వన్.. టు.. త్రీ.. రెడీ!
ప్రస్తుతం వరుణ్‌తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చిత్రాలను ఏకకాలంలో చేస్తున్నారు. సుమారు ఏడెనిమిది నెలలు ఈ రెండు చిత్రాలతో వరుణ్ బిజీ. మధ్యలో కాలికి గాయం కావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, ఇటీవలే చిత్రీకరణలో పాల్గొనడం మొదలుపెట్టారు. త్వరలో ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తి కానుంది.
ఆ వెంటనే ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రంతో బిజీ అవుతారు. ‘జ్ఙాపకం’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించిన వెంకీ అట్లూరి దర్శకుడిగా మారుతున్న ఈ ప్రేమకథా చిత్రంలో వరుణ్‌తేజ్‌కి జోడీగా మెహరీన్ కౌర్ నటించనున్నారు. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెడతారని సమాచారం. మొత్తం మీద ఈ ఏడాది వరుణ్‌తేజ్ మూడు సినిమాలు విడుదల చేసేలా కనపడుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.