
‘‘సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ రామానుజం తనయుడు విశ్వకార్తికేయ హీరోగా నటించిన ‘కళాపోషకులు’ సినిమాలో నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యాను. ఈ చిత్రం ట్రైలర్ బాగుంది. సినిమా హిట్ అవుతుంది’’ అని సీనియర్ నటుడు సుమన్ అన్నారు. విశ్వకార్తికేయ, దీపా ఉమావతి జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళాపోషకులు’. యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని సుమన్ విడుదల చేశారు. ‘‘సీనియర్ దర్శకులు పీసీ రెడ్డిగారి వద్ద పని చేశాను. ‘కళాపోషకులు’ లాంటి మంచి సినిమాని బ్రతికించండి’’ అని చలపతి పువ్వల అన్నారు. ‘‘ఇది నా తొలి సినిమా. చలపతి బాగా తీశాడు’’ అన్నారు సుధాకర్ రెడ్డి. ‘‘మా సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని కచ్చితంగా చెప్పగలను’’ అన్నారు విశ్వకార్తికేయ.
Comments
Please login to add a commentAdd a comment