
అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’. ‘లూసియా’ ‘యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. జూలై 16న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇది కల అంటే నేనే నమ్మలేకపొతున్నాను. కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈరోజు రిపీట్ అవుతోందని నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అంటూ అమలాపాల్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా అనిపించింది. ఓ యాక్సిడెంట్ లో చనిపోయిన అమ్మాయికి, వీళ్లిద్దరికీ సంబంధం ఏమిటి ? వాళ్ళు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు ? అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ ట్రైలర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కుమార్ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ సిరీస్ ని నిర్మించాయి.
Comments
Please login to add a commentAdd a comment