రాము కొప్పుల, విజయ్, దివ్యా విజయ్
రాహుల్ విజయ్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. రాము కొప్పుల దర్శకుడు. దివ్యా విజయ్ నిర్మాత. శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలోని ఓ పాటలో రెండు, మూడు లైన్లు జైన్ మతస్థులు ఆరాధించే మంత్రాన్ని కించపరిచేవిగా ఉన్నాయని పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. దివ్యా విజయ్ మాట్లాడుతూ– ‘‘మా చిత్రానికి పాజిటివ్ టాక్ వినపడుతోంది. అయితే ముంబై నుండి ‘ఓ సాంగ్ వల్ల జైన్స్ బాధపడ్డారు’ అని ఫోన్ వచ్చింది.
‘కంటెంట్ చూపిస్తాను. ఒకవేళ అభ్యంతరకరంగా అనిపిస్తే చెప్పండి, తీసేస్తాం’ అన్నాను. ఫోన్ చేసిన వ్యక్తి అర్థం చేసుకున్నారు. మరో గంట తర్వాత ఇండియాలోని పలు ప్రాంతాల నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎవరినీ కించపరచాలనేది మా ఉద్దేశం కాదు. సాంగ్ అర్థం తెలియక సినిమాలో పెట్టాం అని చెప్పం కానీ, అది ఎవరినీ బాధించదు అనే ఆలోచనతోనే పెట్టాం. ఆ సాంగ్ రెండు నెలలుగా యూట్యూబ్‌లో పెట్టాం. ఇలాంటి అభ్యంతరాలుంటే అప్పుడే సాల్వ్ చేసుకుని ఉండేవాళ్లం.
నేను ఆ సాంగ్‌లోని పదాన్ని తీసేస్తానని చెప్పిన తర్వాత కూడా నెల్లూరు, కాకినాడ, గుంటూరు, రాజమండ్రి ఏరియాల్లో షోలను ఆపేశారు. దాంతో సమస్యను పరిష్కరిస్తామని మీడియాకు బైట్స్ ఇచ్చాం. సాంగ్‌లోని లైన్స్‌ను క్యూబ్‌లో మ్యూట్ చేశాం. ఈ రోజు నుండి అన్నిచోట్ల అప్‌డేట్ అవుతుంది’’ అన్నారు. రాము కొప్పుల మాట్లాడుతూ– ‘‘హీరోయిన్‌ది జైన్ అమ్మాయి పాత్ర. ఆ పాత్రను ఎలివేట్ చేసే ప్రయత్నంలో భాగంగా రాసిన లైన్స్ అవి. అంతే తప్ప ఎవరినీ హర్ట్ చేసే ఆలోచన లేదు’’ అన్నారు.
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాపై విమర్శలు రావటం బాధగా అనిపించింది. 33ఏళ్లు ఇండస్ట్రీలో ఉంyì ఇన్నేళ్లు కష్టపడి నా సినిమాలో ఇలాంటి మిస్టేక్ వచ్చిందా అని బాధ పడుతున్నాను. ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరిగింది. మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ సందర్భంగా జైన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ– ‘‘లివ్ అండ్ లెట్ లివ్...అనేదే జైన్ సమాజ పాలసీ. జై¯Œ సమాజ్‌కు చెందిన ‘నమోకార్’ మహామంత్రం.. గాయత్రి మంత్రం వంటి పవర్ ఫుల్ మంత్రం. అందుకే ఆ సాంగ్‌లోని మంత్రానికి సంబంధించిన లైన్స్‌ను తొలగించమని కోరాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment