AUdioreleased
-
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'నేనెవరు' ఆడియో రిలీజ్
ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'నేనెవరు'. ఈ సినిమాలో అతనికి జోడిగా సాక్షి చౌదరి నటిస్తోంది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్జీ సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, ప్రోమోను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసింది చిత్రబృందం. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం) ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, మరో నటుడు రాహుల్ విజయ్ ముఖ్యఅతిథులుగా హాజరై ఆడియోను రిలీజ్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం మంచిపేరు తీసుకురావాలని ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలో తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేడుకల్లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. -
అందుకే ఈ ఆడియో!
సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి చవితి నేడు. ఈ సందర్భంగా భక్తులందరూ గణనాథుడి కథను చదివి, వినాయక వ్రత కల్పాన్ని పాటిస్తారు. గంభీరమైన స్వరం ఉన్న నటుడు మంచు మోహన్‌బాబు వినాయక చవితి పూజను తన గళంతో వినిపించారు. దాన్ని ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘నేనిష్టపడే పండగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం నా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితుల్ని మా ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలు చదివి, కథను వినిపించడం నాకు అలవాటు. నా పెద్ద కుమారుడు విష్ణువర్థన్ బాబు ఈ వినాయక కథను అందరికీ వినిపించవలసిందిగా కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుడి కథను వినిపిస్తున్నాను’’ అన్నారు మోహన్ బాబు. వినాయకుని జననం, విఘ్నాలకు అధిపతి ఎవరు? చంద్రునికి పార్వతీదేవి శాపం, శమంతకోపాఖ్యానం: ద్వాపరయుగం, భాద్రపద శుద్ధ చవితి మహత్యం, వినాయక వ్రతకల్పం వంటివి చెబుతూ ఈ ఆడియోను విడుదల చేశారు. -
ఏం జరుగుతుంది
‘నా పేరు మీనాక్షి’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుసూదన్ హీరోగా నటించిన చిత్రం ‘డబ్లూ డబ్లూ డబ్లూ. మీనా బజార్’. రానా సునీల్ కుమార్ సింగ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కద్రి మణికాంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘సినిమా తీయడం కష్టమైన పని. చిన్న సినిమాలను ఆదరించాలి’’ అన్నారు డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. క్లైమ్యాక్స్ చూసేవరకు సినిమాను ఊహించలేరు’’ అన్నారు మధుసూదన్. రానా సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి మనిషిలో అహం ఉంటుంది. అహం ఉన్న ఐదు పాత్రలు కలిస్తే ఏమవుతుంది? అనేదే ఈ సినిమా. తర్వాత ఏం జరుగుతుంది? అనేది ప్రేక్షకులు ఊహించలేరు’’ అన్నారు. నటి హేమ, నవీన్ యాదవ్ మాట్లాడారు. వైభవీ జోషి, శ్రీజిత ఘోష్, రానా సునీల్ కుమార్ సింగ్, నటించిన ఈ చిత్రానికి కెమెరా: మ్యాథీవ్. -
యాక్షన్.. కామెడీ
సాగర్ శైలేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ 143’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ సినిమాలోని ఓ పాటను జేడీ చక్రవర్తి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కథ, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ చేసి హీరోగా శైలేష్ నటించాడని విని ఆశ్చర్యపోయా. ‘రహస్యం’లో తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ బావున్నాయి. ఇందులో డీఎస్ రావు మంచి పాత్ర చేశారు’’ అన్నారు. ‘‘శివ 143’ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నాం. సెన్సార్ పూర్తి కాకపోవడంతో ఆగాం. యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు రామసత్యనారాయణ. ‘‘జేడీ చక్రవర్తిగారు నా సినిమాను గుర్తుపెట్టుకొని, అభినందించడం హ్యాపీ’’ అన్నారు సాగర్ శైలేష్. -
అయ్యప్ప ఆశీస్సులతో...
సుమన్ హీరోగా నటించిన నూరవ చిత్రం ‘వీరశాస్త్ర అయ్యప్పకటాక్షం’. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో 100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ సంయుక్తంగా నిర్మించిన భక్తిరసాత్మక చిత్రం ఇది. రచయిత వి.ఎస్.పి. తెన్నేటి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు అందించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు. వి.ఎస్.ఎల్. జయకుమార్ సంగీతదర్శకుడు. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. సి.కల్యాణ్, లగడపాటి శ్రీధర్, రాజ్ కందుకూరి అతిథులుగా విచ్చేశారు. ‘‘అయ్యప్ప ఆశీస్సులతోనే ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఈ చిత్రంలోని పాటలను ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో తదితరులు పాడారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు రుద్రాభట్ల వేణుగోపాల్, వి.ఎస్.పి. తెన్నేటి, టి.ఎస్. బద్రీష్ రామ్ అన్నారు. -
‘వీఐపీ 2’ ఆడియో రిలీజ్