ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'నేనెవరు'. ఈ సినిమాలో అతనికి జోడిగా సాక్షి చౌదరి నటిస్తోంది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలుగా వ్యవహరిస‍్తున్నారు. ఈ చిత్రానికి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌జీ సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, ప్రోమోను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసింది చిత్రబృందం. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
(చదవండి: పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం)
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, మరో నటుడు రాహుల్ విజయ్ ముఖ్యఅతిథులుగా హాజరై ఆడియోను రిలీజ్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం మంచిపేరు తీసుకురావాలని ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలో తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేడుకల్లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment