Oka Laila Kosam
-
నా లైలా.. అలా ఉండాలి
వొడాఫోన్ కస్టమర్లు టాలీవుడ్ హీరో నాగచైతన్యను కలసి సందడి చేశారు. ఒక లైలా కోసం కాలర్ ట్యూన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారుల్లో లక్కీ విన్నర్స్‌కు ఈ అవకాశం లభించింది. గురువారం జరిగిన ఈ ఈవెంట్లో పాల్గొన్న నాగచైతన్య అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగచైతన్యను ‘సిటీప్లస్’ పలకరించింది. ..:: శిరీష చల్లపల్లి నేను హైదరాబాద్‌లో పుట్టాను. పెరిగింది, చదువుకుంది మాత్రం చెన్నై, ముంబైలలో. స్కూల్‌డేస్‌లో సరదాగా డ్రమ్స్, గిటార్ ప్లే చేసేవాడిని. చిన్నప్పుడు సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. పెద్దయ్యాక మూవీ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. అప్పటికీ నేను ప్రిపేర్డ్‌గా లేకపోవడంతో.. మొదట్లో నో అన్నాను. తర్వాత మంచి ప్రాజెక్ట్ వ చ్చింది కదా అని కాలిఫోర్నియాలోని యాక్టింగ్ స్కూల్ ఇన్ హాలీవుడ్ స్టూడియోస్‌లో డ్యాన్స్, ఫైటింగ్ నేర్చుకున్నాను. ‘జోష్’ మూవీతో మీ ముందుకు వచ్చాను. 8 ప్యాక్కైనా రెడీ.. నేను సినిమాల మీద ఎక్స్పరిమెంట్స్ చేయలేను. కానీ, కథ నాకు సెట్ అవుతుందని అనిపిస్తే కొత్త డెరైక్టర్ అయినా హ్యాపీగా వెల్కమ్ చెప్తాను. పెర్ఫామెన్స్ బేస్డ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ప్రతి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ని డ్రీమ్ రోల్‌గా భావిస్తాను. చాలెంజింగ్ రోల్స్ కోసం ఎంతైనా కష్టపడతాను. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే 6ప్యాక్ కాదు, 8 ప్యాక్ చేయడానికి కూడా నేను రెడీ. ప్రజెంట్ సుధీర్ వర్మ డెరైక్షన్‌లో ఓ మూవీలో చేస్తున్నాను. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అదే నా ఫేవరెట్ స్పాట్.. కాలేజ్ డేస్‌లో ఇన్‌ఫాచ్యుయేషన్ నాకే కాదు అందరికీ కామనే. కానీ ఇప్పటి వరకు నేను ఎవరినీ ఇష్టపడలేదు. ఇక నాకు రాబోయే లైలా ఎలా ఉండాలంటారా..? ఇప్పుడున్న హీరోయిన్లనందరినీ కలిపి మిక్స్ చేస్తే వచ్చే ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో అలా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు జనరల్‌గా బైక్స్ అంటే భలే క్రేజ్. మార్కెట్లోకి వచ్చే ప్రతి బైక్‌ను ట్రై చేస్తుంటాను. ఇక ఫ్యాషన్ సంగతంటారా..! నాకు ఏదైతే కంఫర్ట్‌గా ఉంటుందో అదే ఫ్యాషన్‌ను ఫాలో అయిపోతాను. నాకు ఖాళీ దొరికినప్పుడల్లా అన్నపూర్ణ స్టూడియోస్‌లో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. హైదరాబాద్‌లో నా ఫేవరేట్ స్పాట్ కూడా అదే. -
వాళ్ల విమర్శకు నా సమాధానం ఒక్కటే...
‘‘తొలి విజయం కంటే... మలి విజయం ప్రాధాన్యం ఎక్కువ. అది దక్కితే కలిగే ఆనందమే వేరు. ప్రస్తుతం ఆ ఆనందంలోనే ఉన్నాను’’ అంటున్నారు దర్శకుడు విజయ్‌కుమార్ కొండా. ‘గుండె జారి గల్లంతయ్యిందే’తో మంచి దర్శకుడు అనిపించుకున్నవిజయ్కుమార్ తన రెండో సినిమానే అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థకు చేసే అవకాశం దక్కించుకొని ‘ఒక లైలా కోసం’ చేశారు. గత వారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్న విజయ్‌కుమార్ సోమవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే... ‘‘ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా... సుఖంగా ఉండాలని కోరుకునేవాడే నా దృష్టిలో నిజమైన ప్రేమికుడు. ఒక అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవడం చాలా కష్టమైన విషయం. ఇదే ప్రధానాంశంగా తీసుకొని ‘ఒక లైలా కోసం’ తీశాను. మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలతో కూడిన పొయిటిక్ ప్రేమకథ ఇది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కథ తయారు చేశాను. చూసిన వారందరూ బాగుందని అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇందులో హీరో పాత్రకు ఎలాంటి లక్ష్యం లేదా? అనే విమర్శ వినిపించింది. దానికి సమాధానం ఒక్కటే... ఒక అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవడానికి మించిన గొప్ప లక్ష్యం ఈ ప్రపంచంలో వేరే ఉండదు. ఆ తర్వాత విజయాలన్నీ వాటంతట అవే వచ్చి చేరతాయి. నిజాయతీగా అమ్మాయి ప్రేమను గెలిచిన ఎవరైనా జీవితాన్ని కూడా గెలుస్తారు. ఈ సినిమాలో నేను చెప్పింది అదే. హీరోగా నాగచైతన్య వంద శాతం న్యాయం చేశాడు. ఈ సినిమా నటునిగా ఆయనను మరో మెట్టుపై కూర్చొబెట్టింది.’’ -
అప్పట్లో నాన్నగారు... తర్వాత నేను...ఇప్పుడు చైతు.. : నాగార్జున
‘‘మజ్ను, గీతాంజలి చిత్రాలతో నాకు రొమాంటిక్ హీరో ఇమేజ్ వచ్చింది. ‘శివ’ తర్వాత నేను యాక్షన్ హీరో అనిపించుకున్నాను. నాగచైతన్యకు కూడా యాక్షన్ ఇమేజ్ రావడానికి కాస్త టైమ్ పడుతుంది. తప్పకుండా త్వరలో మంచి యాక్షన్ హీరో అనిపించుకుంటాడు’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ -‘‘అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఫీల్‌గుడ్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. నాన్నగారు ఎక్కువ శాతం అలాంటి చిత్రాల్లోనే నటించారు. నన్ను కూడా అలాంటి సినిమాల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. అలాగే ఇప్పుడు చైతూను కూడా. మా కుటుంబానికి ఇలాంటి కథలే నప్పుతాయేమో. నాగచైతన్యకు ఏమాయ చేశావె, 100%లవ్ చిత్రాలతో లవర్‌బోయ్ ఇమేజ్ ఎప్పుడో వచ్చేసింది. ఈ సినిమా కూడా వాటి తరహా రొమాంటిక్ ఎంటర్టైనరే. ఇందులో చైతూ పరిణతి చెందిన కుర్రాడిగా నటించాడు. నటునిగా చైతూని మరింత ఎత్తులో నిలబట్టే సినిమా ఇది’’ అని అన్నారు. ఫీల్‌గుడ్ సినిమా ఇదని, పూజా గ్లామర్, అలీ కామెడీ అందరికీ నచ్చుతాయనీ నాగచైతన్య చెప్పారు. ఏ ప్రేమికుడూ ఏ ప్రేయసికీ ఇవ్వని బహుమతిని ఈ సినిమాలో హీరోయిన్‌కి హీరో ఇస్తాడని, అదేంటో తెరపైనే చూడాలనీ, ప్రతిష్ఠాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన 25వ చిత్రానికి తాను దర్శకుణ్ణి కావడం ఆనందంగా ఉందని విజయ్‌కుమార్ కొండా చెప్పారు. పాటలకు మంచి స్పందన లభిస్తోందని అనూప్ ఆనందం వెలిబుచ్చారు. ఇందులో హీరోయిన్గా చేయడం కాస్త కష్టంగా అనిపించిందనీ, అయితే... అవుట్‌పుట్ చూశాక చాలా సంతోషం అనిపించిందనీ పూజా హెగ్డే అన్నారు. -
‘ఒక లైలా కోసం’ మూవీ ప్రస్ మీట్
-
ఒక లైలా కోసం మజ్నూ
-
నా లైలా ట్రయల్స్‌లో నేనున్నాను : నాగ చైతన్య
‘‘భారీ నిర్మాణం, వాణిజ్య అంశాల వల్ల సినిమాలు విజయం సాధిస్తాయంటే నమ్మను. దేనికైనా కథ ముఖ్యం. ఆ కథ ద్వారా ప్రేక్షకులకు సరైన వినోదాన్ని పంచడం ముఖ్యం’’ అని నాగచైతన్య అంటున్నారు. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు నాగచైతన్య. మీ తాతగారి పాటలోని పల్లవిని సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు. ఆ ఆలోచన ఎవరిది? దర్శకునిదే. కథకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఓ అమ్మాయి కోసం ఓ అబ్బాయి చేసిన ప్రయత్నాలేంటి? ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి ఎంత దూరం వెళ్లాడు? అనేది ఈ సినిమా కథ. తాతగారి ‘రాముడుకాదు కృష్ణుడు’ సినిమాలోని ‘ఒక లైలాకోసం’ పాట పెద్ద హిట్. క్రేజ్ కూడా ఉంటుంది కదా. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఆ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ కూడా చేశాం. నిజంగా ఆ పాటను రీమిక్స్ చేయడం కత్తిమీద సామే. రీమిక్స్‌లకు అనూప్‌రూబెన్స్ త్వరగా ఒప్పుకోడు. కానీ... సందర్భం చెప్పి, పాట వినిపించగానే ఒప్పుకున్నాడు. ఇంతకు ముందు ప్రేమకథలు చేశారు కదా. వాటికీ దీనికి తేడా ఏంటి? వాటితో పోలిస్తే ఇది పరిణతి చెందిన కుర్రాడి ప్రేమకథ. గ్రాడ్యుయేషన్ పూర్తయిన కుర్రాడిగా ఇందులో కనిపిస్తా. ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. నాకేమో పెళ్లంటే ఆసక్తి ఉండదు. అలాంటి వాడు ప్రేమలో పడితే ఏమవుతుంది? అనేది ఈ సినిమా. నా ‘100% లవ్’ సినిమాలాగే పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. తుఫాన్ బీభత్సం వల్ల ఆంధ్రా పరిస్థితి బావుండలేదు కదా. ఈ టైమ్‌లో విడుదల కరెక్టేనా? నష్టం ఉంటుంది. సిద్ధపడే విడుదల చేస్తున్నాం. వారికి ఎదురైన నష్టంతో పోలిస్తే మన నష్టం ఏముంది చెప్పండి. చాలా బాధగా ఉంది. ఈ సినిమా విడుదలకు కావాల్సిన అన్ని పనులూ పూర్తయిపోయాయి. అందుకే తప్పడంలేదు. నాగార్జునగారు సినిమా చూసి కొన్ని మార్పులు చెప్పారట? ఒక సినిమాతో చాలారోజులుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ప్రతి సన్నివేశం మనకు బాగానే ఉంటుంది. కానీ... కొత్తగా చూసేవారికి తెలుస్తుంది అందులోని లోపాలు. రీసెంట్గా నాన్న చూసి కొన్ని మార్పులు సూచించారు. మాకు సబబే అనిపించి రీషూట్ చేశాం. అంటే మీ సినిమాల విషయం మీ నాన్నగారి జోక్యం ఉంటుందన్నమాట? కథలు నేనే వింటాను. నాకు నచ్చాక నాన్నగారిని వినమంటాను. హీరోగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావాలనేది నాన్నగారి కోరిక. అందుకే సలహాలిస్తుంటారు. నేను సొంతంగా నిర్ణయం తీసుకోవడమే నాన్నకు ఇష్టం. రెండు సినిమాలు ఫ్లాపైనా పర్లేదు.. అనుభవం వస్తుందంటారు నాన్న. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. పబ్లిసిటీ వ్యవహారాలు కూడా నేనే చూసుకుంటున్నా. స్టార్ హీరోల భారీ పారితోషికాల వల్లే నిర్మాణ వ్యయం పెరిగిపోతోందనీ, తద్వారా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు వాటిల్లుతున్నాయనే విమర్శపై మీ కామెంట్? నేను సినిమా ఒప్పుకునే ముందు బడ్జెట్ ఎంతో తెలుసుకుంటాను. సేఫ్ అనుకున్న తర్వాతే ముందుకెళ్తా. మనం చేసే సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదనేది నా సిద్ధాంతం. సినిమా ఫ్లాపైతే ఆ నష్టాన్ని హీరోలు భరించాలనే వాదనను ఏకీభవిస్తారా? సినిమా అనేది సమష్టి కృషి. ఒకరి వల్ల హిట్ అవ్వదు. ఒకరి వల్ల ఫ్లాప్ అవ్వదు. యూనిట్ మొత్తం కలిసి నష్టాన్ని భరిస్తామంటే నేనూ సిద్ధమే. అఖిల్ సినిమా ఎప్పుడు? కథలు వింటున్నాడు. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఏమైనా సందేహాలు ఉంటే అడుగుతుంటాడు. ఫైనల్ నిర్ణయం మాత్రం తనదే. మీ నెక్ట్స్ సినిమాలు? సుధీర్‌వర్మ దర్శకత్వంలో చేస్తున్నాను. మిగిలినవి చర్చల దశలో ఉన్నాయి. ఇంతకీ మీ లైలా తారసపడిందా? పెళ్లెప్పుడు? ఇంట్లో వాళ్లు కూడా అడిగారు. చూడమని చెప్పాను. వారి ప్రయత్నాల్లో వారున్నారు. నా లైలా ట్రయల్స్‌లో నేనున్నాను (నవ్వుతూ). -
లైలాను చెక్కుతున్న నాగ్?
-
ఒక లైలా కోసం మూవీ న్యూ స్టిల్స్
-
ఒక లైలా కోసం మూవీ పోస్టర్స్
-
'నాగచైతన్య' ఒక లైలా కోసం మూవీ స్టిల్స్
-
ఐ లవ్ విజయవాడ
సినీహీరో అక్కినేని నాగచైతన్య విజయవాడలో ఘనంగా ‘ఒక లైలా కోసం..’ ఆడియో రిలీజ్ ‘విజయవాడంటే నాకెంతో ఇష్టం. ఐ లవ్ విజయవాడ. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నాను.’ అని హీరో అక్కినేని నాగచైతన్య అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నిర్మించిన ‘ఒక లైలా కోసం..’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆదివారం బందరురోడ్డులోని పీవీపీ స్క్వేర్స్‌లో సందడిగా జరిగింది. వేలాదిమంది అభిమానుల నడుమ ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఇంతమంది అభిమానుల మధ్య ఆడియో రిలీజ్ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. హీరోయిన్ పూజా హేగ్డే మాట్లాడుతూ ‘హలో బాగున్నారా..’ అంటూ తెలుగులో మాట్లాడటంతో అభిమానులు కేరింతలు కొట్టారు. పెద్దసంఖ్యలో వచ్చిన అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారడంతో కొద్ది నిమిషాల్లోనే కార్యక్రమం ముగించి వెళ్లిపోయారు. తొలుత కళాకారులు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. కిక్కిరిసిన పీవీపీ స్క్వేర్స్ ‘ఒక లైలా కోసం..’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ పీవీపీ స్క్వేర్‌లో జరగనున్నట్లు తెలుసుకున్న అభిమానులు సాయంత్రం 4 గంటల నుంచి పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు వేడుక జరిగే సమయూనికి పీవీపీ భవనంలోని నాలుగు అంతస్తులు, గ్రౌండ్‌ఫ్లోర్‌లో అభిమానులు కిక్కిరిసిపోయారు. దీంతో బందరురోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. వేడుకలో అపశ్రుతి ఆడియో రిలీజ్ సమయంలో మొదటి అంతస్తులో తోపులాట జరిగింది. ఇద్దరు యువకులు ఎస్కలేటర్పైగా జారుతూ కిందపడ్డారు. దీంతో ఎస్కలేటర్ అద్దాలు పగిలి వారికి గాయూలయ్యూరుు. ఈ కార్యక్రమంలో డెరైక్టర్ విజయ్‌కుమార్, మ్యూజిక్ డెరైక్టర్ అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు. -
ఒక లైలా కోసం ఫస్ట్‌లుక్
-
చైతూ భలే రొమాంటిక్: పూజా హెగ్డే
యువ హీరో అక్కినేని నాగచైతన్య చాలా రొమాంటిక్ అని, అతడు రొమాంటిక్ సినిమాలకు బాగా సూటవుతాడని హీరోయిన్ పూజా హెగ్డే చెబుతోంది. చైతూతో కలిసి 'ఒక లైలా కోసం' సినిమాతో తొలిసారిగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న పూజ.. తన హీరోను ఆకాశానికి ఎత్తేసింది. ''రొమాంటిక్ సినిమాల్లో చేయడానికి చైతూ ప్రత్యేకంగా ఏమీ కృషి చేయాల్సిన అవసరం లేదు. అతడు అలాంటి సినిమాలకు చాలా బాగా సూటవుతాడు. రొమాంటిక్ పాత్రలకు అతడు కచ్చితంగా సరిపోతాడు. అందుకే అలాంటి సినిమాలకు అతడైతేనే బాగుంటుంది అని పూజ చెప్పింది. కొండా విజయకుమార్ దర్శకత్వం వహించిన 'ఒక లైలా కోసం' సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. -
గిలిగింతలు పెట్టే ప్రేమకథ
‘ఒక లైలా కోసం... తిరిగాను దేశం’ అంటూ... ‘రాముడు కాదు కృష్ణుడు’లో అక్కినేని చిందేస్తుంటే... నాటి యువతరం ఆనందంతో ఊగిపోయారు. ఆ మాటకొస్తే ఆ పాట ఎవర్ గ్రీన్. వింటే... ఇప్పటి యువతరానికీ కిక్కెక్కించక మానదు. అందుకేనేమో... తాత పాట పల్లవిలోని తొలి పదాన్ని మనవడు నాగచైతన్య టైటిల్‌గా పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం ‘ఒక లైలా కోసం’ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయకుమార్ కొండా దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. మనసుల్ని గిలిగింతలు పెట్టే కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందుతోందనీ, చైతూ కెరీర్లో మెమరబుల్ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. త్వరలోనే ఈ సినిమా ప్రచార చిత్రాలను, ఆడియోను విడుదల చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. నాజర్, బ్రహ్మానందం, అలీ, ఆశిష్ విద్యార్థి, ప్రగతి, సుధ, దీక్షా పంత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, కూర్పు: ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా, సమర్పణ: శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ. -
'నాగచైతన్య' ఒకలైలా కోసం ఫస్ట్ లుక్
-
స్విట్జర్లాండ్‌లో చైతూ-పూజా సాహసాలు
మనం విజయంతో మంచి దూకుడుమీదున్న హీరో నాగచైతన్య.. స్విట్జర్లాండ్ వెళ్లి సాహసాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ 'ఒక లైలా కోసం' చిత్రం షూటింగులో ఉన్న చైతు.. తనతో కలిసి నటిస్తున్న పూజా హెగ్డేను తీసుకుని పారాగ్లైడింగ్కు వెళ్లాడట. మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని అటు నుంచి నేరుగా వెండితెర మీదకు వచ్చేసిన పూజా హెగ్డే.. టాలీవుడ్లో తన మొట్టమొదటి సినిమాకు అక్కినేని అందగాడిని ఎంచుకుంది. వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న 'ఒక లైలా కోసం' స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుపుకొంది. అక్కడే హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి ఉత్సాహంగా పారాగ్లైడింగ్కు వెళ్లారట. నిజానికి పారాగ్లైడింగ్ అంటే చాలా సాహసంతో కూడుకున్న క్రీడ. తనకు ఎత్తు ప్రదేశాలకు వెళ్లాలంటే భయమని, అసలు చైతూ తనను పారాగ్లైడింగ్కు తీసుకెళ్తున్నట్లు కూడా తొలుత తెలియదని పూజా చెప్పింది. మొదట్లో చాలా భయం అనిపించినా, తర్వాత మాత్రం చాలా చాలా ఆనందంగా అనిపించిందని తెలిపింది. అంత ఎత్తు నుంచి స్విస్ అందాలను చూడటం అద్భుతంగా ఉందని పూజా హెగ్డే అంటోంది. చైతన్య చాలా మంచి సహనటుదని, తామిద్దరం ఒకే వయసు వాళ్లం కావడంతో తమ మధ్య మాటలు కూడా చాలా సరదాగా ఉంటాయని సంబరంగా చెప్పింది. చైతు తాను అనుకునేదానికన్నా చాలా మంచి డాన్సర్ అని, కానీ తన మీద మాత్రం అతగాడికి నమ్మకం లేదని బుంగమూతి పెట్టుకుంది. షూటింగ్ సమయంలో కూడా తన ఆహారపు అలవాట్ల విషయంలో చాలా కచ్చితంగా ఉంటూ మంచి ఫిట్నెస్ పాటిస్తాడని వివరించింది. (ఇంగ్లీషులో ఇక్కడ చదవండి) -
ఒక లైలా కోసం...అంటున్న చైతూ?
80ల్లో వచ్చిన అక్కినేని ‘రాముడు కాదు కృష్ణుడు’ సినిమా మ్యూజికల్‌గా ఓ సెన్సేషన్. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘ఒక లైలా కోసం...’ పాటైతే అప్పటి యూత్‌ని ఓ రేంజ్లో అలరించింది. ఆ పాట ఇప్పుడెందుకు గుర్తొ చ్చిందా? అనుకుంటున్నారా! అక్కినేని అడుగు కదిపిన ఆ పాటనే... తన సినిమా టైటిల్‌గా మార్చుకుంటున్నారట అక్కినేని మనవడు నాగచైతన్య. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో చైతూ నటించనున్న చిత్రానికి ‘ఒక లైలా కోసం’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం ఈ నెలాఖరున సెట్స్‌కి వెళ్లనుందట. చైతూ కెరీర్లో గుర్తుండిపోయేలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఫిలింనగర్ సమాచారం. మిస్ ఇండియా పూజా హెగ్డే ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు తెలియాల్సి ఉంది.