Srinu Vytla
-
ఇటలీలో 'మిస్టర్' ఆటాపాటా..!
శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎక్కువగా ఎక్స్పరిమెంటల్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన వరుణ్, కమర్షియల్ ఫార్మాట్లో చేసిన లోఫర్ నిరాశపరిచింది. దీంతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు మిస్టర్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. వరుస ఫ్లాప్‌ల తరువాత దర్శకుడు శ్రీనువైట్ల కూడా మిస్టర్ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న మిస్టర్ యూనిట్, చివరి పాట్ చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు హీరో వరుణ్ తేజ్. ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల మీద ఓ డ్యూయెట్‌ను చిత్రీకరించనున్నారు. ఈ పాటతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేద్దామని భావించినా, సమ్మర్ హాలీడేస్ కావటంతో లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ ఒక రోజు ముందుగానే ఏప్రిల్ 13న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ 6న అభిమానుల సమక్షంలో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. Off to Italy for shoot with @SreenuVaitla & @Itslavanya Last song of #Mister #song#shoot#Mister#travel pic.twitter.com/cCVGUBMqZk — Varun Tej (@IAmVarunTej) 1 April 2017 -
వరుణ్ సినిమా ఆగిపోలేదు
కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ సినిమాలపై వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. లోఫర్ సినిమా తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాను ప్రారంభించాడు వరుణ్. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉన్న కథా కథనాలు పూర్తిగా రెడీ కాకపోవటంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఒక దశలో శ్రీనువైట్ల, వరుణ్‌ల సినిమా ఆగిపోయిందన్న వార్త కూడా ఫిలింనగర్లో వినిపించింది. అయితే తాజాగా మిస్టర్ సినిమా మీద వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఈ నెల 27 నుంచి ఈ సినిమా స్పెయిన్‌లో ప్రారంభమవుతుందంటూ తెలిపాడు. గురువారం ఉదయం తన ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించిన వరుణ్, షూటింగ్ మొదలు పెట్టడానికి ఎదురుచూస్తున్నట్టుగా తెలిపాడు. దీంతో శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వరుణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ఇప్పట్లో లేదన్న విషయం కన్ఫామ్ అయ్యింది. Can't wait to get back to work and back on sets.My film with Srinu Vaitla garu will start rolling in Spain from 27th pic.twitter.com/c06HVYAQ5j — Varun Tej (@IAmVarunTej) 9 June 2016 -
అనిరుధ్‌కు షాక్
యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌కు టాలీవుడ్ నిర్మాత షాక్ ఇచ్చారన్నది తాజా సమాచారం. వరుస విజయాలతో కోలీవుడ్‌లో ఎదుగుతున్న సంగీత దర్శకుడు అనిరుధ్. అనిరుధ్ అందించిన వై దిస్ కొలై వెరిడి పాట ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీంతో టాలీవుడ్ కూడా అనిరుధ్‌పై దృష్టి సారించింది. తెలుగులో రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రానికి అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అయితే పాటలను సంగీతాన్ని అందించడంలో ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఆ చిత్ర నిర్మాత అనిరుధ్‌ను చిత్రం నుంచి తప్పించినట్లు సమాచారం. ఈ విషయంలో కథానాయకుడు రామ్‌చరణ్, దర్శకుడు శ్రీనువైట్ల కూడా మౌనం వహించడం అనిరుద్‌కు బాధించిందని సమాచారం. అనిరుధ్ త్వరలో ప్రారంభం కానున్న అజిత్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు. -
ప్రకాష్రాజ్కే సిగ్గులేదు : శ్రీను వైట్ల
శ్రీను వైట్ల, ప్రకాశ్‌రాజ్... మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివాన అయ్యేట్లు కనిపిస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ప్రమోషన్లో భాగం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీను వైట్లపై ఓ స్థాయిలో ధ్వజమెత్తారు ప్రకాశ్‌రాజ్. ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేశారు శ్రీను వైట్ల. ‘‘ప్రకాశ్‌రాజ్ నిన్న ప్రెస్మీట్లో నాకు అహంకారం అన్నారు. ‘ఆగడు’ నుంచి ఆయన్ను తప్పించడానికి కారణం నా అహంకారం కాదు. ఆత్మాభిమానం. ఒక దర్శకునిగా నా విభాగంలోని సహాయ దర్శకుడిపై చెప్పుకోడానికి వీల్లేని మాటలతో దూషిస్తే... దాన్ని భరించలేక ఆ సినిమా నుంచి ఆయన్ను తీసేశాను. నేనా పని చేసినప్పుడు నా యూనిట్ మొత్తం కరతాళధ్వనులతో అభినందించింది. అది తప్పయితే... అందరూ అలా స్పందించరు కదా’’ అన్నారు. ఇంకా శ్రీను వైట్ల చెబుతూ-‘‘ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలపై అప్పుడే దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాం. ఒక ఫిర్యాదు అసోసియేషన్‌లో నమోదై ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశాలు పెట్టకూడదు. కానీ... ప్రకాశ్‌రాజ్ పెట్టారు. తెలుగు నేర్చుకొని మరీ నాపై ఓ కవిత రాసి, దాన్ని అందరి సమక్షంలో నాకు అంకితమిచ్చారు. నాకు డెడికేట్ చేసిన ఆ కవితపై నాకు అధికారం ఉంటుంది. అందుకే... దాన్ని ‘ఆగడు’లో వాడుకున్నా’’ అన్నారు. ‘‘సినిమా హాళ్లల్లో ప్రదర్శింపబడుతున్న సినిమాపై సినిమా పరిశ్రమకు చెందినవాడెవడూ ఫ్లాప్ అని కామెంట్ చేయడు. అలా మీడియా ఎదురుగా ఉండి మాట్లాడేవాడు అసలు సినిమావాడే కాదు. ఒక సినిమా వ్యక్తివి అయ్యుండి, సాటి వారి సినిమాను ఫ్లాప్ అని ప్రచారం చేస్తున్న నిన్ను ‘సిగ్గులేదా’ అనాలా? లేక అంతకంటే పెద్దమాట ఇంకేదైనా అనాలా?’’ అంటూ ఘాటుగా స్పందించారు శ్రీను వైట్ల. ‘‘పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్‌లపై నేను సైటైర్లు వేశానని అన్నాడు. పవన్‌కల్యాణ్ అంటే నాకెంతో అభిమానం. ఇక ఎన్టీఆర్‌తో ఇప్పటికే నేను కలిసి పనిచేశాను. వారిద్దరిపై సెటైర్లు వేయాల్సిన అవసరం నాకేంటి?’’ అని ప్రశ్నించారు. ఒక దర్శకునిగా సినిమా ఎలా తీయాలో ప్రకాశ్‌రాజ్ దగ్గర నేర్చుకునే స్థితిలో తాను లేననీ, ఈ వివాదం తర్వాత విడుదలైన ప్రకాశ్‌రాజ్ ‘ఉలవచారు బిర్యాని’ సినిమా ఫలితం ఏంటో ఇటు పరిశ్రమకూ, అటు ప్రేక్షకులకూ తెలుసనీ శ్రీను వైట్ల ఎద్దేవా చేశారు. సినిమాలను ప్రేమతో తీయాలి కానీ, కక్షతో కాదని ‘ఆగడు’పై సెటైరు విసిరిన ప్రకాశ్‌రాజ్... ఆయన దర్శకత్వంలో తీసిన సినిమాలను ప్రేమతో తీశాడా, కక్షతో తీశాడా? మరి వాటి ఫలితాలు ఎందుకలా వచ్చాయని ప్రశ్నించారు. అహంకారం తగ్గించుకుంటే మంచిదని ప్రకాశ్‌రాజ్ హితవు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అతనిపై ఉన్న ఎలిగేషన్స్ ఏ నటునిపైనా ఉండవనీ, ఎన్నిసార్లు అతనిపై నిషేదాజ్ఞలు జారీ అయ్యాయో అందరికీ తెలుసనీ శ్రీను గుర్తుచేశారు. తాను అహంకారంతో పైకొచ్చినవాణ్ణి కాననీ, హార్డ్‌వర్క్‌తో పైకొచ్చినవాణ్ణని ఆయన అన్నారు. విద్వేషాలు ఆపితే మంచిది - దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ శనివారం విలేకరుల సమావేశంలో ‘నటునిగా నాపై నిషేధాన్ని విధింపజేయడానికి కొందరు డ్రామాలు ప్లే చేశారు’ అని ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించడాన్ని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ తీవ్రంగా ఖండించారు. శ్రీను వైట్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన కూడా హాజరై ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘డ్రామాలు ప్లే చేశారు... అని ప్రకాశ్‌రాజ్ బహువచనంతో మాట్లాడటం దర్శకుల సంఘం మొత్తానికి అభ్యంతరకరంగా ఉంది. ఆయన్ను నిషేధించడానికి నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. ఇష్టం లేకపోతే కలిసి పనిచేయం అంతే. ఇది ఆత్మాభిమానానికీ, ఆత్మగౌరవానికీ సంబంధించిన ఇష్యూ. దర్శకుల సంఘం సభ్యుణ్ణి అభ్యంతరకర పదజాలంతో మాట్లాడటం అనేది తప్పు. దానిపై ఫిర్యాదు నమోదై ఉన్నప్పుడు విలేకరుల సమావేశం ఆయన పెట్టకూడదు. శ్రీను వైట్ల కూడా అప్పుడు ప్రెస్‌మీట్ పెడదామంటే మేమే వద్దన్నాం. కానీ.. ఇప్పుడు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ని శ్రీను వైట్లను దూషించడానికి ఉపయోగించుకున్నారాయన. దీని కారణంగా.. ఆ సినిమాకు రావాల్సిన ప్రచారం రాలేదు. మీడియా మొత్తం వీరిద్దరి గొడవనే హైలైట్ చేసి రాసింది. అయినా.. ఒక నటుణ్ణి నిషేధించే రైట్స్ మాకుండవ్. ఇకనైనా ఈ విషయంపై ఇద్దరూ సంయమనం పాటిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. కాదంబరి కిరణ్‌కుమార్, మద్దినేని రమేశ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొందరు మారరు: ప్రకాశ్‌రాజ్ ‘‘తాటిచెట్టు కింద దొరికిపోయినవాణ్ణి ఏం చేస్తున్నావని అడిగితే పాలు తాగుతున్నా అని చెప్పాడంట. ఆల్ ది బెస్ట్ చీర్స్’’... శ్రీను వైట్ల సమావేశం తర్వాత ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్లో కనిపించిన మాటలివి. మరి.. ప్రకాశ్‌రాజ్ ఎవరిని ఉద్దేశించి ఈ విధంగా అన్నారో...? -
కొందరు మారరు: ప్రకాష్‌రాజ్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల విమర్శలకు ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందించారు. ప్రిన్స్ మహేశ్‌బాబు ఆగడు సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు శ్రీనువైట్లకు, ప్రకాశ్‌రాజ్‌కి మధ్య తలెత్తిన విభేదాలు చిలికిచికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. ప్రకాష్‌రాజ్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీను వైట్లను విమర్శిస్తే, శ్రీను వైట్ల ఈరోజు ప్రెస్మీట్లో ప్రకాష్‌రాజ్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రకాష్‌రాజ్ ఫేస్బుక్లో, ట్విట్టర్ లో ఇలా రాశారు: కొందరు మారరు ''తాటి చెట్టు కింద దొరికిపోయినవాడిని ఏమి చేస్తున్నావు అని అడిగితే, పాలు తాగుతున్నానని చెప్పాడట'' ఆల్ ది బెస్ట్ ఛీర్స్. Kondaru mararu " thaati chettu kinda doriki poina vadni em chestunnav Ani adigithe paalu thaaguthunna ani chepyadanta " all the best cheers — Prakash Raj (@prakashraaj) October 5, 2014 -
అనుకున్నది సాధించే పోలీసాఫీసర్
‘‘మహేశ్‌బాబుతో మేం నిర్మించిన మూడో చిత్రం ఇది. ఓ సూపర్‌స్టార్‌తో ఇలా మూడు సినిమాలు చేసే అవకాశం రావడం మా అదృష్టం’’ అని అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట చెప్పారు. మహేశ్‌బాబు హీరోగా జి. రమేశ్‌బాబు సమర్పణలో శ్రీను వైట్ల దర్శక్వంలో రూపొందిన ‘ఆగడు’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట బుధవారం హైదరాబాద్‌లో పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని దాదాపు రెండు వేల థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. తను అనుకున్నది సాధించడానికి ఎవరు ఆపినా ఆగని క్రమశిక్షణ గల పోలీసాఫీసర్ కథ ఇది’’ అన్నారు. ‘గబ్బర్‌సింగ్’ చిత్రానికి, ‘ఆగడు’కి పోలికలున్నాయనే టాక్ ఉంది? అనే ప్రశ్నకు -‘‘ఇందులో మహేశ్ కూడా పోలీసాఫీసర్ కాబట్టి, అలా అనిపిస్తుందేమో. అది మినహా ఆ చిత్రానికి, దీనికీ ఎక్కడా పోలిక ఉండదు. మహేశ్ పాత్ర చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయన చేసిన ఫైట్లు, డాన్సులు.. ఓవరాల్‌గా సినిమా అభిమానులు పండగ చేసుకునేలా ఉంటుంది. ఈ చిత్రం కోసం బళ్లారిలో కీలక సన్నివేశాలు తీశాం. అందుకని మాఫియా మైనింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందనే వార్త ప్రచారంలో ఉంది. అది నిజం కాదు. ఇప్పటివరకు శ్రీను వైట్ల చేసిన చిత్రాల్లో బాగా స్టయిలిష్‌గా ఉండే సినిమా ఇది. మహేష్‌తో ఆయన చేసిన ‘దూకుడు’కి, ఈ చిత్రానికీ టేకింగ్ పరంగా కూడా వ్యత్యాసం ఉంటుంది’’ అని చెప్పారు. పోలీసు డ్రెస్‌లో బెల్ట్ కీలకమైనది కాబట్టి, ప్రపంచంలోనే అత్యంత పొడవైన పోలీస్ బెల్ట్ తయారు చేయించామని, ఈ బెల్ట్ పొడవు సుమారు 12వేల అడుగులు ఉంటుందని, వైజాగ్ ఆర్కే బీచ్‌లో ఈ బెల్ట్‌ని చూడొచ్చని నిర్మాతలు తెలిపారు. -
తెరకు అందాన్నిచ్చే హీరో మహేశ్ : శంకర్
‘‘మహేశ్ సినిమాలు మొదట్లో పెద్దగా చూడలేదు. ‘ఒక్కడు’ నుంచి రెగ్యులర్‌గా చూడ్డం మొదలుపెట్టాను. అతని సినిమాల్లో ‘దూకుడు’ నా ఫేవరెట్ మూవీ. తెరకు అందాన్నిచ్చే హీరో మహేశ్. ఎమోషన్, రొమాన్స్, కామెడీ.. ఇలా ఏ రసాన్నయినా కొలత ప్రకారం చేయడం మహేశ్‌లోని ప్రత్యేకత’’ అని ప్రముఖ దర్శకుడు శంకర్ అన్నారు. మహేశ్ కథానాయకునిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘ఆగడు’. సంగీత దర్శకునిగా తమన్ 50వ చిత్రమిది. ఈ సినిమా పాటలను శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. శంకర్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని మహేశ్‌కి అందించారు. శంకర్ ఇంకా మాట్లాడుతూ -‘‘తమన్ మంచి డ్రమ్మర్. ‘బాయ్స్’ సినిమా ఆడిషన్స్ టైమ్‌లో డ్రమ్స్ ప్లే చేస్తుండేవాడు. ట్యూన్స్ వినిపిస్తుండేవాడు. అతను ఈ రోజు ఈ స్థాయికి రావడం గర్వంగా ఉంది. అతని ఆల్బమ్స్‌లో ‘దూకుడు’ నా ఫేవరెట్. ఒక సినిమాను కమర్షియల్ ప్యాక్‌లా చేయడం తేలికైన విషయం కాదు. ఈ విషయంలో శ్రీను వైట్లను అభినందించాలి. బ్రహ్మానందంకి గొప్ప ఫ్యాన్‌ని. ఈ కాంబినేషన్ మళ్లీ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘చెన్నైలో ఉన్నప్పుడు శంకర్‌గారి సినిమాలు విడుదలవగానే, తొలిరోజు బ్లాక్ టికెట్ కొని మరీ చూసేవాణ్ణి. ఈ రోజు ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. 50 సినిమాల సంగీత దర్శకుడైన తమన్‌కి శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమా నిర్మాతలకు సినిమాపై ఉన్నంత పిచ్చి ప్రేమ ఎవరికీ ఉండదు. వీళ్లతో ఇలాంటి సూపర్హిట్లు మళ్లీ మళ్లీ చేయాలనుంది. శ్రీను వైట్లతో వర్క్‌ను ఎంజాయ్ చేస్తాను. ‘దూకుడు’ షూటింగ్ టైమ్‌లోనే ‘మన నెక్ట్స్ సినిమా పేరు ‘ఆగడు’’ అని చెప్పేశాడు. అప్పుడు, ఇప్పుడు శ్రీను వైట్ల చెప్పింది చెప్పినట్లు చేశాను. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. దసరా పండగను రెండు వారాల ముందే జరుపుకుందాం’’అని మహేశ్ అన్నారు. శ్రీనుై వెట్ల చెబుతూ -‘‘తమన్ ఈ ఆల్బమ్ కోసం ఏడాది కష్టపడ్డాడు. కథ అడిగింది ఇచ్చే నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఇలాంటి నిర్మాతలు గతంలో నా సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం కావడం ఆనందంగా ఉంది. ‘దూకుడు’లో మహేశ్ పవర్‌ని పది శాతమే చూశారు. ‘ఆగడు’లో వంద శాతం చూస్తారు’’ అన్నారు. నాజర్, బ్రహ్మానందం, సుకుమార్, సుధీర్‌బాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కోటి పరుచూరి, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. -
దూకుడే... ఇక ఆగడు!
‘దూకుడు’, ‘ఆగడు’.. ఈ టైటిల్స్‌కి తగ్గట్టే ఉంది ఇప్పుడు మహేశ్‌బాబు వేగం. ఓ సినిమా పూర్తి చేయడం, మరో సినిమా పట్టాలెక్కించేయడం... ఇలా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారాయన. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేశ్ చేస్తున్న ‘ఆగడు’ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దాంతో... తన తర్వాత సినిమాను సెట్స్‌కి తీసుకెళ్లే ముహూర్తాన్ని అప్పుడే ఖరారు చేసేశారు ప్రిన్స్. కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి మహేశ్ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఆగస్ట్ 11న జరుగనుంది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. మరి... ఈ సినిమాలో మహేశ్ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది, బ్లాక్‌బస్టర్ ‘మిర్చి’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కథ ఏ జానర్లో ఉంటుంది, కథానాయిక, ఇతర పాత్రధారులు, సాంకేతిక నిపుణుల వివరాలేంటి... ఇవన్నీ తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. -
మహేష్ ఇక ఆగడు
మహేష్ సినిమాల్లో ‘దూకుడు’ ఓ సంచలనం. మళ్లీ ఆ కాంబినేషన్ కోసం అటు ప్రేక్షకులు, ఇటు అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఆ ఎదురు చూపులకు తెర పడబోతోంది. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్లో నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించనున్న ‘ఆగడు’ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నదని విశ్వసనీయ సమాచారం. ఈ నెల 11న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించాలని దర్శకుడు శ్రీనువైట్ల భావిస్తునట్లు తెలిసింది. అయితే... మహేష్‌బాబు, ఈ చిత్ర నిర్మాతలు... ‘1’ చిత్రం షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్‌లో ఉన్నారు. ఈ నెల 13న వారు ఇండియా రానున్న నేపథ్యంలో...ఈ నెల 14న భారీగా ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని జరపాలనే మరో ఆలోచనలో కూడా ఉన్నట్లు వినికిడి. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకతేదీన ‘ఆగడు’ మొదలవ్వడం ఖాయమని మాత్రం తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథనాయికలు, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో రెండు పాటలు ఓకే అయ్యాయట. సంగీత దర్శకునిగా తమన్కిది 50వ సినిమా కావడం విశేషం!