ఇటలీలో 'మిస్టర్' ఆటాపాటా..! | Mister Varun Tej, Lavanya Tripathi, Srinu Vytla Fly To Italy | Sakshi
Sakshi News home page

ఇటలీలో 'మిస్టర్' ఆటాపాటా..!

Published Sat, Apr 1 2017 11:56 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

ఇటలీలో 'మిస్టర్' ఆటాపాటా..!

ఇటలీలో 'మిస్టర్' ఆటాపాటా..!

శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎక్కువగా ఎక్స్పరిమెంటల్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన వరుణ్, కమర్షియల్ ఫార్మాట్లో చేసిన లోఫర్ నిరాశపరిచింది. దీంతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు మిస్టర్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. వరుస ఫ్లాప్ల తరువాత దర్శకుడు శ్రీనువైట్ల కూడా మిస్టర్ సక్సెస్తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న మిస్టర్ యూనిట్, చివరి పాట్ చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు హీరో వరుణ్ తేజ్. ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల మీద ఓ డ్యూయెట్ను చిత్రీకరించనున్నారు. ఈ పాటతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేద్దామని భావించినా, సమ్మర్ హాలీడేస్ కావటంతో లాంగ్ వీకెండ్ను టార్గెట్ చేస్తూ ఒక రోజు ముందుగానే ఏప్రిల్ 13న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ 6న అభిమానుల సమక్షంలో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement