మనసు మార్చుకున్న 'మిస్టర్' | varun tej Mister Release on April 14 | Sakshi
Sakshi News home page

మనసు మార్చుకున్న 'మిస్టర్'

Published Thu, Apr 6 2017 10:18 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

మనసు మార్చుకున్న 'మిస్టర్'

మనసు మార్చుకున్న 'మిస్టర్'

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్. ఈ సినిమాతో వరుణ్ను తొలిసారిగా ఓ కమర్షియల్ హీరోగా చూపించబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ విషయంలో చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు బాబు బాగా బిజీ కూడా రిలీజ్ అవుతుండటంతో ఒక రోజు ముందుగానే ఏప్రిల్ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

తాజాగా బాబు బాగా బిజీ మే 5కు వాయిదా పడటంతో మిస్టర్ టీం మళ్లీ మనసు మార్చుకుంది. ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 14నే సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 7న అభిమానుల సమక్షంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్కు కూడా వేడుకకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement