
రంజిత్
‘‘లెహరాయి’ దర్శకుడు రామకృష్ణ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. సెన్సిబుల్ వ్యక్తి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు విజయ్‌కుమార్ కొండా అన్నారు. రంజిత్, సౌమ్యా మీనన్, గగన్ విహారి ముఖ్య పాత్రల్లో రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విజయ్‌కుమార్ కొండా విడుదల చేశారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. రామకృష్ణ భవిష్యత్‌లో పెద్ద దర్శకుడవుతాడు’’ అన్నారు. ‘‘మంచి కాన్సెప్‌్టతో వస్తున్న మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మద్దిరెడ్డి శ్రీనివాస్. ‘‘ఫ్యామిలీ ఎమో షన్స్ మిళితమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు రామకృష్ణ పరమహంస.
Comments
Please login to add a commentAdd a comment