అయ్యప్ప ఆశీస్సులతో... | Veera Sastha Ayyappa Kataksham Audio Released | Sakshi
Sakshi News home page

అయ్యప్ప ఆశీస్సులతో...

Published Sun, Dec 1 2019 6:00 AM | Last Updated on Sun, Dec 1 2019 6:00 AM

Veera Sastha Ayyappa Kataksham Audio Released - Sakshi

సి. కల్యాణ్, సుమన్, వి.ఎస్‌.పి. తెన్నేటి

సుమన్‌ హీరోగా నటించిన నూరవ చిత్రం ‘వీరశాస్త్ర అయ్యప్పకటాక్షం’. రుద్రాభట్ల వేణుగోపాల్‌ దర్శకత్వంలో 100 క్రోర్స్‌ అకాడమీ, వరాంగి మూవీస్‌ సంయుక్తంగా నిర్మించిన భక్తిరసాత్మక చిత్రం ఇది. రచయిత వి.ఎస్‌.పి. తెన్నేటి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు అందించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు. వి.ఎస్‌.ఎల్‌. జయకుమార్‌ సంగీతదర్శకుడు. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం.

సి.కల్యాణ్, లగడపాటి శ్రీధర్, రాజ్‌ కందుకూరి అతిథులుగా విచ్చేశారు. ‘‘అయ్యప్ప ఆశీస్సులతోనే ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఈ చిత్రంలోని పాటలను ప్రముఖ గాయకులు శంకర్‌ మహదేవన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో తదితరులు పాడారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు రుద్రాభట్ల వేణుగోపాల్, వి.ఎస్‌.పి. తెన్నేటి, టి.ఎస్‌. బద్రీష్‌ రామ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement