ఆ స్టార్‌ డైరెక్టర్‌తో నాగ చైతన్య మూవీ ! | Naga Chaitanya Movie With Director Venkat Prabhu Telugu Debut | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఆ స్టార్‌ డైరెక్టర్‌తో నాగ చైతన్య మూవీ !

Published Thu, Mar 24 2022 5:29 PM | Last Updated on Thu, Mar 24 2022 5:41 PM

Naga Chaitanya Movie With Director Venkat Prabhu Telugu Debut - Sakshi

Naga Chaitanya Movie With Director Venkat Prabhu Telugu Debut: అక్కినేని వారసుడు, టాలీవుడ్​ గుడ్​ బ్యాయ్​ నాగ చైతన్య వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవల లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్‌ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య నటించిన 'థాంక్యూ', బాలీవుడ్‌ ఫస్ట్‌ మూవీ 'లాల్‌ సింగ్‌ చద్దా' విడుదలకు సిద్ధమవుతున్నాయి. రీసెంట్‌గా డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య దూత అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్‌ సిరీస్‌కు 'థాంక్యూ' డైరెక్టర్‌ విక్రమ్ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవే కాకుండా తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో చైతూ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరో కాదు ఇటీవల 'మానాడు' సినిమాతో హిట్‌ కొట్టిన వెంకట్‌ ప్రభు. 

చదవండి: నాగ చైతన్య సరికొత్త లుక్​.. సోషల్​ మీడియాలో వైరల్

సరోజ, గోవా, పార్టీ, గ్యాంబ్లర్, బిర్యానీ, రాక్షసుడు, మానాడు వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ యాక్షన్ మూవీస్‌తో ఎంటర్‌టైన్‌ చేశారు వెంకట్‌ ప్రభు. తాజాగా ఈ డైరెక్టర్‌తో నాగ చైతన్య ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్‌ ప్రభు ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ మూవీలో చైతూ సరసన హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే యాక్ట్‌ చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వర్క్‌అవుట్‌ అయితే ఈ సినిమాతో వెంకట్‌ ప్రభు తెలుగులో మొదటి డెబ్యూగా ఎంట్రీ ఇచ్చినట్లే. ఇవే కాకుండా నాగ చైతన్య కిశోర్‌ తిరుమల, రాహుల సంకృత్యాన్, విజయ్‌ కనకమేడల, పరశురామ్‌ పెట్లా డైరెక్టర్లతో కూడా చైతు సినిమా చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 

చదవండి: ఓటీటీలోకి నాగ చైతన్య.. టైమ్​ ట్రావెల్​ కథలో జర్నలిస్ట్​గా !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement