చైతూ భలే రొమాంటిక్: పూజా హెగ్డే | Chaitanya most suitable for romantic films, says Pooja Hegde | Sakshi
Sakshi News home page

చైతూ భలే రొమాంటిక్: పూజా హెగ్డే

Published Wed, Aug 13 2014 11:51 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

చైతూ భలే రొమాంటిక్: పూజా హెగ్డే - Sakshi

చైతూ భలే రొమాంటిక్: పూజా హెగ్డే

యువ హీరో అక్కినేని నాగచైతన్య చాలా రొమాంటిక్ అని, అతడు రొమాంటిక్ సినిమాలకు బాగా సూటవుతాడని హీరోయిన్ పూజా హెగ్డే చెబుతోంది. చైతూతో కలిసి 'ఒక లైలా కోసం' సినిమాతో తొలిసారిగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న పూజ.. తన హీరోను ఆకాశానికి ఎత్తేసింది.

''రొమాంటిక్ సినిమాల్లో చేయడానికి చైతూ ప్రత్యేకంగా ఏమీ కృషి చేయాల్సిన అవసరం లేదు. అతడు అలాంటి సినిమాలకు చాలా బాగా సూటవుతాడు. రొమాంటిక్ పాత్రలకు అతడు కచ్చితంగా సరిపోతాడు. అందుకే అలాంటి సినిమాలకు అతడైతేనే బాగుంటుంది అని పూజ చెప్పింది. కొండా విజయకుమార్ దర్శకత్వం వహించిన 'ఒక లైలా కోసం' సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement