
ఎవరీ రాహుల్ విజయ్? అంటే... ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ ఉన్నారు కదా.. ఆయన కుమారుడు. కావ్యా థాపర్ అతని లవర్! రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. రాహుల్ విజయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ, రాము కొప్పుల దర్శకత్వంలో వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ పతాకంపై దివ్యా విజయ్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ముంబయ్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ పలు కమర్షియల్ యాడ్స్ చేశారు. రాహుల్‌తో పాటు ఆమెకూ ఇదే తొలి సినిమా! ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.