ప్రకాష్రాజ్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల విమర్శలకు ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్ సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందించారు. ప్రిన్స్ మహేశ్‌బాబు ఆగడు సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు శ్రీనువైట్లకు, ప్రకాశ్‌రాజ్‌కి మధ్య తలెత్తిన విభేదాలు చిలికిచికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. ప్రకాష్రాజ్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీను వైట్లను విమర్శిస్తే, శ్రీను వైట్ల ఈరోజు ప్రెస్మీట్లో ప్రకాష్రాజ్ను విమర్శించారు.
ఈ నేపథ్యంలో ప్రకాష్రాజ్ ఫేస్బుక్లో, ట్విట్టర్ లో ఇలా రాశారు: కొందరు మారరు ''తాటి చెట్టు కింద దొరికిపోయినవాడిని ఏమి చేస్తున్నావు అని అడిగితే, పాలు తాగుతున్నానని చెప్పాడట'' ఆల్ ది బెస్ట్ ఛీర్స్.
Kondaru mararu " thaati chettu kinda doriki poina vadni em chestunnav Ani adigithe paalu thaaguthunna ani chepyadanta " all the best cheers
— Prakash Raj (@prakashraaj) October 5, 2014