mister
-
జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్, వాళ్లకు మాత్రమే ఆహ్వానం..!
-
శ్రీనువైట్లకు హీరో దొరికాడా..?
ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీనువైట్ల, వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చే సరికి పూర్తిగా డీలా పడిపోయాడు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ సినిమాలతో నిరాశపరిచిన శ్రీనువైట్ల కొంత కాలంగా నెక్ట్స్ సినిమా కోసం కథా కథనాలు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీనువైట్ల తో సినిమా చేసే హీరో ఎవరన్న చర్చ జరుగుతోంది. అయితే శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేసేందుకు రవితేజ ముందుక వచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. నీ కోసం సినిమాతో తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చిన శ్రీనువైట్ల కోసం రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సినిమాను మంచి సక్సెస్ సాధించటంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - మిస్టర్
-
మిస్టర్కు కత్తెర..!
వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించాయని భావిస్తున్న చిత్రయూనిట్, ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగింది. అనవసరమైన కామెడీ సీన్స్‌తో పాటు కొన్ని బోరింగ్ సన్నివేశాలను ట్రిమ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో రిచ్ విజువల్స్‌తో పాటు కామెడీ కూడా బాగానే వర్క్ అవుట్ కావటంతో సెకండ్‌హాఫ్‌లో పది నిమిషాల మేర ట్రిమ్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం యూనిట్ సభ్యులు ఇదే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో కమర్షియల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొవచ్చని భావించిన వరుణ్ మిస్టర్ టాక్‌పై అసంతృప్తిగా ఉన్నాడు. తన కెరీర్‌కు ఎంతో కీలకమైన సినిమా అయినా.. శ్రీనువైట్ల కూడా రొటీన్ ఫార్ములాలో ఫాలో అవ్వటం అభిమానులను నిరాశపరిచింది. -
అలా నటించడం సవాలే!
‘‘దర్శకుడు శ్రీను వైట్లగారు కథ చెబుతునప్పుడు... ఈ రోజుల్లో మొబైల్స్, కంప్యూటర్స్ గురించి ఏం తెలియని అమ్మాయి ఎలా ఉంటుందోనని ఆలోచించా. ఆ ఆలోచనే చంద్రముఖి పాత్ర అంగీకరించడానికి కారణమైంది. ఏమీ తెలియని అమ్మాయిలా నటించడమంటే సవాలే. ఆ సవాల్‌ను నేను స్వీకరించా’’ అన్నారు లావాణ్యా త్రిపాఠి. వరుణ్‌తేజ్ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన సినిమా ‘మిస్టర్’లో లావణ్య ఓ హీరోయిన్గా, హెబ్బా పటేల్ మరో హీరోయిన్గా నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు సినిమా బాగుందని మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉంది. వరుణ్‌తేజ్ మంచి నటుడు. ఇప్పటి వరకూ నేను చేయనటువంటి పాత్రను ‘మిస్టర్’లో చేశా. సినిమాలో ఎక్కువగా హాఫ్ శారీస్లో కనిపిస్తా. ఇందులో రాజ వంశానికి చెందిన అమ్మాయిని కాబట్టి... దుస్తులు, నగలు అందుకు తగ్గ సై్టల్లో డిజైన్ చేయించాం. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్పోజింగ్ కాదు. పాత్రకు తగ్గట్టు నటించాలి. మిగతా సినిమాల విషయానికి వస్తే... పక్కా కమర్షియల్ సినిమా ‘రాధా’లో శర్వానంద్‌కి జోడీగా నటించా. నాగచైతన్య సరసన ఓ సినిమా చేస్తున్నా. ‘మాయవన్’ అనే తమిళ సినిమాలో సైక్రియాటిస్ట్‌గా చేశా’’ అన్నారు. -
మిస్టర్ లవ్‌స్టోరీ
రివ్యూ: మిస్టర్ చిత్రం: ‘మిస్టర్’ తారాగణం: వరుణ్‌తేజ్, లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్... కెమేరా: కేవీ గుహన్ కథ: గోపీమోహన్ మాటలు: శ్రీధర్ సీపాన సంగీతం: మిక్కీ జె. మేయర్ నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్, ‘ఠాగూర్’ మధు స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: శ్రీను వైట్ల విడుదల తేదీ: 14–ఏప్రిల్–2017 ‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళితే... ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’ అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్’. వరుణ్‌తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఇందులో లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లు. సినిమాలో ‘మిస్టర్’ ఎవరి ప్రేమను వెతుక్కుంటూ వెళ్లాడు? ఎవరి ప్రేమ అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది? ఓ లుక్కేయండి. కథ: చై (వరుణ్ తేజ్)ది సిక్స్ ఫీట్ ప్లస్ కటౌట్. ఈ కుర్రాడి అసలు పేరు పిచ్చయ్య నాయుడు.. స్పెయిన్‌లో ఉంటున్నాడు కదా, ట్రెండీగా ఉంటుందని ‘చై’ అని పెట్టుకుంటాడు. పేరొక్కటే మారింది గానీ... (ఇండియన్) పద్ధతులు, గట్రా కుర్రాడిలో ఉన్నాయండోయ్! చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం. ఓ రోజు స్పెయిన్ వస్తున్న ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రియాను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళతాడు. ప్రియాను చూడగానే ఫ్లాట్. చెప్పేదేముంది? లవ్‌లో పడిపోతాడు. కానీ, ట్విస్ట్ ఏంటంటే... ఆ అమ్మాయి ప్రియా కాదు, మీరా (హెబ్బా పటేల్). రాంగ్ అమ్మాయిని పికప్ చేసుకుంటాడు. ఆ విషయం తెలిసే సరికి ఆ అమ్మాయితో లవ్‌లో పడిపోతాడు. మీరాను మిస్ చేసుకోకూడదనీ, మిస్సెస్ చేసుకోవాలనీ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవుతాడు. దాంతో పాప స్పెయిన్‌లో ఉన్నన్ని రోజులూ తమ ఇంట్లో ఉండేలా ప్లాన్ చేస్తాడు చై. మీరా క్లోజ్‌గా మూవ్ అవుతుంటే తనతో ప్రేమలో పడిందనుకుంటాడు. కట్ చేస్తే... కుర్రాడిలో సంతోషానికి కట్ చెబుతూ.. ఆల్రెడీ ఇండియాలో సిద్ధార్థ్ (ప్రిన్స్)తో లవ్‌లో పడ్డానని మీరా షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది. అతణ్ణే పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాని ఇండియా చెక్కేస్తుంది. పాపం... పస్ట్ లవ్ ఫ్లాపైన బాధలో చై స్పెయిన్‌లో చక్కర్లు కొడుతుంటాడు. సడన్‌గా మీరాను నుంచి ఫోన్... సిద్ధార్థ్ హ్యాండిచ్చాడని చెబుతుంది. ఇంకో కుర్రాడైతే ఛాన్స్ మళ్లీ రాదని మీరాను బుట్టలో వేసుకోవాలని ప్లానులు, గట్రా వేసేవాడేమో? ‘చై’ మాత్రం మీరా లవ్‌కి హెల్ప్ చేయాలని ఇండియా వెళతాడు. ఎందుకంటే... కొంచెం కల్చర్ ఉన్న కుర్రాడు, అందరికీ ప్రేమను పంచాలనే గుణం ఉన్నవాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్... మీరాకు హెల్ప్ చేసే టైమ్‌లో నచ్చని పెళ్లి చేస్తున్నారని ఇంటినుంచి పారిపోయి వచ్చిన చంద్రముఖి (లావణ్యా త్రిపాఠి) చైకు పరిచయం అవుతుంది. రాయల వంశానికి చెందిన అమ్మాయి తను. ఆమెను కొందరు అత్యాచారం చేయబోయేతే చై కాపాడతాడు. చంద్రముఖి అతణ్ణి లవ్ చేయడం మొదలు పెడుతుంది. ఈలోపు రాయల వంశస్తులు తమ ఇంటి ఆడపిల్లను చై లేవదీసుకుపోయాడనుకుని, చంపేయాలనుకుంటారు. చైని బంధించి, రాజ దర్బారులో మరణ శిక్ష ఖరారు చేస్తారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్.. మనసు మార్చుకుని చంద్రముఖిని చైకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఇప్పుడింకో ట్విస్ట్. మీరా కూడా మనసు మార్చుకుంటుంది. చైని లవ్ చేయడం మొదలుపెడుతుంది. అతడూ ఆమెను లవ్ చేస్తున్నాడని తెలుసుకుంటుంది. దాంతో చంద్రముఖిని సాఫ్ట్‌గా సైడ్ చేసి, ‘చై’తో సెటిల్ కావాలనుకుంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఇద్దరు అమ్మాయిలకూ ఓ కథ ఉన్నట్లే చైకి కూడా ఓ స్టోరీ ఉంది. ఇండియాలో ఉన్న తాతయ్యను కలవడానికి ఈ మనవడు ఇష్టపడడు. తాతయ్య అంటే చైకి ఎందుకు కోపం? తాతయ్యను కలిశాడా? లేదా? ఇద్దరమ్మాయిల్లో ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? ‘చై’ను పై లోకాలకు పార్శిల్ చేయాలనుకున్న చంద్రముఖి ఫ్యామిలీ ఎందుకు నిర్ణయం మార్చుకుంది? అసలు ‘చై’ బ్యాగ్రౌండ్ ఏంటి? అనేవన్నీ చెప్పేస్తే.... సినిమా చూడబోయే ప్రేక్షకులకు థ్రిల్ మిస్ అవుతుంది. విశ్లేషణ: మొత్తం ముగ్గురి కథలతో, ఆ కథలతో సంబంధం ఉన్న పాత్రలతో కొత్త డిజైన్‌లో న్యూ అప్రోచ్‌లో స్క్రీన్‌ప్లే అల్లినట్లుగా అనిపిస్తుంది. అందరివీ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలే. తెరనిండా ఆర్టిస్టులే. వరుణ్‌తేజ్ కామెడీ టైమింగ్, డ్యాన్స్, యాక్షన్ బాగున్నట్లు అనిపిస్తాయి. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ తమ పాత్రలకు న్యాయం చేయడానికి కృషి చేశారు. రఘుబాబు ‘ఊపిరి’ స్పూఫ్, దర్శకుడి పాత్రలో పృథ్వీ కామెడీ ట్రాక్, గాంధేయవాదంతో షకలక శంకర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనికెళ్ల భరణి, నాజర్, మురళీ శర్మ, రమేష్ అరవింద్‌ల నటనకు వంక పెట్టలేం. కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ ఐ–ఫీస్ట్‌గా ఉంటుంది. మిక్కీ జె. మేయర్ బాణీల్లో ‘ప్రియ స్వాగతం...’, ‘సయ్యోరే సయ్యోరే...’ క్యాచీగా ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్‌లో రిచ్‌నెస్ కనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ శ్రీను వైట్ల మార్క్ టేకింగ్, కామెడీ టైమింగ్‌తో సాగే కమర్షియల్ ఫార్మాట్ మూవీ ఇది. -
'మిస్టర్' మూవీ రివ్యూ
టైటిల్ : మిస్టర్ జానర్ : కామెడీ ఫ్యామిలీ డ్రామా తారాగణం : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్,నికితిన్ థీర్, నాజర్, తనికెళ్ల భరణి, రాజేష్.... సంగీతం : మిక్కీ జె మేయర్ దర్శకత్వం : శ్రీను వైట్ల నిర్మాత : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు వరుసగా స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన శ్రీనువైట్ల రెండు ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డాడు. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ నటుడిగా ఫుల్ మార్క్స్ సాధిస్తున్నా, కమర్షియల్ హీరోగా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమా మిస్టర్. మరి ఈ మిస్టర్.. వరుణ్, శ్రీనుల కెరీర్ ను గాడిలో పెట్టిందా..? మరోసారి శ్రీనువైట్ల కామెడీ టైమింగ్ వర్క్ అవుట్ అయ్యిందా..? తొలి సారిగా పక్కా కమర్షియల్ ఫార్ములా కామెడీ ఎంటర్టైనర్ లో నటించిన వరుణ్ తేజ్ ఎంత వరకు ఆకట్టుకున్నాడు..? కథ : పిచ్చయ్య నాయుడు( నాజర్) ఆంధ్రా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పది గ్రామాలకు పెద్ద, ఆ ఊరి కట్టుబాటు ప్రకారం పదేళ్లకొకసారి సంక్రాంతి సందర్భంగా జరిగే కర్రసాము పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికే ఆ గ్రామాల మీద పెత్తనం చేసే అధికారం ఉంటుంది. నలబై ఏళ్లుగా పిచ్చయ్యనాయుడు చేతుల్లోనే ఆ అధికారం ఉంటుంది. పది ఊళ్లను శాసించే స్థాయి ఉన్నా.. తనకు ఉన్న ఒక్కగానొక్క మనవడి(వరుణ్ తేజ్) ప్రేమకు దూరమై బాధపడుతుంటాడు. అయితే ఆ గ్రామాల చుట్టూ ఉన్న అడవుల్లో ఎర్ర చందనంతో పాటు రంగురాళ్లు కూడా ఉండటంతో బిజినెస్ మేన్ రాహుల్ వడయార్(నికితిన్ ధీర్) ఆ గ్రామాల మీద కన్నేస్తాడు. పిచ్చయ్యనాయుడు ప్రత్యర్థి గుండప్ప(తనికెళ్లభరణి)తో కలిసి పిచ్చయ్యానాయుడును సంక్రాంతి పోటిల్లో ఒడించి ఆ గ్రామాల మీద పెత్తనం సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. చై అలియాస్ పిచ్చయ్య నాయుడు (వరుణ్ తేజ్) తన కుటుంబంతో కలిసి స్పెయిన్‌లో ఉండే తెలుగు కుర్రాడు. తను ప్రేమించిన వారికోసం ఎంత రిస్క్ అయినా చేయటం చైకి అలవాటు. అలాంటి చైకి ఒకసారి అనుకోకుండా మీరా వెల్లంకి(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలిచూపులోనే మీరాతో ప్రేమలో పడిన చై ఎలాగైన ఆ ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమెను ఇంప్రెస్ చేస్తాడు.. కానీ అదే సమయంలో మీరా మరో అబ్బాయి ప్రేమిస్తున్నానని చెప్పి ఇండియా వెళ్లిపోతుంది. ఎన్ని రోజులు గడిచినా చై, మీరాను మర్చిపోలేకపోతాడు. ఆ సమయంలో మీరా, చైకి ఫోన్ చేసి తన ప్రేమ ఇబ్బందుల్లో ఉందని సాయం చేయమని అడుగుతుంది. మీరా కోసం ఇండియా వచ్చిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) ప్రవేశిస్తుంది. అసలు మీరా ప్రేమకథలో సమస్య ఏంటి..? చై జీవితంలోకి వచ్చిన చంద్రముఖి ఎవరు..? తన తాతకు చై ఎందుకు దూరమయ్యాడు..? రాహుల్ వడయార్ ఆట ఎలా కట్టించాడు..? చివరకు చై మీరా.. చంద్రముఖిలలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..? అన్నదే మిగతా కథ నటీనటులు : తొలి సినిమా నుంచే నటుడిగా మంచి మార్కులు సాధిస్తూ వస్తున్న వరుణ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా మెగా హీరోల ఛాయలు కనిపించినా.. తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించే ప్రయత్నం చేశాడు. లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుంది. అమాకత్వం, ప్రేమ, బాధ, భయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హెబ్బా పటేల్ కూడా అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. ప్రతినాయక పాత్రలో నికితిన్ ధీర్ సినిమాకు కావల్సినంత విలనిజం పండించాడు. డీసెంట్ లుక్స్‌లో కనిపిస్తూనే క్రూయల్ విలన్‌గా మెప్పించాడు. ఇతర పాత్రలో నాజర్, తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, చంద్రమోహన్, హరీష్ ఉత్తమన్, రాజేష్, 30 ఇయర్స్ పృధ్వీ ఇలా తెర నిండా కనిపించిన నటులు పరవాలేదనిపించారు. సాంకేతిక నిపుణులు : లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీను వైట్ల ఎక్కువగా రిస్క్ చేయకుండా తన రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. విదేశాల్లో కామెడీ ఎపిసోడ్స్, పేరడీ సీన్స్, సినిమా వాళ్ల మీద పంచ్ డైలాగ్స్, పదుల సంఖ్యలో విలన్స్ ఇలా శ్రీను గత సినిమాల్లో కనిపించిన మాసాలా ఎలిమెంట్స్ అన్నీ మిస్టర్ లోనూ కనిపించాయి. ఫస్ట్ హాఫ్‌లో స్పెయిన్ అందాలతో పాటు కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుల ఊపిరి పేరడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో అసలు కథలోకి వెళ్లకుండా కామెడీ, రొమాంటిక్ సీన్స్‌తో కథ లాగించేసిన దర్శకుడు సెకండాఫ్‌ను హడావిడిగా నడిపించాడు. వరుసగా తెరమీదకు వచ్చే కొత్త పాత్రలు, మలుపులు ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తాయి. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు కొంత పరవాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కెవి గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయ్యింది. స్పెయిన్ లోకెషన్స్ ను మరింత అందంగా చూపించిన గుహన్, చేజ్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన యాక్షన్ సీన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ : లెక్కలేనన్ని మలుపులు పాటలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అప్పన్న సన్నిధిలో సినీ డైరెక్టర్
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల గురువారం దర్శించుకున్నారు. వరుణ్‌తేజ్, హెబ్బాపటేల్, లావణ్యత్రిపాఠి నటించిన మిస్టర్ సినిమా శుక్రవారం విడుదల అవుతుండటంతో ఆ సినిమా విజయవంతం అవ్వాలని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామికి శ్రీను వైట్ల పూజలు నిర్వహించారు. సెన్సార్ స్క్రిప్టును స్వామి సన్నిధిలో ఉంచి అష్టోత్తర పూజ చేశారు. కప్పస్తంభానికి మొక్కుకున్నారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనువైట్ల స్థానిక విలేకర్లతో మాట్లాడారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే ఎంతో ఇష్టదైవమన్నారు. ప్రతీ సినిమా రిలీజ్‌కి ముందు స్వామిని దర్శించుకోవడం జరుగుతోందన్నారు. సింహగిరికి ఎప్పుడు వచ్చినా పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నారు. లక్ష్మీనరసింహ బేనర్‌పై తెరకెక్కిన మిస్టర్ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మిస్టర్ సినిమా అలరిస్తుందన్నారు. ప్రస్తుతం రెండు కథలు సిద్దం చేసుకున్నానని, తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు -
నిర్మాణ రంగంలోకి స్టార్ డైరెక్టర్..?
స్టార్ హీరోలతో వరుస సక్సెస్‌లు సాధించిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల. ప్రస్తుతం కెరీర్లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్న ఈ కామెడీ స్పెషలిస్ట్ తన లేటెస్ట్ మూవీ మిస్టర్‌తో మరో సారి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న మిస్టర్, దర్శకుడు శ్రీనువైట్లతో పాటు హీరో వరుణ్ తేజ్ కెరీర్‌కు కూడా కీలకం కానుంది. అయితే ఇటీవల కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనువైట్ల భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే దర్శకత్వంతో పాటు సొంతంగా బిజినెస్ ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నాడు. వెండితెర మీద స్టార్ ఇమేజ్ ఉన్న శ్రీనువైట్ల తన తొలి వ్యాపార ప్రయత్నం మాత్రం బుల్లితెర మీద చేస్తున్నాడు. యూట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న వైవా హర్షతో ఓ కామెడీ షోను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షోకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడిగా తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిన కామెడీ జానర్నే నిర్మాతగానూ నమ్ముకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. -
'మిస్టర్' క్లీన్
లోఫర్ సినిమాతో నిరాశపరిచిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీతో తెరకెక్కిన మిస్టర్ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికేట్‌ను అందించారు. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మించిన మిస్టర్, వరుణ్ తేజ్‌కు కమర్షియల్ హీరో ఇమేజ్ను తీసుకువస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మెగా ఫ్యాన్స్. -
నిజం ఏంటో మాకు తెలుసు!
‘‘ప్రతి హీరో అభిమాని సినీ ప్రేమికుడే. ఓ పర్టిక్యులర్ హీరోని అభిమానించడానికి ముందు సినిమాని ప్రేమిస్తాడు. తమ హీరో సినిమాలు తప్ప మిగతా వాళ్లవి అభిమానులు చూడరని అనుకుంటారు. ఎవరి అభిమానులైనా సినిమాలన్నీ చూస్తారు. అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ చూస్తేనే ఏ సినిమాకైనా వంద కోట్లు వస్తాయి. హీరోలకు ఫ్యాన్స్ బిగ్గెస్ట్ సపోర్ట్. అది కాదనడంలేదు. కానీ, వాళ్లతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ముఖ్యమే’’ అన్నారు వరుణ్ తేజ్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘మిస్టర్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. వరుణ్ చెప్పిన విశేషాలు.... ♦ ఈ ‘మిస్టర్’ అందరికీ ప్రేమను పంచుతాడు. ప్రేమే కాదు... ఎవరైనా సహాయం కావాలన్నా మిస్టర్ ముందడుగు వేస్తాడు. అలాంటి ఓ అబ్బాయికి సమస్యలు వస్తే.. అతను ప్రేమ వెతుక్కుంటూ వెళితే.. ఏం జరిగిందనేది కథ. నాకూ, హీరోయిన్లు లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌లకు వేర్వేరు కథలు (ఫ్లాష్‌బ్యాక్స్) ఉంటాయి. అవి కాకుండా మా ముగ్గురి మధ్య జరిగే కథే సినిమాకు కీలకం. ♦ శ్రీను వైట్లగారు ‘ఆనందం’, ‘నీ కోసం’... ఇలా అందమైన ప్రేమకథా చిత్రాలు చేశారు. తర్వాత స్టార్ హీరోలతో కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు చేశారు. మళ్లీ ఓ అందమైన ప్రేమకథా చిత్రం చేయాలనీ, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని ‘మిస్టర్’ తీశారు. ‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’... మూడింటిలో ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు చేశాను. ఇందులో నా వయసుకు తగ్గ లైవ్లీ క్యారెక్టర్ చేశా. ♦ శ్రీను వైట్లగారు అనే కాదు... ఏ దర్శకుడితో చేసినా వాళ్ల గత సినిమా హిట్టయ్యిందా? లేదా? అనేది చూడను. అలా ఆలోచిస్తే... నా మొదటి సినిమా, మూడో సినిమా వర్కౌట్ అవ్వలేదు. నాతో చేయాల్సిన అవసరం వాళ్లకూ లేదు. ఇంకా సక్సెస్ఫుల్ హీరోలు ఉన్నారు కదా. నాకు కథ నచ్చితే మిగతా అంశాలు ఆలోచించను. ♦ కథల ఎంపికలో నాన్నగారు జోక్యం చేసుకోరు. ‘నీకు కథ నచ్చకపోతే నువ్వు చేయలేవు. కథలో నీకు నువ్వు కనిపించాలి’ అని చెప్పారాయన. ఆయనకు నచ్చి, నాకు నచ్చని కథలు ఉన్నాయి. నాన్నగారు కాకుండా... ఫ్యామిలీలో పెదనాన్నతో ఎక్కువ క్లోజ్. యంగ్ జనరేషన్లో చరణ్ అన్నతో క్లోజ్. తేజూ (సాయిధరమ్ తేజ్) కూడా క్లోజే. తనదీ నా వయసే. మా ఫ్యామిలీ హీరోలంతా కలిస్తే సినిమాల గురించి 20 శాతం, వ్యక్తిగత విషయాల గురించి 80 శాతం డిస్కస్ చేసుకుంటాం. ‘చిరంజీవికీ, పవన్‌కల్యాణ్‌కీ పడడం లేదు’ వంటి వార్తలు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అనడిగితే... ♦ ఫ్యామిలీ మెంబర్‌గా నెగిటివ్ వార్తలు చూసినప్పుడు బిగినింగ్‌లో బాధ ఉండేది. అందులో నిజమెంత అనేది వ్యక్తిగతంగా మాకు తెలుసు. కానీ, బయటకు వచ్చి జనాలకు వివరణ ఇచ్చే పరిస్థితులు ఎదురైనప్పుడు అసౌకర్యంగా ఉంటుంది. ♦ అభిమానులపై ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకోమని పెదనాన్న, బాబాయ్‌లు చెబుతుంటారు. ‘మన ఫ్యామిలీ నుంచి ఇంతమంది (8) నటులు వచ్చారు. ఒక్కొక్కరూ ఏదో కొత్తదనం చూపకపోతే, మీ సినిమాలు చూడాల్సిన అవసరం ప్రేక్షకులకు లేదు. బయట ఆల్రెడీ చాలామంది హీరోలున్నారు. మీరు కొత్తగా ఏం చేయగలరనేది మీరు ఆలోచించుకోండి’ అని ఎప్పుడూ అంటుంటారు. మా బెస్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మంచి కథలు దొరికితే మా అంజనా బేనర్, కొణిదెల ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్‌లోనూ సినిమాలు చేయాలని ఉంది. ♦ స్టార్ దర్శకులతోనే చేయాలనే రూల్ పెట్టుకోలేదు. ‘మిస్టర్’ షూటింగ్ మధ్యలో గాయమైనప్పుడు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నా. అప్పుడు ఓ 20 కథల వరకూ విన్నాను. ‘ఫిదా’ తర్వాత కొత్త దర్శకుడు వెంకీ అట్లూరితో బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి నిర్మాణంలో సినిమా చేయబోతున్నా. -
నేను భయపడే టైప్ కాదు!
‘‘నేను ఎలాంటి చిత్రం చేసినా... ప్రేక్షకులు నా నుంచి ఆశించే వినోదం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయను. అలాగే, ఇక నుంచి ఓ చిత్రానికీ, మరో చిత్రానికీ సంబంధం లేకుండా... పూర్తి భిన్నమైన కొత్త తరహా చిత్రాలు చేయాలనే ఆలోచనతో ఉన్నా’’ అన్నారు శ్రీను వైట్ల. వరుణ్‌తేజ్ హీరోగా ఆయన దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘మిస్టర్’ ఈ నెల 14న రిలీజవుతోంది. శ్రీను వైట్ల మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు వరుణ్‌ను చూసి ‘బాగున్నాడీ అబ్బాయి’ అంటే... నాగబాబు అన్నయ్య ‘నువ్వు సినిమా తీయొచ్చుగా’ అనేవారు. తప్పకుండా అనేవాణ్ణి. ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కిన ట్రావెల్ ఫిల్మ్, ఈ ‘మిస్టర్’తో కుదిరింది. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ, డ్యాన్స్... అన్నిటిలో వరుణ్ని బాగా చూపించే ప్రయత్నం చేశా. నిర్మాతలు బుజ్జి, మధుగార్లు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. టీమ్ సపోర్ట్‌తో అనుకున్నది తీశాననే సంతృప్తి ఉంది. మంచి సినిమా తీసి ఫెయిల్ అయితే బాధ ఉంటుంది. నేను అనుకున్నట్టు చేయలేని పరిస్థితులు ‘బ్రూస్ లీ’కి వచ్చాయి. మంచి సినిమా తీయలేదు కాబట్టి ప్రేక్షకులు రిజెక్ట్ చేశారని గట్టిగా నమ్మాను. ఆ సినిమాతో ప్రేక్షకుల్ని నవ్వించలేకపోయా. ‘మిస్టర్’తో నవ్విస్తా. సక్సెస్ కోసం ఈ సినిమా తీయలేదు. ప్రేక్షకులపై ప్రేమతో తీశా. నేను ఫెయిల్యూర్స్‌కి భయపడే టైప్ కాదు. నా కెరీర్ చూస్తే... ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నేను మరింత స్ట్రాంగ్‌గా పనిచేస్తా. ‘మిస్టర్’కు అలాగే పనిచేశా. కథను చెడగొట్టకుండా అందులో కామెడీ చేయడం చాలా కష్టం. కానీ, నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులు వినోదం ఆశిస్తారు. అందుకే, నేను ఎక్కువ స్ట్రగుల్ అవుతా’’ అన్నారు. -
అసలు ప్రయాణం ఇప్పుడే...
సినిమాయే ఒక జర్నీ...పాత్రలకు, ప్రేక్షకులకు! దీంట్లో కొత్త విషయం చెప్పేది ఏముంది? కానీ, నిజానికి ఈ సినిమా డైరెక్టర్‌కి, హీరో హీరోయిన్లకు ఒక జర్నీగా మారింది. గుమ్మడికాయ కొట్టేశారు. సినిమా రిలీజ్‌కి రెడీ. కానీ, అసలు జర్నీ ఇప్పుడు మొదలవుతుంది. రిలీజ్‌కి ముందుండే ఆనందాన్ని, ఉత్కంఠనీ మీకోసం ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌గా క్యాప్చర్ చేసింది. శ్రీను వైట్లగారూ.... ‘మిస్టర్’ ఎలా, ఎప్పుడు మొదలైంది? శ్రీను వైట్ల: ఎప్పట్నుంచో అన్ని ఎమోషన్స్ ఉన్న ఓ ట్రావెల్ మూవీ చేయాలనుకుంటున్నా. 2015 డిసెంబర్లో రచయిత గోపీమోహన్ ఒక లైన్ చెప్పాడు. ఎగై్జట్‌మెంట్‌తో వెంటనే ఈ సినిమా చేద్దామన్నా. ఈ కథకు వరుణ్‌తేజ్ కరెక్ట్ అని గోపీతో అంటే, తనూ అదే అన్నాడు. అదే టైమ్‌లో నల్లమలుపు బుజ్జి, ‘ఠాగూర్’ మధుగార్లు వరుణ్‌తో సినిమా చేద్దామని వచ్చారు. అలా సెట్ అయింది. వైట్లగారు కథ వినగానే ఎగ్జయిట్ అయ్యారు. మరి మీరు? వరుణ్ తేజ్: శ్రీను వైట్లగారు గంటన్నరసేపు కథ చెప్పారు. బాగా నచ్చింది. చివరి అరగంట అయితే సూపర్. నేనూ ఎగ్జయిట్ అయ్యా. నాకు కథ నచ్చినా, నచ్చకపోయినా వెంటనే చెప్పేస్తా. దాచడం, గట్రా ఏం ఉండవు. ఒక్క డౌట్ ఉండేది. ఆయన సినిమాల్లో కామెడీ ఎక్కువుంటుంది. నేనెలా చేయగలను? అనుకున్నా. కానీ, శ్రీనూగారి హెల్ప్‌తో ఈజీగా చేసేశా. ‘మిస్టర్’ అంటే? శ్రీను: నా దృష్టిలో ‘మిస్టర్’ అంటే మంచి మనసున్నోడు. గౌరవంతో ‘మిస్టర్’ అని పిలుస్తారు కదా. ఆ పిలుపుకు 100 శాతం అర్హత వరుణ్ క్యారెక్టర్‌కు ఉంటుంది. పదిమందికి హెల్ప్ చేయాలనుకునే మనస్తత్వం ఉన్న కుర్రాడు. అందరి సంతోషం కోసం స్ట్రగుల్ అయ్యే పాత్ర. ఇంతకీ మిస్టర్‌తో ఈ ఇద్దరమ్మాయిల కనెక్షన్ ఏంటి? శ్రీను: వాళ్లిద్దరూ ఏం చేస్తారనేదే కథ. ట్రావెల్ ఫిల్మ్ కదా! హీరో (వరుణ్), మీరా (హెబ్బా) పాత్రల మధ్య కనెక్షన్ చాలా డ్రమటిక్‌గా ఉంటుంది. అలాగే, చంద్రముఖి (లావణ్యా త్రిపాఠి)తో హీరో కనెక్షన్ కూడా. వీళ్ల మధ్య ట్రావెల్ ఆసక్తిగా ఉంటుంది. వీళ్లు ఒకరికొకరు ఎలా పరిచయమయ్యారు? చివరికి, ఏ గమ్యం చేరారు? అనేది కథ. హీరోయిన్లవి నటనకు స్కోప్ ఉన్న పాత్రలే. శ్రీనూగారు! స్టార్స్‌తో సినిమాలు చేసిన మీరు యంగ్‌స్టర్స్‌తో సినిమా చేయడం ఎలా ఉంది? శ్రీను: ఎంజాయ్ చేశా. వరుణ్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యాను. అమ్మాయిలతో నేను చాలా తక్కువ మాట్లాడతా. వర్క్ వరకూ మాత్రమే డిస్కస్ చేస్తా. (‘అందుకే ఈ ఇంటర్వూ్యకి ఆయన్ను అమ్మాయిల మధ్య కూర్చోబెట్టా’ – వరుణ్) ఈ జనరేషన్ కుర్రాళ్లు ఎలా ఉంటారు? ఎలా ఆలోచిస్తారు? అనేవి వరుణ్‌తో ఎక్కువ ట్రావెల్ కావడం వల్ల అర్థం అయ్యాయి. ‘మిస్టర్’ మేకింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా. పెద్ద హిట్స్ అందుకున్న మీపై మధ్యలో వచ్చిన ఒక్క ఫ్లాప్ ప్రభావం చూపినట్టుంది? శ్రీను: అది మంచి కోసమే జరిగినట్టుంది. మనం అర్థం చేసుకోవాలి. నా సై్టల్ ఏంటి? ఒక ‘ఆనందం’ లాంటి ప్రేమకథ (సినిమా) తీశా. తర్వాత ‘వెంకీ’ చేశా. ఆ తర్వాత ‘ఢీ’ నుంచి ఓ సై్టల్‌లోకి వెళ్లా. నాతో పాటు అందరూ అటువంటి సినిమాలు చేసేశారు. సక్సెస్ కావడంతో ఎక్కువ సినిమాలు వచ్చాయి. నేను కొంచెం ఎర్లీగా ఆ ఫార్ములాను ఆపేసి ఉండాల్సింది. కానీ, ఓ దెబ్బ తగిలిన తర్వాత స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈ సినిమా చేశా. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్. నిజాయితీగా చెప్పాలంటే... కంపేర్ చేయకూడదు కానీ, ‘దూకుడు’ తర్వాత నాకంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన స్క్రిప్ట్ ‘మిస్టర్’. వరుణ్... స్టార్స్‌తో, మీ పెదనాన్న (చిరంజీవి)తో చేసిన దర్శకుడితో సినిమా అనగానే మీకు ఎలా అనిపించింది? వరుణ్: ఒక్కో దర్శకుడికి ఒక్కో సై్టల్ ఉంటుంది. పూరి జగన్నాథ్గారిది ఓ సై్టల్. వీవీ వినాయక్గారిది ఓ సై్టల్. శ్రీను వైట్లగారిది ఓ సై్టల్. దర్శకుల సై్టల్‌కి తగ్గట్టు అడాప్ట్ కావడమే మా పని. శ్రీనుగారు, ఆయన టీమ్‌తో నేను బాగా కంఫర్టబుల్‌గా ఫీలయ్యా. నాకు కష్టం అనేది తెలియలేదు. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లగానే ముందు ఆయన (శ్రీను వైట్ల) నా కేర్వాన్లోకి వచ్చి కూర్చునేవారు. ఏదో మంచి విషయం చెబుతారు. లేదంటే... మా అమ్మాయి ఇలా చేసిందనో, ఇంట్లో చెట్లు కొట్టేశారనో, మరొకటో వ్యక్తిగత విషయాలు చెబుతారు. నేను మేకప్ వేసుకునే టైమ్‌లో స్లోగా నా మైండ్‌ను రీఫ్రెష్ చేస్తారు. సీన్లోకి వెళ్లిన తర్వాత మరో ఆలోచన ఉండదు. బాగా నటించా. శ్రీను వైట్లగారు ప్రతిదీ చేసి చూపిస్తారు. ‘మీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా యాక్ట్ చేసి చూపిస్తున్నారు’ అని ఆయనతో చాలాసార్లు చెప్పాను. నేను ఆయన్ను ఇమిటేట్ చేశానంతే. మీరు బాగా యాక్ట్ చేసి, చూపిస్తారని వరుణ్ చెబుతున్నారు. మీరు హ్యాండ్సమ్గా ఉంటారు కదా. ఎవరూ నటించమని, హీరోగా చేయమని అడగలేదా? శ్రీను: అబ్బెబ్బెబ్బే... నేను ఫొటో తీయించుకోవడమే కష్టం. నాకు హీరోలంటే ఇష్టం. కానీ, హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్నుంచీ దర్శకత్వమే నా లక్ష్యం. ఎవరో జూనియర్ ఆర్టిస్టు లేకపోతే.. ‘ఆనందం’ సినిమాలోని ఓ సీన్లో నేను పరిగెత్తాల్సి వచ్చింది. ఆ సినిమా హిట్టయ్యింది. ఆ సెంటిమెంట్‌తో అప్పుడప్పుడూ ప్రేక్షకులకు తెలిసీ తెలీకుండా కనిపిస్తుంటాను. శ్రీనూగారు! వరుణ్‌లోని మంచి లక్షణాలు చెబుతారా? శ్రీను: వరుణ్‌లో నిజాయితీ కనిపిస్తుంది. సేమ్ టైమ్... బాగా తెలివైనోడు.ఇలాంటి కాంబినేషన్ చాలా తక్కువ. వరుణ్‌లో నాకా క్వాలిటీ ఇష్టం. మనుషులను బాగా అంచానా వేయగలుగుతాడు. హి ఈజ్ వెరీ కూల్. నేను తన నుంచి కూల్‌గా ఉండడం నేర్చుకున్నాను. వరుణ్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. శ్రీను వైట్లగారిలోని మంచి లక్షణాల గురించి? వరుణ్: షూటింగ్ చేసే టైమ్‌లో ఎంతసేపూ సినిమా గురించి తప్ప... మరో విషయం గురించి ఆలోచించరు. ఫ్యామిలీ లవింగ్ మ్యాన్. ‘మిస్టర్’ షూటింగు ఎక్కువ విదేశాల్లో చేశాం. అప్పుడు ‘మా అమ్మాయిలతో కబుర్లు చెబుతూ నిద్రపోయేవాణ్ణి. ఇక్కడ ఉండలేకపోతున్నాను’ అనేవారు. సక్సెస్‌ను ఆయనెప్పుడో చూశారు. కానీ, ఇప్పటికీ సినిమా ఎలా వస్తుందోననే టెన్షన్ కనిపిస్తుంది. ఒక్కరోజు కూడా ఈజీగా తీసుకోరు. బహుశా... ఆ టెన్షన్, భయమే ఆయన్నింకా డ్రైవ్ చేస్తున్నాయనిపిస్తోంది. స్పెయిన్‌లో మంచి లొకేషన్స్ కోసం పదివేల మైళ్లు రెక్కీ నిర్వహించారు. సినిమా అంటే ఆయనకు అంత ప్రేమ. అమ్మాయిలూ... వరుణ్‌లో మంచి లక్షణాలు చెప్పండి! హెబ్బా: హి ఈజ్ వెరీ కూల్. అందరితో బాగా కలసిపోతాడు. వరుణ్‌తో మాట్లాడడానికి పెద్దగా బెరుకు అనిపించదు. చాలా వినయంగా ఉంటాడు. మనం ఏం చెప్పినా వింటాడు. సంతోషం, బాధ... ఇలా మనసులో ఫీలింగ్స్‌ని అతనితో పంచుకోవచ్చు. లావణ్య: వరుణ్ మంచి యాక్టర్. (మధ్యలో హెబ్బా ‘ఓహ్.. నేనది చెప్పలేదు’ అంటే... లావణ్య ‘ఏం ఫర్వాలేదు’ నేను చెబితే నువ్వు చెప్పినట్లే) మంచి ఆర్టిస్టులతో చేసినప్పుడు మన నటన మెరుగవుతుంది. వరుణ్‌లో గుడ్ లుక్స్, ఇంటెలిజెన్స్... రెండూ ఉన్నాయి. డౌన్ టు ఎర్త్. సెట్లో అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. మనకు ఏదైనా సమస్య ఎదురైందని చెబితే... అతని దగ్గర పరిష్కారం ఉంటుంది. వరుణ్.. లావణ్య, హెబ్బాల్లో మీకు నచ్చే లక్షణాలు ఏంటి? వరుణ్: హార్డ్ వర్కింగ్, టాలెంట్ ఇటువంటివన్నీ పక్కన పెడితే... ఇద్దరిలో కామన్‌గా కనిపించే మంచి లక్షణం – ‘బేసిక్‌గా వాళ్లు ఎలా కనిపిస్తారో అలాగే ఉంటారు’. మన ముందు ఓ మాట, వెనక ఓ మాట మాట్లాడడం వంటివి ఉండవు. జోకులు వేసినా ఈజీగా తీసుకుంటారు. శ్రీనుగారు ఫస్ట్ హీరోయిన్ల గురించి చెప్పినప్పుడు పొట్టిగా ఉంటారేమో అనుకున్నా. వాళ్లు హైట్ బాగానే ఉంటారు. కానీ, నేను మరీ పొడుగు కదా! ఫస్ట్ హెబ్బాతో స్పెయిన్‌లో షూటింగ్ చేశా. హైట్ ప్రాబ్లెమ్ అనిపించలేదు. హమ్మయ్య... ఓ అమ్మాయి ఫర్వాలేదు. ఇంకో అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నా. లావణ్యతో ఫస్ట్ షాట్ చేశాక.. ఇద్దరం పరిగెత్తుకుని వెళ్లి, మానిటర్లో చూసుకున్నాం. బాగానే ఉన్నాం. హైట్ డిఫరెన్స్ లేదు. వరుణ్ పక్కన పొట్టిగా కనిపిస్తామేమోననే భయం మీ ఇద్దరికీ ఉండేదా? హెబ్బా: నేను శ్రీనుగారిని మొదటిసారి కలసినప్పుడు ఆయన నన్ను అడిగిన ప్రశ్న... ‘నీ ఎత్తు ఎంత?’ అని. ఇప్పుడు హైట్ గురించి నాకెలాంటి భయాలూ లేవు. వరుణ్‌తో పనిచేసిన తర్వాత ఇతర హీరోల హైట్ గురించి వర్రీ అవసరం లేదు. ఎవరితో అయినా చేసేయొచ్చు. లావణ్య: వరుణ్ మంచి హైట్. మీడియమ్ రేంజ్ హైట్ ఉన్నవాళ్లు కూడా తన పక్కన పొట్టిగానే కనిపిస్తారు. మేం వరుణ్ పక్కన మరీ అంత పొట్టిగా కనిపించకుండా కేర్ తీసుకోవడానికి డైరెక్టర్‌గారు ఉన్నారు కదా (నవ్వేస్తూ). శ్రీనూగారు! వరుణ్‌తో కాంబినేషన్ సీన్స్ అప్పుడు లావణ్య, హెబ్బాని ఎన్ని పెట్టెల మీద నిలబెట్టాల్సి వచ్చింది? శ్రీను: (నవ్వేస్తూ)... యాక్చువల్‌గా హైట్ బ్యాలెన్స్ చేయడానికనే కాదు... ఒక్కోసారి మామూలుగా కూడా బాక్సులు వాడతాం. ఈ సినిమాలో విలన్‌గా చేసిన నికితన్ ధీర్ హైట్ 6 అడుగుల మూడంగుళాలు. మంచి ఎత్తే. అయినప్పటికీ ఒక యాంగిల్ కోసం బాక్స్ మీద నిలబెట్టాల్సి వచ్చింది. అలా లావణ్య, హెబ్బాలు కూడా కొన్నిసార్లు బాక్సుల మీద నిలబడ్డారు. మీ నలుగురిలో కామన్‌గా కలిసే విషయం ఏదైనా ఉందా? శ్రీను: నలుగురికీ సినిమాలంటే పిచ్చి. ఆఫ్ సెట్స్‌లో సరదాగా ఉంటాం. ఆన్ సెట్స్‌లో సీరియస్‌గా ఉంటాం. మీరంతా ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు కదా! మరి సినిమా పూర్తయిన చివరి రోజున ఏమనిపించింది? వరుణ్: నిజం చెప్పాలంటే.. ఇంతకు ముందు చేసిన మూడు సినిమాలçకు చివరి రోజున చాలా ఎమోషన్ అయ్యాను. కానీ, ఈ సినిమాకి అలా అనిపించలేదు. హ్యాపీగా అనిపించింది. తెలియని శాటిస్ఫేక్షన్ ఏదో కలిగింది. సినిమా అయిపోతేనేం? ఎప్పుడైనా కలవొచ్చు కదా అనిపించింది. మళ్లీ శ్రీనుగారితో సినిమా చేయొచ్చు. లావణ్యా, హెబ్బాలతో కూడా కలసి సినిమా చేస్తానేమో. అందుకే వీళ్లను మిస్సవుతున్న ఫీలింగ్ కలగలేదు. లావణ్య: నాక్కూడా సేమ్ ఫీలింగ్. దూరమైపోతున్నాం అనిపించలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. హెబ్బా: నాకైతే ఒక్క లాస్ట్ డే కాదు.. మూడు, నాలుగు చివరి రోజులన్నమాట. వరుణ్: అవునండీ! ఈ అమ్మాయికి యాక్షన్ సీన్స్ ఉండేవి. ఒకసారి తీసిన తర్వాత, ‘ఇక నీ పార్ట్ అయిపోయింది’ అని పంపించేసేవాళ్లు. ఆ తర్వాత ఏదో చిన్న సీన్ తీయాలంటూ మళ్లీ పిలిచేవాళ్లు. హెబ్బా: అందుకే ‘ఇక నువ్వు రావాల్సిన అవసరంలేదు. నీ పార్ట్ మొత్తం పూర్తయింది’ అని ఫైనల్ కన్ఫర్మేషన్ ఇచ్చాక, యూనిట్‌ని మిస్సవుతున్నాం అని ఆలోచించకుండా హ్యాపీగా వెళ్లిపోయా. బట్... వండర్ఫుల్ టీమ్. ఫైనల్లీ ‘మిస్టర్’ షూటింగ్లో స్వీట్ మెమరీ? వరుణ్: చిక్మగళూర్ షెడ్యూల్‌ని మరచి పోలేను. ఎంజాయ్ చేస్తూ, భయపడుతూ చేసిన షెడ్యూల్ అది. చిక్మగళూర్లో జలగలు ఎక్కువ. అవి ఒంటి మీద పాకేది కూడా తెలియదు. నాకు తెలిసి ఎక్కువ జలగలు పాకింది నా ఒంటి మీదేనేమో. ఒకసారి కాలు చూసుకుంటే ఆల్రెడీ ఒకటి పాకుతూ, రక్తం పీల్చుతోంది. అదిరిపోయాను. మందు రాసుకోవడం వల్ల ప్రమాదాలేం జరగలేదు. శ్రీను: ఆ షెడ్యూల్ అప్పుడు వీళ్లకు ముందు చెప్పకుండా ఓ విషయం దాచాను.అదేంటంటే... అక్కడే ఓ లొకేషన్లో సీన్ తీయాలి. అక్కడ కొండ చిలవలు ఎక్కువ. ఆ విషయం తెలిస్తే కంగారుపడతారని చెప్పలేదు. తర్వాత చెప్పాను. భయపడుతూనే అక్కడ షూటింగ్ స్టార్ట్ చేశాం. అందరూ చుట్టుపక్కల చూస్తూ షూటింగ్ చేయడమే (నవ్వుతూ). కెమెరామ్యాన్ గుహన్గారైతే భయం భయంగా దిక్కులు చూసేవారు. ఆ షెడ్యూల్ బాగా గుర్తు. లావణ్య: రన్నింగ్ బస్ మీద నేను డ్యాన్స్ చేసే సీన్స్ ఉన్నాయి. నేను ఇన్వాల్వ్ అయి డ్యాన్స్ చేస్తుంటే, గుహన్ గారు సిన్సియర్‌గా షూట్ చేశారు. ఆ సమయంలో ఒక పెద్ద కొమ్మ ఆయనకు తగిలి ఉండేది. తృటిలో తప్పింది. హెబ్బా: నాకు యాక్షన్ సీన్స్ చేయడం ఇష్టం. ఈ మూవీలో ఆ స్కోప్ దొరికింది. అది నాకు స్వీట్ మెమరీ. లక్కీగా నాకు చిక్‌మగళూరు లొకేషన్లో ఆ సీన్స్ లేవు. ‘మిస్టర్’ ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ కదా.. రియల్ లైఫ్‌లో ఒకేసారి మీరు ఇద్దరమ్మాయిలకు ప్రపోజ్ చేసిన సందర్భాలున్నాయా? వరుణ్: అబ్బే. ఒక్క అమ్మాయితో మాట్లాడటమే కష్టమండి బాబు. ఇక ఇద్దరా? నో.. నో.. తప్పు కూడా. మీ ఇద్దరికీ ఇద్దరబ్బాయిలు ఒకేసారి ప్రపోజ్ చేసే ఉంటారేమో? లావణ్య: ఇద్దరేంటి? స్కూల్, కాలేజ్ డేస్‌లో చాలామంది ప్రపోజ్ చేసేవారు. లవ్ లెటర్స్, రోజ్ ఫ్లవర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేవి. హెబ్బా: అమ్మాయిలకెప్పుడూ అంతే. వాళ్ల చుట్టూ తిరగడానికి చాలామంది అబ్బాయిలు రెడీ అయిపోతారు. ప్రపోజల్స్ మీద ప్రపోజల్స్ వస్తుంటాయి. శ్రీనూగారు... ఈ మిస్టర్, మిస్లలో ఎవరు మంచోళ్లు? శ్రీను: ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అడిగేస్తే ఎలా అండి? ముగ్గురూ మంచోళ్లే. నేనిప్పటివరకూ ఛానెల్స్‌కి తప్ప ఇలా ముగ్గురు నలుగురితో కలసి ప్రింట్ మీడియాకి ఇంటర్వూ్యలు ఇచ్చింది లేదు. ఇదిగో ఇప్పుడిలా హాయిగా నలుగురం కలసి ఇంటర్వూ్య ఇస్తున్నామంటే... ఒకరి పట్ల మరొకరికి మంచి అభిప్రాయం ఉండడమే. అది లేకపోతే అవాయిడ్ చేసేవాళ్లం. ఎవరికి వారు సెపరేట్ ఇంటర్వూ్యలు ఇస్తామనేవాళ్ళం. – డి.జి. భవాని -
కష్టాన్ని నమ్ముకోమని చెప్పా
– చిరంజీవి ‘‘నీ వెనుక మేమున్నామనీ.. మా వెనుక అభిమానులున్నారనీ అనుకోకుండా ప్రతి సినిమాను తొలి సినిమాగా భావించాలని వరుణ్‌కి నేనెప్పుడూ చెబుతుంటా. తొలుత కష్టాన్ని నమ్ముకో... తర్వాత మాతో పాటు అభిమానుల ఆశీస్సులు ఉంటాయంటుంటా. ఎడాపెడా సినిమాలు ఒప్పుకోకుండా మంచి కథల్ని ఎంచుకుంటూ ముందుకెళుతున్నందుకు నా బిడ్డను అభినందిస్తున్నా’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘మిస్టర్’ ఈ నెల 14న విడుదలవుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ముకుంద, కంచె, లోఫర్ చిత్రాలతో క్లాస్, మాస్ ప్రేక్షకులకు వరుణ్ దగ్గరయ్యాడు. ‘మిస్టర్’తో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాలు, ఆశీస్సులు పొందుతాడనే నమ్మకం ఉంది. బుజ్జి, మధు నిర్మాతలంటే ఈ చిత్రం సగం సక్సెస్ అయినట్టే. వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు వారు. ‘అందరివాడు’ చిత్రంలో నాతో బాగా వినోదం పండించారు శ్రీను వైట్ల. అందరూ ‘ఖైదీ నంబర్ 150’ నా రీ–ఎంట్రీ అంటారు. అంతకుముందే ‘బ్రూస్లీ’లో ఓ పాత్ర చేయాలని పట్టుబట్టి మచ్చు తునకగా రీ–ఎంట్రీ ఇప్పించి, పూర్తి స్థాయి రీ–ఎంట్రీకి భరోసా ఇప్పించారాయన. ‘మిస్టర్’ తన సత్తా నిరూపించుకునే సినిమా. మిక్కీ సూపర్ డూపర్ హిట్ పాటలు అందించారు’’ అన్నారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘34 ఏళ్ల కిత్రం వచ్చిన ‘ఖైదీ’ ఓ సంచలనమైతే, ఇప్పుడొచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ మరో సంచలనం. ఆయన ప్రేక్షకుల హృదయాల్లో జీవిత ఖైదీ. నాకు హిట్ రావాలని ఈ చిత్రం తీయలేదు. ప్రేక్షకుల ప్రేమకోసం ప్రేమతో తీశా. వరుణ్ చాలా జెన్యూన్ యాక్టర్. నాకు ఇష్టమైన నటుడు. తను చేస్తుంటే రియల్‌గా అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘అందరివాడు’ టైమ్‌లో వరుణ్ని చూసిన శ్రీను వైట్ల బాగున్నాడన్నారు. తనతో ఓ చిత్రం తీయొచ్చుగా? అన్నా. అప్పుడు ఇచ్చిన మాటను ‘మిస్టర్’తో నిలబెట్టుకున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు నాగబాబు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలని చేస్తుంటా. వాటిలో కొన్ని ఆడాయి.. మరికొన్ని ఆడలేదు.. కానీ మీరు (ఫ్యాన్స్) సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఈ చిత్రం కోసం శ్రీను వైట్లగారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నా కోసం కాకున్నా ఆయన కోసమైనా ఈ చిత్రం హిట్ అవుతుంది. మిక్కీ మంచి పాటలిచ్చాడు. ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి ఎవర్ని పిలుద్దామా? అనుకున్నప్పుడు నా మదిలోకి వెంటనే డాడీ (చిరంజీవి) వచ్చారు. ఫోన్ చేసి అడిగితే, వెంటనే వస్తాన న్నారు’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ– ‘‘ఇందులో చంద్రముఖిగా టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశా. శ్రీను వైట్ల వండర్ఫుల్ డైరెక్టర్. వరుణ్ అమేజింగ్ యాక్టర్’’ అన్నారు. ‘‘కుమారి 21ఎఫ్’ తర్వాత ‘మిస్టర్’కు సైన్ చేశా. ‘మిస్టర్’ కథ నేను వినలేదు. శ్రీను వైట్ల సార్ డైరెక్టర్ అనగానే ఓకే చెప్పేశా. వరుణ్ మంచి కోస్టార్’’ అని హెబ్బా పటేల్ అన్నారు. చిత్రనిర్మాతలు నల్లమలుపు బుజ్జి, ‘ఠాగూర్’ మధు, సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్, నిర్మాతలు ‘దిల్’ రాజు, దామోదర్ ప్రసాద్, సత్యనారాయణ, దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి నిహారిక, నటులు ప్రిన్స్, ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి, బెనర్జీ, రచయితలు శ్రీధర్ సీపాన, గోపీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
మనసు మార్చుకున్న 'మిస్టర్'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్. ఈ సినిమాతో వరుణ్‌ను తొలిసారిగా ఓ కమర్షియల్ హీరోగా చూపించబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ విషయంలో చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు బాబు బాగా బిజీ కూడా రిలీజ్ అవుతుండటంతో ఒక రోజు ముందుగానే ఏప్రిల్ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా బాబు బాగా బిజీ మే 5కు వాయిదా పడటంతో మిస్టర్ టీం మళ్లీ మనసు మార్చుకుంది. ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 14నే సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 7న అభిమానుల సమక్షంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌కు కూడా వేడుకకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఇటలీలో 'మిస్టర్' ఆటాపాటా..!
శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎక్కువగా ఎక్స్పరిమెంటల్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన వరుణ్, కమర్షియల్ ఫార్మాట్లో చేసిన లోఫర్ నిరాశపరిచింది. దీంతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు మిస్టర్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. వరుస ఫ్లాప్‌ల తరువాత దర్శకుడు శ్రీనువైట్ల కూడా మిస్టర్ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న మిస్టర్ యూనిట్, చివరి పాట్ చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు హీరో వరుణ్ తేజ్. ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల మీద ఓ డ్యూయెట్‌ను చిత్రీకరించనున్నారు. ఈ పాటతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేద్దామని భావించినా, సమ్మర్ హాలీడేస్ కావటంతో లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ ఒక రోజు ముందుగానే ఏప్రిల్ 13న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ 6న అభిమానుల సమక్షంలో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. Off to Italy for shoot with @SreenuVaitla & @Itslavanya Last song of #Mister #song#shoot#Mister#travel pic.twitter.com/cCVGUBMqZk — Varun Tej (@IAmVarunTej) 1 April 2017 -
‘మిస్టర్’ వర్కింగ్ స్టిల్స్
-
మార్చి 30న 'మిస్టర్' ఆడియో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్నరొమాంటిక్ ఎంటర్టైనర్ మిస్టర్. కొద్దిరోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమాకు డైరెక్టర్. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయగా పూర్తి ఆడియోను మార్చి 30న, మెగా ఈవెంట్లో రిలీజ్ చేయనున్నారు. నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న మిస్టర్, వరుణ్ తేజ్‌ను కమర్షియల్ హీరోగా నిలబెట్టడంతో పాటు శ్రీనువైట్ల కెరీర్‌ను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. -
‘మిస్టర్’ ట్రైలర్ విడుదల
-
ముగ్గురిలోనూ అదే అంకితభావం : దర్శకుడు శ్రీను వైట్ల
‘‘చిరంజీవిగారు, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్... ముగ్గురితోనూ పనిచేశా. ముగ్గురిలోనూ నటన పట్ల ఒకే విధమైన అంకితభావం ఉంది. ఈ సినిమాకు వస్తే... ఇది ముక్కోణపు ప్రేమకథ. ‘మిస్టర్’ అంటే ‘మంచోడు, మంచి మనసున్న వ్యక్తి’ అని మీనింగ్. అతడి మంచితనాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. వరుణ్‌తేజ్ హీరోగా ఆయన దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్’. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లు. బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. ఈ నెల 29న పాటల్ని, ఏప్రిల్ 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు శ్రీను వైట్ల తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘మా నిర్మాతలు బుజ్జి, మధు గార్లు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి మంచి సినిమా చేయగలిగా. వరుణ్‌తేజ్ ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అవుతాడు. అంత చక్కగా నటించాడు. మిక్కి జె. మేయర్ మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. నా మార్క్ ఎక్కడా మిస్ కాదు. ఎమ్మెస్ నారాయణ గారంటే నాకెంతో అభిమానం. ఆయన లేని లోటును ప్రస్తుత కమెడియన్స్‌తో భర్తీ చేశా. ఇప్పటివరకూ నేను పనిచేయని కమెడియన్స్‌తో ఈ సినిమా చేశా. గోపీమోహన్‌తో 14 ఏళ్ల ప్రయాణం నాది. ఆయన మంచి కథ ఇచ్చారు. శ్రీధర్ సీపాన అద్భుతమైన డైలాగులు రాశాడు’’ అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘ముకుంద’ నుంచి మా నిర్మాతలు బుజ్జి, మధుగార్లు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. నా లుక్, డ్రెస్సింగ్, క్యారెక్టర్ పరంగా శ్రీను వైట్లగారు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. క్లైమాక్స్ బాగా నచ్చడంతో కథ వినగానే అంగీకరించా’’ అన్నారు. ‘‘ప్రతి కథానాయిక శ్రీను వైట్లగారి దర్శకత్వంలో పని చేయాలని కోరుకుంటుంది. ఈ సినిమాతో నా కోరిక తీరింది. వరుణ్‌తేజ్ మంచి కోస్టార్. బుజ్జి, మధులు స్వీట్ ప్రొడ్యూసర్స్’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. హెబ్బా పటేల్, రచయితలు గోపీ మోహన్, శ్రీధర్ సీపాన, నిర్మాత హరి తదితరులు పాల్గొన్నారు. -
నీ పేరేంటి మిస్?
‘మిస్టర్ నీ పేరేంటి?’ అని లావణ్యా త్రిపాఠి అడిగితే... ‘పిచ్చయ్య నాయుడు’ అని వరుణ్‌తేజ్ చెప్తారు. ఆమె మాత్రం తన పేరు చెప్పకుండా... ‘నాది చాలా మంచి పేరు, అందమైన పేరు, అర్థవంతమైన పేరు’ అని సస్పెన్స్‌లో పడేస్తారు. హీరోను ఊరించి, ఉడికించిన లావణ్య ఎప్పుడు పేరు చెప్తారో ఏప్రిల్ 14న తెలుస్తుంది. ఎందుకంటే వరుణ్‌తేజ్ హీరోగా లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ‘మిస్టర్’ సినిమా వచ్చే నెల 14న రిలీజ్ కానుంది. పైన చెప్పిన సీన్ ‘మిస్టర్’ లోనిదే. ఆ సీన్ తీసిన తర్వాత మానిటర్ లో చూసుకుంటున్నప్పుడు తీసిన ఫొటోనే ఇక్కడ మీరు చూస్తున్నా రు. రెండు పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. -
లవ్ జర్నీలో మిస్టర్!
మాంచి హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు కదా ఈ ‘మిస్టర్’. వయసు కూడా ఎక్కువేం కాదు. జస్ట్ 27 ఏళ్లే. కానీ, ‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళితే... ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’ అనే పెద్ద ఫిలాసఫీ స్టేట్మెంట్ ఇస్తాడు. దీనికి ఓ కారణం ఉంది. ఇతడికి ఇద్దరమ్మాయిలు పరిచయమవుతారు. ఓ అమ్మాయి విదేశాల్లో.. ఇంకో అమ్మాయి తెలుగు పల్లెలో! ఈ మిస్టర్ ఎవరి ప్రేమను వెతుక్కుంటూ వెళ్లాడు? ఎవరి ప్రేమ మనోడ్ని వెతుక్కుంటూ వచ్చిందనేది ఏప్రిల్ 14న తెలుస్తుంది. వరుణ్‌తేజ్ హీరోగా శ్రీనుౖ వెట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్’. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లు. ఏప్రిల్ 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘మంచి ఎమోషన్స్, హిలేరియస్ కామెడీ, మ్యూజిక్, బ్యూటిఫుల్ విజువల్స్‌కి స్కోప్ ఉన్న కథ. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నేను ఏదైతే అనుకున్నానో... దాన్ని వంద శాతం రాజీ పడకుండా తీయగలిగాను. అందుకు కారణమైన నా నిర్మాతలు, చిత్రబృందానికి థ్యాంక్స్. నిన్ననే ఫస్ట్ హాఫ్ రీ–రికార్డింగ్‌తో చూశా. మిక్కి జె. మేయర్ అన్ బిలీవబుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఆరు అద్భుతమైన పాటలు అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సీపాన, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్: రూపా వైట్ల. -
మిస్టర్ డేట్ చెప్పేశాడు..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మిస్టర్. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న శ్రీనువైట్ల దర్శకత్వంలో లోఫర్ సినిమాతో నిరాశపరిచిన వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఈ ఇద్దరి కెరీర్లకు కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ రిలీజ్ తరువాత పెద్దగా వార్తల్లో వినిపించని మిస్టర్ పేరు ఇప్పుడు సడన్‌గా తెర మీదకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ చాలా ఆలస్యం కావటంతో వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ మధ్యలో వరుణ్ కాలికి గాయం కావటంతో దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ వాయిదా వేశారు. దీంతో సినిమా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి భారీ చిత్రాలు క్యూ కడుతుండటంతో చిన్న మీడియం రేంజ్ సినిమాల రిలీజ్‌కు డేట్ దొరకటం కష్టమే. ఏప్రిల్ మొదటి వారంలో గురు, చెలియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అవుతోంది. దీంతో ఈ గ్యాప్ ఏప్రిల్ 14న మిస్టర్ రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారట. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
వన్.. టు.. త్రీ.. రెడీ!
ప్రస్తుతం వరుణ్‌తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చిత్రాలను ఏకకాలంలో చేస్తున్నారు. సుమారు ఏడెనిమిది నెలలు ఈ రెండు చిత్రాలతో వరుణ్ బిజీ. మధ్యలో కాలికి గాయం కావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, ఇటీవలే చిత్రీకరణలో పాల్గొనడం మొదలుపెట్టారు. త్వరలో ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రంతో బిజీ అవుతారు. ‘జ్ఙాపకం’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించిన వెంకీ అట్లూరి దర్శకుడిగా మారుతున్న ఈ ప్రేమకథా చిత్రంలో వరుణ్‌తేజ్‌కి జోడీగా మెహరీన్ కౌర్ నటించనున్నారు. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెడతారని సమాచారం. మొత్తం మీద ఈ ఏడాది వరుణ్‌తేజ్ మూడు సినిమాలు విడుదల చేసేలా కనపడుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. -
మరో హిట్ కు రడీ అయిపోతున్న మెగా ప్రిన్స్!
హైదరాబాద్: కంచె సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న మెగా ప్రిన్స్, టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ మరోసారి తన స్పెషాల్టీని నిరూపించుకోనున్నాడు. వరుణ్ రాబోయే చిత్రం 'మిస్టర్' టీజర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే మెగా హిట్లను సాధిస్తోంది. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయిన ఈ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్‌లో నిలవడం ఒక విశేషంకాగా, మిలియన్ (పదిలక్షలు) కు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకోవడం మరోవిశేషం. 73 సెకన్ల పాటు మిస్టర్ మూవీ టీజర్ 1,253,588 పైగా లైక్స్, అభిమానుల కమెంట్లతో దూసుకుపోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ మరో హిట్ కు రడీ అయిపోతున్నాడంటూ అభిమానులు కమెంట్ చేస్తున్నారు. ఆరడుగుల అందగాడిని స్టన్నింగ్ లుక్స్ తో మరింత అందంగా చూపించాడంటూ దర్శకుడు శ్రీనువైట్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న రిచ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో వరుణ్ కు జోడీగా లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ నటిస్తుండగా, లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ఆడియోను కూడా త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. -
మిస్టర్ ప్రేమకథ
-
మిస్టర్ ప్రేమకథ
‘‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే, ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’’ అంటున్నారు వరుణ్‌తేజ్. ఈ ‘మిస్టర్’ను ఎవరి ప్రేమ వెతుక్కుంటూ వచ్చిందో చెప్పమంటే ఏప్రిల్ వరకూ ఎదురు చూడమంటున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధులు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్’. లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్ హీరోయిన్లు. కొత్త ఏడాది కానుకగా వరుణ్‌తేజ్ ఫస్ట్ లుక్, సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘వరుణ్‌తేజ్ స్థాయి పెంచే చిత్రమిది. 80 శాతం సినిమా పూర్తయింది. రెండు పాటలు, క్లైమాక్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 14న చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది ప్లాన్’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ ఇది. ఎమోషన్స్, విజువల్స్, మ్యూజిక్‌లకు స్కోప్ ఉన్న కథ. స్పెయిన్, స్విట్జర్లాండ్, ఇండియా లోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’’ అని శ్రీను వైట్ల అన్నారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్: రూపా వైట్ల. -
రిచ్ & రొమాంటిక్ 'మిస్టర్'
-
రిచ్ & రొమాంటిక్ 'మిస్టర్'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మిస్టర్. స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేశారు. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. చాలా కాలం క్రితమే ఈ సినిమా ప్రారంభమైనా.. షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్ గాయపడటంతో ఆలస్యమైంది. త్వరలోనే ఆడియో మూవీ రిలీజ్ డేట్స్‌ను ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Here it is #MisterTeaser https://t.co/liskboBMz7#HappyNewYear guys -
న్యూ ఇయర్‌కి టీజర్, సంక్రాంతికి ట్రైలర్
ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకల్లో సందడి అంతా మెగా హీరోలదే కనిపిస్తోంది. ఇప్పటికే చిరు, పవన్‌లు కొత్త సినిమాలతో హవా చూపిస్తుండగా ఇప్పుడు రేసులోకి యంగ్ మెగా హీరోలు కూడా చేరిపోయారు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 సింగిల్స్ యూట్యూబ్ రికార్డ్ల దుమ్ముదులుపుతున్నాయి. రేసులోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ లుక్, ఫస్ట్ లుక్లతో హవా చూపిస్తున్నాడు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఈ రేసులోకి అడుగుపెట్టాడు. కొత్త ఏడాదికి రెండు రోజుల ముందే తన కొత్త సినిమా మిస్టర్ టైటిల్ లోగోను రిలీజ్ చేసిన వరుణ్, న్యూ ఇయర్ రోజు టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. సినిమా రిలీజ్‌కు చాలా సమయం ఉండటంతో సంక్రాంతికి ట్రైలర్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
50 రోజుల తరువాత సెట్లో మెగా హీరో
దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన మెగా హీరో వరుణ్ తేజ్ తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నాడు. మిస్టర్ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురైన వరుణ్, కాలికి తీవ్ర గాయం కావటంతో షూటింగ్‌లకు దూరమయ్యాడు. దీంతో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్‌తో పాటు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రారంభించిన ఫిదా సినిమాలు కూడా ఆగిపోయాయి. దాదాపు 50 రోజుల విరామం తరువాత సోమవారం వరుణ్ తిరిగి షూటింగ్లో పాల్గొన్నాడు. కాలి గాయం నుంచి కాస్త ఉపశమనం కలగటంతో మిస్టర్ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతానికి ఫిదా సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి మిస్టర్ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు వరుణ్. ఇప్పటికే సినిమా ఆలస్యం కావటంతో మిస్టర్ సినిమా పూర్తి చేసిన తరువాతే ఫిదాకు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మిస్టర్‌ను నల్లమలపు బుజ్జి నిర్మిస్టుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. కొద్ది రోజులు వరుస ఫ్లాప్ లతో ఇబ్బందులో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమా తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. Back on my feet and onto the sets after 50 long days!!..Excited to shoot!!..soo damn happy!! #shootresumes#mister#hyderabad pic.twitter.com/YbQcpJcqDO — Varun Tej (@IAmVarunTej) November 21, 2016 -
వరుణ్ తేజ్ మరో సినిమా ఓకె చేశాడు..?
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, ఇప్పుడు కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ల మీద దృష్టి పెట్టిన వరుణ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం కామెడీ స్పెషలిస్ట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమాతో పాటు కాఫీలాంటి సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఒకేసారి కానిచ్చేస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మూడో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్లను అందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
వరుణ్ సినిమాలో మరో హీరో
యంగ్ జనరేషన్ హీరోలు కొత్త సాంప్రదాయాలకు తెర తీస్తున్నారు. గతంలో ఒక హీరో సినిమాలో మరో హీరో అతిథి పాత్రలో నటించిన సందర్భాలు చాలా అరుదు. కానీ ఈ జనరేషన్ హీరోలు మాత్రం తరుచుగా గెస్ట్ అపియరెన్స్ లకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా, తాజాగా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాలో నటించేందుకు మరో హీరో అంగీకరించాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాలో మరో యంగ్ హీరో ప్రిన్స్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాలో కూడా ప్రిన్స్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. బస్‌స్టాప్, రొమాన్స్ లాంటి సినిమాలతో సోలో హీరోగా మంచి విజయాలను అందుకున్న ప్రిన్స్ మరోసారి స్పెషల్ క్యారెక్టర్ కు అంగకీరించాడు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ లు హీరోయిన్లు గా నటిస్తున్ మిస్టర్ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కుర్ర హీరోలకు లక్కీ గర్ల్
హీరోయిన్ స్టార్ ఇమేజ్ అందుకోవటం కోసం కష్టపడుతున్న లావణ్య త్రిపాఠి, యంగ్ హీరోలకు లక్కీ గర్ల్‌గా మారుతోంది. చాలా రోజులుగా హిట్ కొసం ఎదురుచూస్తున్న హీరోలు లావణ్యతో జతకడితే హిట్ గ్యారెంటీ అన్న పేరు తెచ్చుకుంది ఈ బ్యూటి. అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి తొలి సినిమాతో అందం, అభినయంతో ఆకట్టుకున్నా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇటీవల ఈ అమ్మడు హీరోయిన్గా నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తుండటంతో వరుస ఆఫర్లతో బిజీ అవుతోంది. ఓ మంచి హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న నాని, లావణ్యతో జత కట్టిన భలే భలే మొగాడివోయ్ భారీ కలెక్షన్లతో సత్తా చాటింది. ఆ తరువాత లావణ్య హీరోయిన్గా రూపొందిన సొగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. దీంతో యంగ్ హీరోలు లావణ్య త్రిపాఠితో జత కట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి, మరోసారి సొగ్గాడే ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించింది. నాగచైతన్య హీరోగా కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో లావణ్య సెంకడ్ హీరోయిన్ గా ఓకె అయ్యింది. -
కర్ణాటకలో 'మిస్టర్'
శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్'. ఇంతకుముందే మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. సోమవారం నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభించింది. ఊటీ, కర్ణాటకలోని కొన్ని లొకేషన్లలో చిత్రీకరణ జరుపనున్నారు. ఇదే షెడ్యూల్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొంటారు. ఆగడు, బ్రూస్ లీ పరాజయాల తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్‌కు కీలకం కానుంది. శ్రీనువైట్ల మార్క్ యాక్షన్ కామెడీగా 'మిస్టర్' రూపొందుతోందని సమాచారం. ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
స్పెయిన్ టు తెలంగాణ వయా స్విట్జర్లాండ్!
‘లోఫర్’ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజైంది. ఆ తర్వాత ఓ ఆర్నెల్లు స్టోరీ డిస్కషన్స్‌కి పరిమితమైన వరుణ్‌తేజ్ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకువెళ్లారు. విశ్రాంతి లేకుండా స్పెయిన్ టు తెలంగాణ వయా స్విట్జర్లాండ్ ట్రావెల్ చేశారు. వరుణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ చిత్ర షూటింగ్ జూన్‌లో మొదలైంది. స్పెయిన్‌లో ఓ నెల రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కణ్ణుంచి స్విట్జర్లాండ్ వెళ్లారు. స్విస్‌లోని ఫేమస్ లేక్ ‘తున్’ వద్ద సాంగ్స్ షూటింగ్ ముగించుకుని మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. ఇలా రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారో లేదో... మళ్లీ ‘ఫిదా’ షూటింగ్‌కి హాజరవుతున్నారు వరుణ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని బాన్సువాడలో జరుగుతోంది. అమెరికా ఎన్నారై కుర్రాడు తెలంగాణలోని బాన్సువాడకి వెళతాడు. ఎందుకంటే.. అక్కడమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇదే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఫిదా’ స్టోరీలైన్. విచిత్రంగా ఈ సినిమా కథలానే వరుణ్ కూడా విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘ఫిదా’ షూటింగ్ చేస్తున్నారు. కానీ, ఎవరితోనూ ప్రేమలో పడలేదు సుమా! -
స్పెయిన్‌కి మిస్టర్!
వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ కాంబినేషన్లో రూపొందనున్న ‘మిస్టర్’ ఏప్రిల్‌లో ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 27న స్పెయిన్‌లో మొదలు కానుంది. ఈ విషయాన్ని వరుణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘ఈ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ఆయన ట్వీట్ చేశారు. వినోద ప్రధానంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రం కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ చిత్రం అంగీకరించిన విషయం తెలిసిందే. -
మెగా హీరోతో కాఫీలాంటి సినిమా
ఆనంద్, హ్యాపిడేస్, గోదావరి, లీడర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. కహానీ రీమేక్‌గా నయనతార లీడ్ రోల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక, డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో నెక్ట్స్ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఫర్ఫెక్ట్ కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్‌తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకుంటున్న వరుణ్, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరోసారి కొత్త కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. శేఖర్, ఈ కథను ముందు రామ్ చరణ్‌కు చెప్పినా అతడు ఇంట్రస్ట్ చూపించకపోవటంతో వరుణ్‌తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వరుణ్ తొలిసారిగా మాస్ జానర్లో ట్రై చేసిన లోఫర్, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపొవటంతో ఈ సారి ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ శ్రీనువైట్లతో కలిసి మిస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా పూర్తయిన తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మరో మెగా హీరోతో రెజీనా
మంచి యాక్టింగ్ టాలెంట్‌తో పాటు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది రెజీనా. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.., స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ సాధించలేకపోతుంది. అయితే మెగా హీరోలు మాత్రం ఈ అమ్మడికి బాగానే ఛాన్సులిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ తాజాగా మరో మెగా హీరోతో నటించడానికి రెడీ అవుతోంది. పిల్లానువ్వులేనీ జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించింది రెజీనా. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించటంతో మెగా హీరోల దృష్టిలో పడింది. అదే సమయంలో మరో మెగా హీరో శిరీష్ సరసన కొత్తజంట సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాకు రెడీ అవుతోంది. ముకుంద, కంచె, లోఫర్ లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'మిస్టర్' సినిమాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉంది. అయితే ముందుగా ఈ పాత్రకు హేబా పటేల్‌ను తీసుకోవాలని భావించినా, వరుణ్ సరసన సూట్ అవ్వదన్న ఆలోచనతో రెజీనాను ఫైనల్ చేశారు. మరి వరుణ్ అయినా రెజీనాకు స్టార్ ఇమేజ్ తీసుకువస్తాడేమో చూడాలి. -
వరుణ్ తేజ్ 'మిస్టర్' ప్రారంభం