ఐ లవ్ విజయవాడ
- సినీహీరో అక్కినేని నాగచైతన్య
- విజయవాడలో ఘనంగా ‘ఒక లైలా కోసం..’ ఆడియో రిలీజ్
‘విజయవాడంటే నాకెంతో ఇష్టం. ఐ లవ్ విజయవాడ. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాను.’ అని హీరో అక్కినేని నాగచైతన్య అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నిర్మించిన ‘ఒక లైలా కోసం..’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆదివారం బందరురోడ్డులోని పీవీపీ స్క్వేర్స్‌లో సందడిగా జరిగింది. వేలాదిమంది అభిమానుల నడుమ ఆడియో విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఇంతమంది అభిమానుల మధ్య ఆడియో రిలీజ్ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. హీరోయిన్ పూజా హేగ్డే మాట్లాడుతూ ‘హలో బాగున్నారా..’ అంటూ తెలుగులో మాట్లాడటంతో అభిమానులు కేరింతలు కొట్టారు. పెద్దసంఖ్యలో వచ్చిన అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారడంతో కొద్ది నిమిషాల్లోనే కార్యక్రమం ముగించి వెళ్లిపోయారు. తొలుత కళాకారులు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది.
కిక్కిరిసిన పీవీపీ స్క్వేర్స్
‘ఒక లైలా కోసం..’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ పీవీపీ స్క్వేర్‌లో జరగనున్నట్లు తెలుసుకున్న అభిమానులు సాయంత్రం 4 గంటల నుంచి పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు వేడుక జరిగే సమయూనికి పీవీపీ భవనంలోని నాలుగు అంతస్తులు, గ్రౌండ్‌ఫ్లోర్‌లో అభిమానులు కిక్కిరిసిపోయారు. దీంతో బందరురోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది.
వేడుకలో అపశ్రుతి
ఆడియో రిలీజ్ సమయంలో మొదటి అంతస్తులో తోపులాట జరిగింది. ఇద్దరు యువకులు ఎస్కలేటర్‌పైగా జారుతూ కిందపడ్డారు. దీంతో ఎస్కలేటర్ అద్దాలు పగిలి వారికి గాయూలయ్యూరుు. ఈ కార్యక్రమంలో డెరైక్టర్ విజయ్‌కుమార్, మ్యూజిక్ డెరైక్టర్ అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు.