కుర్ర హీరోలకు లక్కీ గర్ల్ | Lavanya Tripathi Turns Lucky for Young Heroes | Sakshi
Sakshi News home page

కుర్ర హీరోలకు లక్కీ గర్ల్

Published Fri, Sep 16 2016 1:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

కుర్ర హీరోలకు లక్కీ గర్ల్

కుర్ర హీరోలకు లక్కీ గర్ల్

హీరోయిన్ స్టార్ ఇమేజ్ అందుకోవటం కోసం కష్టపడుతున్న లావణ్య త్రిపాఠి, యంగ్ హీరోలకు లక్కీ గర్ల్గా మారుతోంది. చాలా రోజులుగా హిట్ కొసం ఎదురుచూస్తున్న హీరోలు లావణ్యతో జతకడితే హిట్ గ్యారెంటీ అన్న పేరు తెచ్చుకుంది ఈ బ్యూటి. అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి తొలి సినిమాతో అందం, అభినయంతో ఆకట్టుకున్నా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇటీవల ఈ అమ్మడు హీరోయిన్గా నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తుండటంతో వరుస ఆఫర్లతో బిజీ అవుతోంది.

ఓ మంచి హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న నాని, లావణ్యతో జత కట్టిన భలే భలే మొగాడివోయ్ భారీ కలెక్షన్లతో సత్తా చాటింది. ఆ తరువాత లావణ్య హీరోయిన్గా రూపొందిన సొగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. దీంతో యంగ్ హీరోలు లావణ్య త్రిపాఠితో జత కట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి, మరోసారి సొగ్గాడే ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించింది. నాగచైతన్య హీరోగా కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో లావణ్య సెంకడ్ హీరోయిన్ గా ఓకె అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement