కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ సినిమాలపై వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. లోఫర్ సినిమా తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాను ప్రారంభించాడు వరుణ్. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉన్న కథా కథనాలు పూర్తిగా రెడీ కాకపోవటంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఒక దశలో శ్రీనువైట్ల, వరుణ్ల సినిమా ఆగిపోయిందన్న వార్త కూడా ఫిలింనగర్లో వినిపించింది.
అయితే తాజాగా మిస్టర్ సినిమా మీద వస్తున్న రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఈ నెల 27 నుంచి ఈ సినిమా స్పెయిన్లో ప్రారంభమవుతుందంటూ తెలిపాడు. గురువారం ఉదయం తన ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించిన వరుణ్, షూటింగ్ మొదలు పెట్టడానికి ఎదురుచూస్తున్నట్టుగా తెలిపాడు. దీంతో శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వరుణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ఇప్పట్లో లేదన్న విషయం కన్ఫామ్ అయ్యింది.
Can't wait to get back to work and back on sets.My film with Srinu Vaitla garu will start rolling in Spain from 27th pic.twitter.com/c06HVYAQ5j
— Varun Tej (@IAmVarunTej) 9 June 2016