Rahul Vijay
-
ఆకట్టుకుంటున్న ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ ఫస్ట్‌లుక్
‘డియర్ మేఘ’, ‘భాగ్ సాలే’ వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందన్న రానా..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు."ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. -
ఫ్యాషన్ ప్రపంచంలో.. తనదొక సైలెంట్ నేమ్!
రాహుల్ విజయ్.. ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సైలెంట్ నేమ్! అతని స్టయిలింగే కనిపిస్తుంటుంది గొప్ప గొప్ప ఈవెంట్లలో.. పెద్ద పెద్ద పార్టీల్లో! కంప్లీట్ డీటేయిలింగ్తో స్టయిల్ని క్రియేట్ చేస్తాడు క్లాసిక్‌గా! అందుకే ఏ రంగంలోని సెలబ్రిటీలకైనా అతను మోస్ట్ వాంటెడ్ స్టయిలిస్ట్!రాహుల్ విజయ్ పుట్టి, పెరిగింది ఢిల్లీలో. ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఎందరో గ్రాడ్యుయేట్స్లాగే అతనూ హార్పర్స్ బజార్లో ఫ్యాషన్ ఇంటర్న్‌గా చేరాడు. అయితే ఆరేళ్లలో ఫ్యాషన్ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. ఫ్యాషన్ రంగంలో ఎదగడానికి ఢిల్లీ కన్నా ఆర్థిక రాజధాని, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ముంబై అయితే బెస్ట్ అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా ముంబైలో ల్యాండ్ అయ్యాడు.హార్పర్స్ బజార్ ఎక్స్‌పీరియెన్స్‌తో వెంటనే అతనికి అక్కడ ‘ఎల్’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కొలువు దొరికింది. ముగ్గురు స్టయిలిస్ట్లున్న టీమ్‌ని లీడ్ చేశాడు. అతనిలోని క్రియేటివిటీ, పనిపట్ల అతనికున్న కమిట్మెంట్.. రెండేళ్లకే ‘జీక్యూ ఇండియా’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కుర్చీలో కూర్చోబెట్టాయి.. స్టయిలింగ్ కవర్స్, ఫ్యాషన్ ఎడిటోరియల్స్ బాధ్యతలతో. దీంతోపాటు ఈ దేశపు ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ షో ‘లాక్మే ఫ్యాషన్ వీక్’కి డైరెక్టర్‌గానూ ఉన్నాడు రాహుల్ .. ముగ్గురు క్రియేటివ్ డైరెక్టర్స్‌లో ఒకడిగా!ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. సెలబ్రిటీ స్టయిలింగ్లోకీ అడుగుపెట్టాడు రాహుల్.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టికి పర్సనల్ స్టయిలిస్ట్‌గా! పర్సనల్ స్టయిలింగ్‌లో.. ముందుగా క్లయింట్ నేపథ్యం, పర్సనాలిటీ, అభిరుచులు, పాత ఫొటోలు.. వంటివన్నీ స్టడీచేసి ఒక అవగాహన కుదిరాకే స్టయిలింగ్ పట్ల దృష్టిపెడ్తాడు రాహుల్. తను చేసిన ఆ రీసెర్చ్ ప్రకారమే క్లయింట్ డ్రెస్ డిజైనింగ్‌ని డిసైడ్ చేస్తాడు.ఎందుకంత డీటేయిలింగ్ అంటే ‘మన స్టయిల్ని రిఫ్లెక్ట్ చేసేది మన లైఫ్‌స్టయిలే కాబట్టి’అంటాడు. అయితే అతని డిజైనర్స్ లిస్ట్‌లో బ్రాండ్ ఇమేజ్ ఉన్న డిజైనర్సే కాదు అసలు బయటి ప్రపంచానికి తెలియని డిజైనర్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువగా కొత్త కొత్త దేశీ డిజైనర్స్నే తన క్లయింట్‌కి ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. ఆ తీరే సెలబ్రిటీ స్టయిలింగ్‌లో అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.అతని స్టయిల్ క్లాసిక్‌గా ఉంటుందనే కాంప్లిమెంట్నీ ఇస్తోంది. అందుకే మృణాల్ ఠాకుర్, అర్జున్ కపూర్, రాజ్‌కుమార్ రావు, క్రికెటర్ కేఎల్ రాహుల్ లాంటి సెలబ్రిటీలూ రాహుల్ విజయ్‌ని తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా ఎంచుకున్నారు. జగమెరిగిన డిజైనింగ్ హౌసెస్ అండ్ బ్రాండ్స్కీ ఫ్రీలాన్స్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా తన సృజనాత్మక సేవలను అందిస్తున్నాడు రాహుల్ విజయ్.ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు సొంత ఈస్తెటిక్ సెన్స్‌ని డెవలప్ చేసుకోవాలి. 12 ఏళ్ల నా ఫ్యాషన్ ఎడిటోరియల్స్ ఎక్స్‌పీరియెన్స్ ఫ్యాషన్‌కి సంబంధించి భిన్న దృక్ఫథాన్ని అందించింది. ట్రెండ్స్‌ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, వాటిలోంచి మనదైన స్టయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి వంటి ఎన్నో విషయాలను నేర్పింది. ఇది నా కెరీర్‌కి ముఖ్యంగా పర్సనల్ స్టయిలింగ్లోకి వచ్చాక ఎంతో ఉపయోగపడింది. స్టయిలింగ్ అనేది ఇప్పుడు ఇమేజ్ మేకింగ్‌లా మారింది. అందుకే స్టయిలిస్ట్‌ల పాత్ర రోజురోజుకీ పెరుగుతోంది! – రాహుల్ విజయ్ -
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
టైటిల్: విద్య వాసుల అహంనటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి తదితరులునిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి దర్శకత్వం: మణికాంత్ గెల్లిసంగీతం: కళ్యాణి మాలిక్ఎడిటర్ : అఖిల్ వల్లూరిఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: ఆహా(మే 17 నుంచి)ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం(మే 17) రిలీజ్ అయిన సినిమానే ‘విద్య వాసుల అహం’. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. దానికి తోడు థియేటర్ సినిమా మాదిరి ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘విద్య వాసుల అహం’ కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాసు(రాహుల్ విజయ్) ఓ సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్‌గా పని చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా..అతను మాత్రం ఇంట్రెస్ట్ చూపించడు. మరోవైపు విద్య(శివాని) కూడా అంతే. పెరెంట్స్ పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా.. ఆమె దృష్టి మాత్రం ఉద్యోగం మీదనే ఉంటుంది. ఓ గుడిలో విన్న ప్రవచనాలతో అటు రాహుల్‌కి, ఇటు విద్యకి పెళ్లిపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరి పేరెంట్స్ ఆ పనిలోనే ఉంటారు. అలా ఓ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఇద్దరికి సంబంధం కుదురుతుంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఉన్న ఈగోల కారణంగా మొదటి రాత్రే గొడవలు మొదలవుతాయి. మరి ఆ గొడవలు ఎక్కడికి దారి తీశాయి? ఇద్దరికి ఉన్న ఆహం ఎలాంటి విబేధాలను తెచ్చిపెట్టింది? ఏ విషయంలో విరిద్దరి మధ్య గొడవలు జరిగాయి? గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరిలో ఎవరు తగ్గారు? ఉద్యోగం కోల్పోయిన వాసుకి విద్య సపోర్ట్‌గా నిలిచిందా లేదా? విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పెళ్లి సబ్జెక్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా కాస్త ఎంటర్టైనింగ్గా తీస్తే చాలు టాలీవుడ్ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. దర్శకుడు మణికాంత్ ఆ పనే చేశాడు. ఎంచుకున్న కథ రొటీనే అయినా.. చాలా ఎంటర్టైనింగ్ కథనాన్ని మలిచాడు. కథంతా క్యూట్‌గా సాగిపోతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ‘పరస్పరం గౌరవం వివాహానికి పునాది’ అనే సందేశాన్ని చాలా వినోదభరితంగా ఇచ్చాడు. అహంతో కూడిన ప్రేమకథలోని భావోద్వేగాలను తెరపై చక్కగా పండించాడు.పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కథనం సాగుతుంది. ఫస్టాప్‌లో కొత్తగా పెళ్లైన జంట ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాల్లో ఈగోలకి వెళ్లి ఎలా గొడవ పడతారు? అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక సెకండాఫ్‌లో పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలు.. ఇగోల కారణంగా వచ్చే ఇబ్బందలను చూపించారు. భార్యభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వివాహం బంధం బలంగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన ప్రతి జంట..ఈ సినిమాకు కనెక్ట్ అవుతుంది. అయితే కథలో మాత్రం కొత్తదనం ఉండదు. కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఓటీటీ సినిమానే కదా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలను సింపుల్‌గా చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీప్‌ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేదేమో. డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయడం సినిమాకు ప్లస్ పాయింట్. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఎంటర్టైన్ కావడానికి వీకెండ్లో ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ జనరేషన్ భార్య భర్తలుగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.ఈగోస్‌తో ఇద్దరి మధ్య జరిగే గొడవలు నవ్వులు పూయిస్తాయి. శివానీ శారీలోనే కనిపిస్తూనే కావాల్సిన చోట అందాలను ప్రదర్శించింది. ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా రాహుల్ విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్, లక్ష్మీ దేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.కల్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
క్యూట్ ఈగోస్ ఉండే ఫన్ ఫిలిం ‘విద్య వాసుల అహం’.
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. మహేష్ దత్తా, లక్ష్మి నవ్య నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. బుధవారం ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకలో మణికాంత్ గెల్లి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘విద్య వాసుల అహం’ రూపొందింది. వెంకీ అద్భుతమైన కథ రాయడం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను’’ అన్నారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక చిన్న క్యూట్ ఈగోస్ (అహం) ఉండే ఫన్ ఫిలిం’’ అన్నారు. ‘‘రాహుల్ మంచి రైటర్ కూడా. ఈ స్క్రిప్ట్‌ని తను ఒప్పుకున్నాడంటే కథ బాగుంటుందని అనిపించి నేను కూడా ఓకే చేశాను’’ అన్నారు శివానీ రాజశేఖర్. -
'కోటబొమ్మాళి పీఎస్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రాజకీయాలతో సంబంధం లేదు
‘‘ప్రస్తుత రాజకీయాలకు, ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా కథకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ మూవీలో ఎన్నికల గురించి, ఓటు విలువ గురించి చర్చించాం. వ్యవస్థ, మనం ఎలా అవినీతిమయమై ఉన్నాం అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ మూవీకి ఏ పొలిటికల్ ఎజెండా లేదు’’ అని డైరెక్టర్ తేజా మార్ని అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తేజా మార్ని మాట్లాడుతూ– ‘‘వ్యవస్థలో ఉన్న వాళ్లు అదే వ్యవస్థకు బలైతే ఎలా ఉంటుంది? అనే కథని జనాలకు చెప్పాలనిపించింది. కోటబొమ్మాళి అనే ఊరిలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్ అధికారుల జీవితాలను ఎలా మార్చింది? అనేది ఈ చిత్ర కథ. మలయాళ హిట్ ‘నాయట్టు’ కి ఇది తెలుగు రీమేక్ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశాం. శ్రీకాంత్, వరలక్ష్మిగార్ల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. రాహుల్, శివాని చక్కగా నటించారు. నిర్మాతలు వాసు, విద్యగార్లు ఎక్కడా రాజీపడలేదు. ‘లింగిడి లింగిడి..’ పాట వల్లే మా సినిమా గురించి అందరికీ తెలిసింది’’ అన్నారు. -
నటుడికి సంతృప్తి అనేది ఉండదు
‘‘ఈ మధ్య కాలంలో నేను పూర్తి స్థాయి పాత్ర చేసిన చిత్రం ‘కోట బొమ్మాళి’. నటనకి చాలా స్కోప్ ఉన్న పాత్ర. అంతకు ముందు నేను చేసిన సినిమాల్లో పాటలు, ఫైట్స్.. ఇలా వాణిజ్య అంశాలు ఉన్నాయి. ‘కోట బొమ్మాళి’లో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలు. ► ‘కోట బొమ్మాళి’ వైవిధ్యమైన కథ. ఎక్కడైనా క్రిమినల్స్‌ని ΄ోలీసులు వెంటాడి పట్టుకుంటారు. ఈ సినిమాలో ΄ోలీసులే ΄ోలీసులను వెంటాడటం ఆసక్తిగా ఉంటుంది. రాజకీయ నాయకులు ΄ోలీసులను ఎలా వాడుకుంటారు? దాని వల్ల ΄ోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? తమ ఓట్ల కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ సెటైర్ ఉండదు. అయితే ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్నది చూపించాడు దర్శకుడు తేజ. ►ఓ మధ్య తరగతి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఈ మూవీలో ఆసక్తిగా ఉంటుంది. నేను హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్ర చేశాను. నా పాత్ర, రాహుల్, శివాని.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. మా పై అధికారి వరలక్ష్మి మమ్మల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తులకు నేను వేసే పై ఎత్తులు ఆసక్తిగా ఉంటాయి. ►దాదాపు 32 ఏళ్ల కెరీర్లో ఎన్నో పాత్రలు చేశాను. ఎన్ని చేసినా ఓ నటుడికి సంతృప్తి ఉండదు.. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఆరాటం ఉంటుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్‌తో ‘దేవర’, మోహన్‌లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న ‘వృషభ’ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నాను. -
ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది..నన్ను రీప్లేస్ చేస్తారేమో అనుకున్నా
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కానిస్టేబుల్ రవి పాత్రలో నటించాను. ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్‌గారు, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్ నటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోట బొమ్మాళి అనే ఊర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్. మలయాళ చిత్రం ‘నాయట్టు’కు ‘కోట బొమ్మాళి పీఎస్’ రీమేక్. అయితే నా పాత్రపై ఏ ప్రభావం ఉండకూడదని ‘నాయట్టు’ పూర్తి చిత్రం నేను చూడలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ‘లింగిడి..’ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతోనే మరింత మందికి మేం చేరువ అయ్యాం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మా నాన్నగారు (ఫైట్ మాస్టర్ విజయ్) అసిస్టెంట్ ఫైట్ మాస్టర్‌గా, ఫైట్ మాస్టర్‌గా చేశారు. అదే బ్యానర్లో నేను హీరోగా చేయడం పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా సమయంలో నాకు ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది. దీంతో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో నన్ను రీప్లేస్ చేస్తారేమో? అనుకున్నాను. కానీ ‘బన్నీ’ వాసు, విద్యాగార్లు నన్ను సపోర్ట్ చేశారు. ఇలాంటి సంస్థలో వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆర్కా మీడియాలో ఓ షో కమిట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు. -
తొలిసారి అలాంటి సీన్ చేశా!
‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్‌గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. ∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్‌గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ. పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్‌లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను. -
లింగి లింగిడి..!
శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతోంది. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగిడి..’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేయగా, 30 మిలియన్ వ్యూస్‌ను పూర్తి చేసుకుంది. ‘‘ఈ పాటలానే మా చిత్రానికి ప్రేక్షకులు విజయం అందిస్తారనే నమ్మకం ఉంది’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన సెలబ్రేషన్స్‌లో ‘బన్నీ’ వాసు అన్నారు. -
బొమ్మాళి డేట్ ఫిక్స్
శ్రీకాంత్ మేకా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటించారు. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది. ‘‘ఓ పోలీస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పవర్ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్‌గా ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే ‘లింగి లింగిడి..’ పాట కొన్ని కోట్ల వ్యూస్ సాధించింది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, సహనిర్మాతలు: భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ ్రపొడ్యూసర్: అజయ్ గద్దె. -
తెలుగోడి జానపదం దమ్ము చూపించింది
‘‘ఒక పాట హిట్ అయితే సక్సెస్ మీట్ చేయడం మాకు తెలిసి ఇదే తొలిసారి. మా ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి...’ పాట తెలుగోడి జానపదం దమ్ము చూపించింది. ఈ పాటకి పి. రఘు సాహిత్యం అందించడంతో పాటు పాడారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ మేక, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకి అద్భుతమైన స్పందన వస్తోందంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాననే అనుభూతి ఉంది’’ అన్నారు. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే పాట వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో సినిమా కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘నా సినిమాలో జానపదం పాట పెట్టాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు తేజ మార్ని. -
పోలీసులే నిందితులైతే...
సాధారణంగా హత్యలకు కారణమైన దోషులకు శిక్ష పడేలా బాధ్యతగా విధులు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. అయితే ఓ హత్య కేసులో పోలీసులే నిందుతులు అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసు కుంటాయి? అన్న కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. తేజా మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ఇది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్య నిర్మిస్తున్నారు. బుధవారం (జూన్ 7) రాహుల్ విజయ్ బర్త్ డే ఈ సందర్భంగా ఈ సినిమాలో ఎస్. రవి పాత్రను రాహుల్ విజయ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, పోస్టర్ రిలీజ్ చేశారు. శివానీ రాజశేఖర్, పవన్ తేజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: మిధున్ ముకుందన్. -
మిస్ రెబల్
మేఘా ఆకాష్, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాటే మంత్రము’. అభిమన్యు బద్ది ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిందు ఆకాష్ (మేఘా ఆకాష్ తల్లి) సమర్పణలో ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సుశాంత్ రెడ్డి కథ అందించారు. అక్టోబరు 26 మేఘా బర్త్ డే సందర్భంగా ‘మాటే మంత్రము’లోని ఆమె క్యారెక్టర్ నేమ్, లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కావ్య అనే రెబల్ అమ్మాయిగా నటించారు మేఘా ఆకాష్. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: మనోజ్ రెడ్డి. చిత్రయూనిట్ పేర్కొంది. -
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'నేనెవరు' ఆడియో రిలీజ్
ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'నేనెవరు'. ఈ సినిమాలో అతనికి జోడిగా సాక్షి చౌదరి నటిస్తోంది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్జీ సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, ప్రోమోను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసింది చిత్రబృందం. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం) ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, మరో నటుడు రాహుల్ విజయ్ ముఖ్యఅతిథులుగా హాజరై ఆడియోను రిలీజ్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం మంచిపేరు తీసుకురావాలని ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలో తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేడుకల్లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. -
పెద్ద బ్యానర్లో శివానీ రాజశేఖర్ సినిమా!
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ సినిమాతో మరో మారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థ. తాజాగా ఈ బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమైంది. జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానంలో గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి బన్నీ వాసుతో పాటు విద్య మాధురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్రతాప్ సహ నిర్మాత, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. Some journeys are worth waiting for… this one is going to be special :)#AlluAravind garu Presents @GA2Official's #ProductionNo8 launched today with a pooja ceremony.✨Produced by #BunnyVas & #VidhyaMadhuri Directed by #TejaMarni @actorsrikanth @varusarath5 #Shivani pic.twitter.com/u76XITcrnY— Rahul Vijay (@ActorRahulVijay) June 30, 2022 చదవండి: అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి అలాంటి సినిమాలను ప్రేక్షకులు వదులుకోరు: రాజమౌళి -
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్‌ల మూవీ టైటిల్ ఖారారు
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్న సినిమాకి ‘మాటే మంత్రము’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. కాగా రాహుల్ విజయ్ బర్త్ డే (జూన్ 7) సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ– ‘‘గోవా నేపథ్యంలో జరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. సుశాంత్ రెడ్డి అందించిన కథ ఆసక్తిగా ఉంటుంది. మా సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: మనోజ్ రెడ్డి. -
‘మాటే మంత్రము’ అంటున్న మేఘ ఆకాష్
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. రాహుల్ విజయ్ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఈ చిత్రం టైటిల్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘మాటే మంత్రము’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ...మా హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నాం. ఈ చిత్రానికి "మాటే మంత్రము" అనే పేరును ఖరారు చేశాం. ఇది మా సినిమాకు యాప్ట్ టైటిల్. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ గోవాలో చిత్రీకరించాం. ప్రస్తుతం 90 శాతం షూటింగ్ పూర్తయింది. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నారు. -
రాహుల్‌తో జోడీ కడుతున్న మేఘా ఆకాశ్
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయవుతున్నారు. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. అభిమన్యు మాట్లాడుతూ– ‘‘గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందేలా తెరకెక్కించబోతున్నాం’’ అన్నారు. ‘‘డియర్ మేఘ’ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పని చేశాను. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మేఘా ఆకాష్. ‘‘కూల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 10 రోజులు షూటింగ్ చేస్తాం. 25 రోజుల్లోనే షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట. ‘వెన్నెల’ కిషోర్, అర్జున్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర. చదవండి: అజయ్ జడేజా బ్రేకప్ స్టోరీ: మ్యాచ్ ఫిక్సింగ్.. మాధురీ దీక్షిత్‌ని దూరం చేసిందా! -
అమలాపాల్ తో స్పెషల్ చిట్ చాట్
-
Kudi Yedamaithe: కలలో ఏం జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరిగితే!
అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’. ‘లూసియా’ ‘యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. జూలై 16న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది కల అంటే నేనే నమ్మలేకపొతున్నాను. కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈరోజు రిపీట్ అవుతోందని నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అంటూ అమలాపాల్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా అనిపించింది. ఓ యాక్సిడెంట్ లో చనిపోయిన అమ్మాయికి, వీళ్లిద్దరికీ సంబంధం ఏమిటి ? వాళ్ళు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు ? అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ ట్రైలర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కుమార్ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ సిరీస్ ని నిర్మించాయి. -
పంచేంద్రియాల నేపథ్యంలో...
డా. బ్రహ్మానందం, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ముఖ్య తారలుగా ఓ చిత్రం రూపొందనుంది. హర్ష పులిపాక దర్శకుడు. టికెట్ ఫ్యాక్టరీ–ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సృజన్ ఎరబోలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మరో ముగ్గురు స్టార్లు కూడా నటించనున్నారు. 13 రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ఆ తర్వాత విశాఖ, పాండిచ్చేరిలో షెడ్యూల్స్ ప్లాన్ చేశాం. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ మా చిత్రానికి మాటలు రాయడం హ్యాపీ’’ అన్నారు. హర్ష పులిపాక మాట్లాడుతూ– ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు (చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన) చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. యువతరం ఆలోచనలకు అద్దం పట్టేలా కథ, కథనాలు నిజాయతీగా ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: రాజ్ కె. నల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఉషారెడ్డి వవ్వేటి, రఘురామ్ శ్రీపాద. -
బర్త్‌డే లుక్
‘ఈ మాయ పేరేమిటో’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో హీరోగా నటించిన రాహుల్ విజయ్ తాజాగా మరో సినిమా అంగీకరించారు. ఎస్కెఎల్ఎస్ గేలాక్సీ మాల్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై బృందా రవీందర్ దర్శకత్వంలో ఇ.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం (జూన్ 7) రాహుల్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని అతని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: అనంత్ శ్రీరామ్, కెమెరా: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, స్టంట్స్: విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివ ప్రసాద్. -
అందరికీ కనెక్ట్ అవుతుంది
‘‘కన్నడలో ఘన విజయం సాధించిన ‘కాలేజ్ కుమార్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాం. తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలు ఈ సినిమాలో మెయిన్ హైలైట్. ప్రస్తుతం విద్యావిధానం ఎలా ఉంది? మన చదువుకు తగ్గట్లు ఉద్యోగం చేస్తున్నామా?.. వంటి విషయాల్ని ఈ సినిమాలో చర్చించాం’’ అన్నారు రాహుల్ విజయ్. కన్నడ ‘కాలేజ్ కుమార్’ చిత్రదర్శకుడు హరి సంతోష్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటించారు. లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ డ్రామా, ఎమోష¯Œ ్స ఉన్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. నేను ప్రతి సినిమా నుండి కొంత నేర్చుకుంటూ వస్తున్నాను. ఒక నటుడిగా నా వంతు పూర్తి కృషి చేస్తాను.. ఫలితం అనేది మన చేతిలో ఉండదు. కన్నడ ప్రేక్షకులు ఆదరించిన ట్టు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇందులో రాజేంద్రప్రసాద్, మధుబాల, నాజర్గార్లతో పని చేయడం సంతోషంగా అనిపించింది.. వారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రసుతం ‘బ్లాక్ అండ్ వైట్‘ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
రాహుల్ పెద్ద హీరో కావాలి
‘‘కాలేజ్ కుమార్’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ కథలో అన్ని భావోద్వేగాలు ఉన్నాయనిపిస్తోంది. దర్శకుడు హరికి ఈ సినిమా తెలుగులో మంచి బ్రేక్ అవ్వాలి’’ అన్నారు గోపీచంద్. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్ర ప్రసాద్, మధుబాల ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలేజ్ కుమార్’. ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ హరి సంతోష్ తెలుగుకి పరిచయమవుతున్నారు. లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ సినిమా ఈ 6న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్‌గారు సెట్స్‌లో ఉంటే యాక్టింగ్ డిక్షనరీ ఉన్నట్లే. మాలాంటి హీరోలకు యాక్షన్ ఇమేజ్ వచ్చిందంటే కారణం ఫైట్ మాస్టర్స్ విజయ్, రామ్–లక్ష్మణ్‌లే. విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ పెద్ద హీరో కావాలి’’ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఏ నటుడైనా నటిస్తున్నంత కాలం సంతోషంగా ఉంటాడు. ఇన్నేళ్లు వినోదం అందించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషిస్తున్నా’’ అన్నారు మధుబాల. ‘‘కాలేజ్ కుమార్’ వంటి మంచి సినిమాని తెలుగు, తమిళ్లో చేసే చాన్స్ ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్’’ అన్నారు హరి సంతోష్. ‘‘చదవడం గొప్పా? చదివించడం గొప్పా? అనే విషయంలో తండ్రీకొడుకు మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు బాగా తెరకెక్కించారు’’ అన్నారు రాహుల్. ప్రియ వడ్లమాని, ఫైట్ మాస్టర్స్ రామ్– లక్ష్మణ్, దర్శకుడు మలినేని గోపీచంద్ తదితరులు మాట్లాడారు.