వరుణ్ తేజ్ మరో సినిమా ఓకె చేశాడు..?
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, ఇప్పుడు కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ల మీద దృష్టి పెట్టిన వరుణ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట.
ప్రస్తుతం కామెడీ స్పెషలిస్ట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమాతో పాటు కాఫీలాంటి సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాల షూటింగ్లు ఒకేసారి కానిచ్చేస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మూడో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్లను అందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.