మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే? | Varun Tej Matka Movie Teaser Telugu | Sakshi
Sakshi News home page

Matka Teaser: 'మట్కా' టీజర్.. వింటేజ్ స్టైల్లో అదిరిపోయేలా

Published Sat, Oct 5 2024 3:58 PM | Last Updated on Sat, Oct 5 2024 4:06 PM

Varun Tej Matka Movie Teaser Telugu

మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'మట్కా'. 1980 బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న  ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విజయవాడలో లాంచ్ చేశారు. గత కొన్నాళ్లుగా వరస ఫ్లాఫ్స్ దెబ్బకు పూర్తిగా డీలా పడిపోయిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. టీజర్ అయితే ఆకట్టుకునేలా ఉంది.

(ఇదీ చదవండి: వాళ్ల మాటల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నా: ప్రియమణి)

యుక్త, వృద్ధ పాత్రల్లో వరుణ్ తేజ్ కనిపించాడు. వింటేజ్ లుక్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయని టీజర్‌తో హింట్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ 'మట్కా' టైటిల్‌కి తగ్గట్లు ఈ గేమ్‌కి సంబంధించిన సీన్స్ ఎక్కడ చూపించలేదు. బహుశా ట్రైలర్‌లో రివీల్ చేస్తారేమో?

'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. వరుణ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు. నవంబరు 14న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement