'మాధవే మధుసూదన' అందరినీ మెప్పిస్తుంది: సుమన్‌ | Madhave Madhusudana Release On November 24th | Sakshi
Sakshi News home page

'మాధవే మధుసూదన' అందరినీ మెప్పిస్తుంది: సుమన్‌

Published Sun, Nov 19 2023 6:43 PM | Last Updated on Sun, Nov 19 2023 6:43 PM

Madhave Madhusudana Release On November 24th - Sakshi

టాలీవుడ్‌లో చిన్న సినిమాలు ఒక్కోసారి బ్లాక్‌బస్టర్‌ అవుతుంటాయి. కథ నచ్చితే తెలుగు ఆడియన్స్‌ తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ ఇస్తారు. ఈ కోవలోనే 'మాధవే మధుసూదన' అనే చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే‌ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్‌ 24 విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. బొమ్మదేవర రామచంద్ర రావు ఈ సినిమాకు దర్శకత్వం,నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీని బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా తాజాగా హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో మీడియా సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సుమన్‌ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో యాక్టర్ సుమన్ మాట్లాడుతూ.. 'మాధవే మధుసూదన' సినిమాను దర్శకుడు బొమ్మదేవర రామచంద్ర రావు చాలా క్లారిటీగా రూపొందించారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఎంతోమంది దర్శకులను చూశారు. ప్రతి సీన్ తెరకెక్కించేటప్పుడు బొమ్మదేవర రామచంద్ర రావు అనుభవం నాకు కనిపించింది. కెమెరామెన్ వాసు ప్రతి ఫ్రేమ్‌ను చక్కగా పిక్చరైజ్ చేశారు. ఏ సినిమా బాగా రావాలన్నా అందుకు డైరెక్టర్, స్టోరీ, టెక్నీషియన్స్ కీలకం. ఈ సినిమాకు ఆ టీమ్ బాగా కుదిరింది. ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్లు అయినప్పటికీ బాగా ప్రిపేర్ అయి నటించారు.

ఈ సినిమాతో బొమ్మదేవర రామచంద్రరావు తన కొడుకు తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. అతను మంచి హీరో అవుతాడు. డ్యాన్సులు, ఫైట్స్, ఎమోషన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ బాగా చేస్తున్నాడు. అతనికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హీరో తేజ్ వర్క్ షాప్స్ చేసి తన క్యారెక్టర్ లోని మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా చెప్పాడు. ఫాదర్ డైరెక్ట్ చేస్తున్నాడు అని కాకుండా ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నట్లు ఎన్ని కరెక్షన్స్ చెప్పినా తేజ్ చేశాడు. హీరోయిన్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. రామచంద్రరావు గారు మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్ కు వెళ్లి చూడమని కోరుతున్నా.' అని సుమన్‌ అన్నారు.

దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో నాకు 45 ఏళ్ల అనుభవం ఉంది. టచప్ బాయ్ నుంచి మేకప్ మెన్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. అక్కినేని నాగార్జున గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు అందరు స్టార్ డైరెక్టర్స్‌తో అనుబంధం ఏర్పడింది. వాళ్లు సీన్స్ ఎలా చేస్తున్నారు, ఏ షాట్ ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు అనేది పరిశీలించేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండటం ఇందుకు కారణం. నేను కూడా ఇలా ఏదో ఒకరోజు డైరెక్షన్ చేయాలని కోరుకున్నాను. మంచి కథ సిద్ధం చేసుకుని కొందరు హీరోలను అప్రోచ్ అయ్యాను.

నేనే డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా చేస్తానని చెప్పడంతో వాళ్లలో ఏవైనా సందేహాలు కలిగి ఉండొచ్చు. లేదా రిస్క్ ఎందుకని అనుకోవచ్చు. వాళ్లు సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. అప్పుడు మా అబ్బాయినే హీరోగా పెట్టి సినిమా చేయాలనుకున్నాను. నేను వెళ్లి మా అబ్బాయి తేజ్‌ను అడిగితే ..అతనికి కూడా మనసులో హీరో కావాలని ఉంది. కానీ నేను ఏమంటానో అని చెప్పడం లేదని తెలిసింది. అలా కాలేజ్ పూర్తయ్యాక ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి మా అబ్బాయి తేజ్ హీరోగా ఈ సినిమా స్టార్ట్ చేశాను.' అని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement