ఒక లైలా కోసం...అంటున్న చైతూ? | Naga Chaitanya's film title Oka Laila Kosam | Sakshi
Sakshi News home page

ఒక లైలా కోసం...అంటున్న చైతూ?

Published Fri, Dec 6 2013 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

ఒక లైలా కోసం...అంటున్న చైతూ?

ఒక లైలా కోసం...అంటున్న చైతూ?

80ల్లో వచ్చిన అక్కినేని ‘రాముడు కాదు కృష్ణుడు’ సినిమా మ్యూజికల్‌గా ఓ సెన్సేషన్. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘ఒక లైలా కోసం...’ పాటైతే అప్పటి యూత్‌ని ఓ రేంజ్‌లో అలరించింది. ఆ పాట ఇప్పుడెందుకు గుర్తొ చ్చిందా? అనుకుంటున్నారా! అక్కినేని అడుగు కదిపిన ఆ పాటనే... తన సినిమా టైటిల్‌గా మార్చుకుంటున్నారట అక్కినేని మనవడు నాగచైతన్య. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో చైతూ నటించనున్న చిత్రానికి ‘ఒక లైలా కోసం’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. 
 
 అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం ఈ నెలాఖరున సెట్స్‌కి వెళ్లనుందట. చైతూ కెరీర్‌లో గుర్తుండిపోయేలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఫిలింనగర్ సమాచారం. మిస్ ఇండియా పూజా హెగ్డే ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement