మోడర్న్‌ సూర్యకాంతం | Niharika Konidela Suryakantham Teaser Out | Sakshi
Sakshi News home page

మోడర్న్‌ సూర్యకాంతం

Published Sun, Jan 27 2019 2:07 AM | Last Updated on Sun, Jan 27 2019 2:07 AM

Niharika Konidela Suryakantham Teaser Out - Sakshi

నిహారిక, రాహుల్‌ విజయ్‌

‘సూర్యకాంతం’ పేరు వినగానే గయ్యాళి పాత్రలు గుర్తొస్తాయి. ప్రస్తుతం అదే టైటిల్‌తో నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌ ఓ సినిమాలో నటించారు. ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకుడు. నిర్వాణ సినిమాస్‌ సంస్థ నిర్మించించి. ఈ చిత్రం టీజర్‌ను వరుణ్‌తేజ్‌ రిలీజ్‌ చేశారు. గయ్యాళి గాళ్‌ఫ్రెండ్‌గా నిహారికా కనిపించారు. ‘‘ఆల్రెడీ రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభించింది. టీజర్‌ ఫీల్‌ గుడ్‌ అంటున్నారు. ఈ చిత్రంలో శివాజీరాజా, సుహాసిని ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. మార్చి 29న చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి  సమర్పణ: వరుణ్‌ తేజ్, నిర్మాతలు: సందీప్‌ ఎర్రం రెడ్డి, సృజన్‌ యారబోల్, రామ్‌ నరేశ్‌. సాహిత్యం: కృష్ణకాంత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement