మరో హిట్ కు రడీ అయిపోతున్న మెగా ప్రిన్స్! | Varun Tej's Mister Teaser going viral with million views | Sakshi
Sakshi News home page

మరో హిట్ కు రడీ అయిపోతున్న మెగా ప్రిన్స్!

Published Mon, Jan 2 2017 8:53 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

మరో హిట్ కు రడీ అయిపోతున్న మెగా ప్రిన్స్!

మరో హిట్ కు రడీ అయిపోతున్న మెగా ప్రిన్స్!

హైదరాబాద్: కంచె సినిమాతో తనకంటూ  ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న మెగా  ప్రిన్స్, టాలీవుడ్ హీరో వరుణ్‌ తేజ్‌   మరోసారి  తన స్పెషాల్టీని నిరూపించుకోనున్నాడు.    వరుణ్  రాబోయే చిత్రం 'మిస్టర్‌'   టీజర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే  మెగా హిట్లను సాధిస్తోంది.  న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయిన ఈ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో టాప్‌లో నిలవడం ఒక విశేషంకాగా,  మిలియన్‌ (పదిలక్షలు) కు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకోవడం మరోవిశేషం.  73 సెకన్ల పాటు  మిస్టర్ మూవీ  టీజర్  1,253,588  పైగా లైక్స్, అభిమానుల కమెంట్లతో దూసుకుపోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ మరో హిట్ కు రడీ అయిపోతున్నాడంటూ  అభిమానులు కమెంట్ చేస్తున్నారు. ఆరడుగుల అందగాడిని స్టన్నింగ్ లుక్స్ తో మరింత అందంగా చూపించాడంటూ దర్శకుడు శ్రీనువైట్లపై  ప్రశంసలు  కురిపిస్తున్నారు.


శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న రిచ్ అండ్  రొమాంటిక్ ఎంటర్టైనర్ లో  వరుణ్ కు జోడీగా  లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్   నటిస్తుండగా, లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.  మరోవైపు ఈ  మూవీ  ఆడియోను కూడా త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement