‘‘ఈ మధ్య కాలంలో నేను పూర్తి స్థాయి పాత్ర చేసిన చిత్రం ‘కోట బొమ్మాళి’. నటనకి చాలా స్కోప్ ఉన్న పాత్ర. అంతకు ముందు నేను చేసిన సినిమాల్లో పాటలు, ఫైట్స్.. ఇలా వాణిజ్య అంశాలు ఉన్నాయి. ‘కోట బొమ్మాళి’లో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలు.
► ‘కోట బొమ్మాళి’ వైవిధ్యమైన కథ. ఎక్కడైనా క్రిమినల్స్‌ని ΄ోలీసులు వెంటాడి పట్టుకుంటారు. ఈ సినిమాలో ΄ోలీసులే ΄ోలీసులను వెంటాడటం ఆసక్తిగా ఉంటుంది. రాజకీయ నాయకులు ΄ోలీసులను ఎలా వాడుకుంటారు? దాని వల్ల ΄ోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? తమ ఓట్ల కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ సెటైర్ ఉండదు. అయితే ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్నది చూపించాడు దర్శకుడు తేజ.
►ఓ మధ్య తరగతి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఈ మూవీలో ఆసక్తిగా
ఉంటుంది. నేను హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్ర చేశాను. నా పాత్ర, రాహుల్, శివాని.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. మా పై అధికారి వరలక్ష్మి మమ్మల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తులకు నేను వేసే పై ఎత్తులు ఆసక్తిగా ఉంటాయి.
►దాదాపు 32 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో పాత్రలు చేశాను. ఎన్ని చేసినా ఓ నటుడికి సంతృప్తి ఉండదు.. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఆరాటం ఉంటుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్‌తో ‘దేవర’, మోహన్‌లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న ‘వృషభ’ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment