అసలు ప్రయాణం ఇప్పుడే... | Mister Movie Team Interview | Sakshi
Sakshi News home page

అసలు ప్రయాణం ఇప్పుడే...

Published Sun, Apr 9 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

Mister Movie Team Interview

సినిమాయే ఒక జర్నీ...పాత్రలకు, ప్రేక్షకులకు! దీంట్లో కొత్త విషయం చెప్పేది ఏముంది? కానీ, నిజానికి ఈ సినిమా డైరెక్టర్‌కి, హీరో హీరోయిన్లకు ఒక జర్నీగా మారింది. గుమ్మడికాయ కొట్టేశారు. సినిమా రిలీజ్‌కి రెడీ. కానీ, అసలు జర్నీ  ఇప్పుడు మొదలవుతుంది. రిలీజ్‌కి ముందుండే ఆనందాన్ని,  ఉత్కంఠనీ మీకోసం ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌గా క్యాప్చర్‌ చేసింది.



శ్రీను వైట్లగారూ.... ‘మిస్టర్‌’ ఎలా, ఎప్పుడు మొదలైంది?

శ్రీను వైట్ల: ఎప్పట్నుంచో అన్ని ఎమోషన్స్‌ ఉన్న ఓ ట్రావెల్‌ మూవీ చేయాలనుకుంటున్నా. 2015 డిసెంబర్‌లో రచయిత గోపీమోహన్‌ ఒక లైన్‌ చెప్పాడు. ఎగై్జట్‌మెంట్‌తో వెంటనే ఈ సినిమా చేద్దామన్నా. ఈ కథకు వరుణ్‌తేజ్‌ కరెక్ట్‌ అని గోపీతో అంటే, తనూ అదే అన్నాడు. అదే టైమ్‌లో నల్లమలుపు బుజ్జి, ‘ఠాగూర్‌’ మధుగార్లు వరుణ్‌తో సినిమా చేద్దామని వచ్చారు. అలా సెట్‌ అయింది.

వైట్లగారు కథ వినగానే ఎగ్జయిట్‌ అయ్యారు. మరి మీరు?
వరుణ్‌ తేజ్‌: శ్రీను వైట్లగారు గంటన్నరసేపు కథ చెప్పారు. బాగా నచ్చింది. చివరి అరగంట అయితే సూపర్‌. నేనూ ఎగ్జయిట్‌ అయ్యా. నాకు కథ నచ్చినా, నచ్చకపోయినా వెంటనే చెప్పేస్తా. దాచడం, గట్రా ఏం ఉండవు. ఒక్క డౌట్‌ ఉండేది. ఆయన సినిమాల్లో కామెడీ ఎక్కువుంటుంది. నేనెలా చేయగలను? అనుకున్నా. కానీ, శ్రీనూగారి హెల్ప్‌తో ఈజీగా చేసేశా.

‘మిస్టర్‌’ అంటే?
శ్రీను: నా దృష్టిలో ‘మిస్టర్‌’ అంటే మంచి మనసున్నోడు. గౌరవంతో ‘మిస్టర్‌’ అని పిలుస్తారు కదా. ఆ పిలుపుకు 100 శాతం అర్హత వరుణ్‌ క్యారెక్టర్‌కు ఉంటుంది. పదిమందికి హెల్ప్‌ చేయాలనుకునే మనస్తత్వం ఉన్న కుర్రాడు. అందరి సంతోషం కోసం స్ట్రగుల్‌ అయ్యే పాత్ర.

ఇంతకీ మిస్టర్‌తో ఈ ఇద్దరమ్మాయిల కనెక్షన్‌ ఏంటి?
శ్రీను: వాళ్లిద్దరూ ఏం చేస్తారనేదే కథ. ట్రావెల్‌ ఫిల్మ్‌ కదా! హీరో (వరుణ్‌), మీరా (హెబ్బా) పాత్రల మధ్య కనెక్షన్‌ చాలా డ్రమటిక్‌గా ఉంటుంది. అలాగే, చంద్రముఖి (లావణ్యా త్రిపాఠి)తో హీరో కనెక్షన్‌ కూడా. వీళ్ల మధ్య ట్రావెల్‌ ఆసక్తిగా ఉంటుంది. వీళ్లు ఒకరికొకరు ఎలా పరిచయమయ్యారు? చివరికి, ఏ గమ్యం చేరారు? అనేది కథ. హీరోయిన్లవి నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలే.

శ్రీనూగారు!  స్టార్స్‌తో సినిమాలు చేసిన మీరు యంగ్‌స్టర్స్‌తో సినిమా చేయడం ఎలా ఉంది?
శ్రీను: ఎంజాయ్‌ చేశా. వరుణ్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్‌ అయ్యాను. అమ్మాయిలతో నేను చాలా తక్కువ మాట్లాడతా. వర్క్‌ వరకూ మాత్రమే డిస్కస్‌ చేస్తా. (‘అందుకే ఈ ఇంటర్వూ్యకి ఆయన్ను అమ్మాయిల మధ్య కూర్చోబెట్టా’ – వరుణ్‌) ఈ జనరేషన్‌ కుర్రాళ్లు ఎలా ఉంటారు? ఎలా ఆలోచిస్తారు? అనేవి వరుణ్‌తో ఎక్కువ ట్రావెల్‌ కావడం వల్ల అర్థం అయ్యాయి. ‘మిస్టర్‌’ మేకింగ్‌ను చాలా ఎంజాయ్‌ చేశా.  

పెద్ద హిట్స్‌ అందుకున్న మీపై మధ్యలో వచ్చిన ఒక్క ఫ్లాప్‌ ప్రభావం చూపినట్టుంది?
శ్రీను: అది మంచి కోసమే జరిగినట్టుంది. మనం అర్థం చేసుకోవాలి. నా సై్టల్‌ ఏంటి? ఒక ‘ఆనందం’ లాంటి ప్రేమకథ (సినిమా) తీశా. తర్వాత ‘వెంకీ’ చేశా. ఆ తర్వాత ‘ఢీ’ నుంచి ఓ సై్టల్‌లోకి వెళ్లా. నాతో పాటు అందరూ అటువంటి సినిమాలు చేసేశారు. సక్సెస్‌ కావడంతో ఎక్కువ సినిమాలు వచ్చాయి. నేను కొంచెం ఎర్లీగా ఆ ఫార్ములాను ఆపేసి ఉండాల్సింది. కానీ, ఓ దెబ్బ తగిలిన తర్వాత స్టాప్‌ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈ సినిమా చేశా. చాలా ఫ్రెష్‌ కాన్సెప్ట్‌. నిజాయితీగా చెప్పాలంటే... కంపేర్‌ చేయకూడదు కానీ, ‘దూకుడు’ తర్వాత నాకంత కాన్ఫిడెన్స్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ ‘మిస్టర్‌’.

వరుణ్‌... స్టార్స్‌తో, మీ పెదనాన్న (చిరంజీవి)తో చేసిన దర్శకుడితో సినిమా అనగానే మీకు ఎలా అనిపించింది?
వరుణ్‌: ఒక్కో దర్శకుడికి ఒక్కో సై్టల్‌ ఉంటుంది. పూరి జగన్నాథ్‌గారిది ఓ సై్టల్‌. వీవీ వినాయక్‌గారిది ఓ సై్టల్‌. శ్రీను వైట్లగారిది ఓ సై్టల్‌. దర్శకుల సై్టల్‌కి తగ్గట్టు అడాప్ట్‌ కావడమే మా పని. శ్రీనుగారు, ఆయన టీమ్‌తో నేను బాగా కంఫర్టబుల్‌గా ఫీలయ్యా. నాకు కష్టం అనేది తెలియలేదు. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లగానే ముందు ఆయన (శ్రీను వైట్ల) నా కేర్‌వాన్‌లోకి వచ్చి కూర్చునేవారు. ఏదో మంచి విషయం చెబుతారు. లేదంటే... మా అమ్మాయి ఇలా చేసిందనో, ఇంట్లో చెట్లు కొట్టేశారనో, మరొకటో వ్యక్తిగత విషయాలు చెబుతారు. నేను మేకప్‌ వేసుకునే టైమ్‌లో స్లోగా నా మైండ్‌ను రీఫ్రెష్‌ చేస్తారు. సీన్‌లోకి వెళ్లిన తర్వాత మరో ఆలోచన ఉండదు. బాగా నటించా. శ్రీను వైట్లగారు ప్రతిదీ చేసి చూపిస్తారు. ‘మీ టైమింగ్‌ అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా యాక్ట్‌ చేసి చూపిస్తున్నారు’ అని ఆయనతో చాలాసార్లు చెప్పాను. నేను ఆయన్ను ఇమిటేట్‌ చేశానంతే.

మీరు బాగా యాక్ట్‌ చేసి, చూపిస్తారని వరుణ్‌ చెబుతున్నారు. మీరు హ్యాండ్‌సమ్‌గా ఉంటారు కదా. ఎవరూ నటించమని, హీరోగా చేయమని అడగలేదా?
శ్రీను: అబ్బెబ్బెబ్బే... నేను ఫొటో తీయించుకోవడమే కష్టం. నాకు హీరోలంటే ఇష్టం. కానీ, హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్నుంచీ దర్శకత్వమే నా లక్ష్యం. ఎవరో జూనియర్‌ ఆర్టిస్టు లేకపోతే.. ‘ఆనందం’ సినిమాలోని ఓ సీన్‌లో నేను పరిగెత్తాల్సి వచ్చింది. ఆ సినిమా హిట్టయ్యింది. ఆ సెంటిమెంట్‌తో అప్పుడప్పుడూ ప్రేక్షకులకు తెలిసీ తెలీకుండా కనిపిస్తుంటాను.

 శ్రీనూగారు! వరుణ్‌లోని మంచి లక్షణాలు చెబుతారా?
శ్రీను: వరుణ్‌లో నిజాయితీ కనిపిస్తుంది. సేమ్‌ టైమ్‌... బాగా తెలివైనోడు.ఇలాంటి కాంబినేషన్‌ చాలా తక్కువ. వరుణ్‌లో నాకా క్వాలిటీ ఇష్టం. మనుషులను బాగా అంచానా వేయగలుగుతాడు. హి ఈజ్‌ వెరీ కూల్‌. నేను తన నుంచి కూల్‌గా ఉండడం నేర్చుకున్నాను. వరుణ్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ చాలా బాగుంటుంది.

శ్రీను వైట్లగారిలోని మంచి లక్షణాల గురించి?
వరుణ్‌: షూటింగ్‌ చేసే టైమ్‌లో ఎంతసేపూ సినిమా గురించి తప్ప... మరో విషయం గురించి ఆలోచించరు. ఫ్యామిలీ లవింగ్‌ మ్యాన్‌. ‘మిస్టర్‌’ షూటింగు ఎక్కువ విదేశాల్లో చేశాం. అప్పుడు ‘మా అమ్మాయిలతో కబుర్లు చెబుతూ నిద్రపోయేవాణ్ణి. ఇక్కడ ఉండలేకపోతున్నాను’ అనేవారు. సక్సెస్‌ను ఆయనెప్పుడో చూశారు. కానీ, ఇప్పటికీ సినిమా ఎలా వస్తుందోననే టెన్షన్‌ కనిపిస్తుంది. ఒక్కరోజు కూడా ఈజీగా తీసుకోరు. బహుశా... ఆ టెన్షన్, భయమే ఆయన్నింకా డ్రైవ్‌ చేస్తున్నాయనిపిస్తోంది. స్పెయిన్‌లో మంచి లొకేషన్స్‌ కోసం పదివేల మైళ్లు రెక్కీ నిర్వహించారు. సినిమా అంటే ఆయనకు అంత ప్రేమ.

అమ్మాయిలూ... వరుణ్‌లో మంచి లక్షణాలు చెప్పండి!
హెబ్బా: హి ఈజ్‌ వెరీ కూల్‌. అందరితో బాగా కలసిపోతాడు. వరుణ్‌తో మాట్లాడడానికి పెద్దగా బెరుకు అనిపించదు. చాలా వినయంగా ఉంటాడు. మనం ఏం చెప్పినా వింటాడు. సంతోషం, బాధ... ఇలా మనసులో ఫీలింగ్స్‌ని అతనితో పంచుకోవచ్చు.

లావణ్య: వరుణ్‌ మంచి యాక్టర్‌. (మధ్యలో హెబ్బా ‘ఓహ్‌.. నేనది చెప్పలేదు’ అంటే... లావణ్య ‘ఏం ఫర్వాలేదు’ నేను చెబితే నువ్వు చెప్పినట్లే) మంచి ఆర్టిస్టులతో చేసినప్పుడు మన నటన మెరుగవుతుంది. వరుణ్‌లో గుడ్‌ లుక్స్, ఇంటెలిజెన్స్‌... రెండూ ఉన్నాయి. డౌన్‌ టు ఎర్త్‌. సెట్‌లో అందరికీ హెల్ప్‌ చేస్తుంటాడు. మనకు ఏదైనా సమస్య ఎదురైందని చెబితే... అతని దగ్గర పరిష్కారం ఉంటుంది.

 వరుణ్‌.. లావణ్య, హెబ్బాల్లో మీకు నచ్చే లక్షణాలు ఏంటి?
వరుణ్‌: హార్డ్‌ వర్కింగ్, టాలెంట్‌ ఇటువంటివన్నీ పక్కన పెడితే... ఇద్దరిలో కామన్‌గా కనిపించే మంచి లక్షణం – ‘బేసిక్‌గా వాళ్లు ఎలా కనిపిస్తారో అలాగే ఉంటారు’. మన ముందు ఓ మాట, వెనక ఓ మాట మాట్లాడడం వంటివి ఉండవు. జోకులు వేసినా ఈజీగా తీసుకుంటారు. శ్రీనుగారు ఫస్ట్‌ హీరోయిన్ల గురించి చెప్పినప్పుడు పొట్టిగా ఉంటారేమో అనుకున్నా. వాళ్లు హైట్‌ బాగానే ఉంటారు. కానీ, నేను మరీ పొడుగు కదా! ఫస్ట్‌ హెబ్బాతో స్పెయిన్‌లో షూటింగ్‌ చేశా. హైట్‌ ప్రాబ్లెమ్‌ అనిపించలేదు. హమ్మయ్య... ఓ అమ్మాయి ఫర్వాలేదు. ఇంకో అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నా. లావణ్యతో ఫస్ట్‌ షాట్‌ చేశాక.. ఇద్దరం పరిగెత్తుకుని వెళ్లి, మానిటర్‌లో చూసుకున్నాం. బాగానే ఉన్నాం. హైట్‌ డిఫరెన్స్‌ లేదు.

వరుణ్‌ పక్కన పొట్టిగా కనిపిస్తామేమోననే భయం మీ ఇద్దరికీ ఉండేదా?
హెబ్బా: నేను శ్రీనుగారిని మొదటిసారి కలసినప్పుడు ఆయన నన్ను అడిగిన ప్రశ్న... ‘నీ ఎత్తు ఎంత?’ అని. ఇప్పుడు హైట్‌ గురించి నాకెలాంటి భయాలూ లేవు. వరుణ్‌తో పనిచేసిన తర్వాత ఇతర హీరోల హైట్‌ గురించి వర్రీ అవసరం లేదు. ఎవరితో అయినా చేసేయొచ్చు.

లావణ్య: వరుణ్‌ మంచి హైట్‌. మీడియమ్‌ రేంజ్‌ హైట్‌ ఉన్నవాళ్లు కూడా తన పక్కన పొట్టిగానే కనిపిస్తారు. మేం వరుణ్‌ పక్కన మరీ అంత పొట్టిగా కనిపించకుండా కేర్‌ తీసుకోవడానికి డైరెక్టర్‌గారు ఉన్నారు కదా (నవ్వేస్తూ).


శ్రీనూగారు! వరుణ్‌తో కాంబినేషన్‌ సీన్స్‌ అప్పుడు లావణ్య, హెబ్బాని ఎన్ని పెట్టెల మీద నిలబెట్టాల్సి వచ్చింది?
శ్రీను: (నవ్వేస్తూ)... యాక్చువల్‌గా హైట్‌ బ్యాలెన్స్‌ చేయడానికనే కాదు... ఒక్కోసారి మామూలుగా కూడా బాక్సులు వాడతాం. ఈ సినిమాలో విలన్‌గా చేసిన నికితన్‌ ధీర్‌ హైట్‌ 6 అడుగుల మూడంగుళాలు. మంచి ఎత్తే. అయినప్పటికీ ఒక యాంగిల్‌ కోసం బాక్స్‌ మీద నిలబెట్టాల్సి వచ్చింది. అలా లావణ్య, హెబ్బాలు కూడా కొన్నిసార్లు బాక్సుల మీద నిలబడ్డారు.

మీ నలుగురిలో కామన్‌గా కలిసే విషయం ఏదైనా ఉందా?
శ్రీను: నలుగురికీ సినిమాలంటే పిచ్చి. ఆఫ్‌ సెట్స్‌లో సరదాగా ఉంటాం. ఆన్‌ సెట్స్‌లో సీరియస్‌గా ఉంటాం.

మీరంతా ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు కదా! మరి సినిమా పూర్తయిన చివరి రోజున ఏమనిపించింది?
వరుణ్‌: నిజం చెప్పాలంటే.. ఇంతకు ముందు చేసిన మూడు సినిమాలçకు చివరి రోజున చాలా ఎమోషన్‌ అయ్యాను. కానీ, ఈ సినిమాకి అలా అనిపించలేదు. హ్యాపీగా అనిపించింది. తెలియని శాటిస్‌ఫేక్షన్‌ ఏదో కలిగింది. సినిమా అయిపోతేనేం? ఎప్పుడైనా కలవొచ్చు కదా అనిపించింది. మళ్లీ శ్రీనుగారితో సినిమా చేయొచ్చు. లావణ్యా, హెబ్బాలతో కూడా కలసి సినిమా చేస్తానేమో. అందుకే వీళ్లను మిస్సవుతున్న ఫీలింగ్‌ కలగలేదు.

లావణ్య: నాక్కూడా సేమ్‌ ఫీలింగ్‌. దూరమైపోతున్నాం అనిపించలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా.

హెబ్బా: నాకైతే ఒక్క లాస్ట్‌ డే కాదు.. మూడు, నాలుగు చివరి రోజులన్నమాట.

వరుణ్‌: అవునండీ! ఈ అమ్మాయికి యాక్షన్‌ సీన్స్‌ ఉండేవి. ఒకసారి తీసిన తర్వాత, ‘ఇక నీ పార్ట్‌ అయిపోయింది’ అని పంపించేసేవాళ్లు. ఆ తర్వాత ఏదో చిన్న సీన్‌ తీయాలంటూ మళ్లీ పిలిచేవాళ్లు.

హెబ్బా: అందుకే ‘ఇక నువ్వు రావాల్సిన అవసరంలేదు. నీ పార్ట్‌ మొత్తం పూర్తయింది’ అని ఫైనల్‌ కన్ఫర్మేషన్‌ ఇచ్చాక, యూనిట్‌ని మిస్సవుతున్నాం అని ఆలోచించకుండా హ్యాపీగా వెళ్లిపోయా. బట్‌... వండర్‌ఫుల్‌ టీమ్‌.

ఫైనల్లీ ‘మిస్టర్‌’ షూటింగ్‌లో స్వీట్‌ మెమరీ?
వరుణ్‌: చిక్‌మగళూర్‌ షెడ్యూల్‌ని మరచి పోలేను. ఎంజాయ్‌ చేస్తూ, భయపడుతూ చేసిన షెడ్యూల్‌ అది. చిక్‌మగళూర్‌లో జలగలు ఎక్కువ. అవి ఒంటి మీద పాకేది కూడా తెలియదు. నాకు తెలిసి ఎక్కువ జలగలు పాకింది నా ఒంటి మీదేనేమో. ఒకసారి కాలు చూసుకుంటే ఆల్రెడీ ఒకటి పాకుతూ, రక్తం పీల్చుతోంది. అదిరిపోయాను. మందు రాసుకోవడం వల్ల ప్రమాదాలేం జరగలేదు.

శ్రీను: ఆ షెడ్యూల్‌ అప్పుడు వీళ్లకు ముందు చెప్పకుండా ఓ విషయం దాచాను.అదేంటంటే... అక్కడే ఓ లొకేషన్‌లో సీన్‌ తీయాలి. అక్కడ కొండ చిలవలు ఎక్కువ. ఆ విషయం తెలిస్తే కంగారుపడతారని చెప్పలేదు. తర్వాత చెప్పాను. భయపడుతూనే అక్కడ షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. అందరూ చుట్టుపక్కల చూస్తూ షూటింగ్‌ చేయడమే (నవ్వుతూ). కెమెరామ్యాన్‌ గుహన్‌గారైతే భయం భయంగా దిక్కులు చూసేవారు. ఆ షెడ్యూల్‌ బాగా గుర్తు.

లావణ్య: రన్నింగ్‌ బస్‌ మీద నేను డ్యాన్స్‌ చేసే సీన్స్‌ ఉన్నాయి. నేను ఇన్‌వాల్వ్‌ అయి డ్యాన్స్‌ చేస్తుంటే, గుహన్‌ గారు సిన్సియర్‌గా షూట్‌ చేశారు. ఆ సమయంలో ఒక పెద్ద కొమ్మ ఆయనకు తగిలి ఉండేది. తృటిలో తప్పింది.

హెబ్బా: నాకు యాక్షన్‌ సీన్స్‌ చేయడం ఇష్టం. ఈ మూవీలో ఆ స్కోప్‌ దొరికింది. అది నాకు స్వీట్‌ మెమరీ. లక్కీగా నాకు చిక్‌మగళూరు లొకేషన్‌లో ఆ సీన్స్‌ లేవు. 

‘మిస్టర్‌’ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ కదా.. రియల్‌ లైఫ్‌లో ఒకేసారి మీరు ఇద్దరమ్మాయిలకు ప్రపోజ్‌ చేసిన సందర్భాలున్నాయా?
వరుణ్‌: అబ్బే. ఒక్క అమ్మాయితో మాట్లాడటమే కష్టమండి బాబు. ఇక ఇద్దరా? నో.. నో.. తప్పు కూడా.

మీ ఇద్దరికీ ఇద్దరబ్బాయిలు ఒకేసారి ప్రపోజ్‌ చేసే ఉంటారేమో?

లావణ్య: ఇద్దరేంటి? స్కూల్, కాలేజ్‌ డేస్‌లో చాలామంది ప్రపోజ్‌ చేసేవారు. లవ్‌ లెటర్స్, రోజ్‌ ఫ్లవర్స్‌ కుప్పలు తెప్పలుగా వచ్చేవి.

హెబ్బా: అమ్మాయిలకెప్పుడూ అంతే. వాళ్ల చుట్టూ తిరగడానికి చాలామంది అబ్బాయిలు రెడీ అయిపోతారు. ప్రపోజల్స్‌ మీద ప్రపోజల్స్‌ వస్తుంటాయి.

శ్రీనూగారు... ఈ మిస్టర్, మిస్‌లలో ఎవరు మంచోళ్లు?
శ్రీను: ఇలాంటి టఫ్‌ క్వశ్చన్స్‌ అడిగేస్తే ఎలా అండి? ముగ్గురూ మంచోళ్లే. నేనిప్పటివరకూ ఛానెల్స్‌కి తప్ప ఇలా ముగ్గురు నలుగురితో కలసి ప్రింట్‌ మీడియాకి ఇంటర్వూ్యలు ఇచ్చింది లేదు. ఇదిగో ఇప్పుడిలా హాయిగా నలుగురం కలసి ఇంటర్వూ్య ఇస్తున్నామంటే... ఒకరి పట్ల మరొకరికి మంచి అభిప్రాయం ఉండడమే. అది లేకపోతే అవాయిడ్‌ చేసేవాళ్లం. ఎవరికి వారు సెపరేట్‌ ఇంటర్వూ్యలు ఇస్తామనేవాళ్ళం.

– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement