
కర్ణాటకలో 'మిస్టర్'
శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్'. ఇంతకుముందే మొదటి షెడ్యూల్ షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. సోమవారం నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభించింది. ఊటీ, కర్ణాటకలోని కొన్ని లొకేషన్లలో చిత్రీకరణ జరుపనున్నారు. ఇదే షెడ్యూల్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొంటారు.
ఆగడు, బ్రూస్ లీ పరాజయాల తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్కు కీలకం కానుంది. శ్రీనువైట్ల మార్క్ యాక్షన్ కామెడీగా 'మిస్టర్' రూపొందుతోందని సమాచారం. ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.