'మిస్టర్' క్లీన్ | Mister completed censor formalities | Sakshi
Sakshi News home page

'మిస్టర్' క్లీన్

Published Wed, Apr 12 2017 10:32 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

'మిస్టర్' క్లీన్

'మిస్టర్' క్లీన్

లోఫర్ సినిమాతో నిరాశపరిచిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీతో తెరకెక్కిన మిస్టర్ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికేట్ను అందించారు. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు.

వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మించిన మిస్టర్, వరుణ్ తేజ్కు కమర్షియల్ హీరో ఇమేజ్ను తీసుకువస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మెగా ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement