంశంతో క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో పవర్‌ ప్లే చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం ఉదయం రిలీజ్‌ చేశారు. ఒక్క డైలాగ్‌ లేకుండా సాగిపోయిన ఈ ట్రైలర్‌లో నేరాలు, ఘోరాలే ఎక్కువగా కనబడ్డాయి. (చదవండి: గుడ్‌ న్యూస్‌ చెప్పిన అరియానా.. యంగ్‌ హీరోతో..)

ఇదిలా వుంటే రాజ్‌ తరుణ్‌ ఈసారి కూడా హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సీన్‌లో నటించి మరోసారి రెచ్చిపోయాడు. మరి ఈ పవర్‌ ప్లేలో చివరికి ఎవరు గెలిచారు? రాజ్‌ తరుణ్‌ తన కంటి నుంచి జాలువారిన కన్నీటి బొట్లకు ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్‌ అయ్యే వరకు ఆగాల్సిందే! ఇక ఈ పవర్‌ ప్లేలో హేమల్‌ ఇంగ్లే కథానాయికగా కనిపించనుండగా పూర్ణ, మధునందన్‌, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహిధర్‌, దేవేష్‌ నిర్మిస్తున్నారు. మరోవైపు రాజ్‌ తరుణ్‌ 'సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు' ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గ‌విరెడ్డితో మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ కీలక పాత్రలో నటిస్తోంది. (చదవండి: పుష్ప’టీమ్‌కు షాక్‌.. రెండు సీన్లు లీక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement