మధుసూదన్, శ్రీజిత, రానా సునీల్‌కుమార్
‘నా పేరు మీనాక్షి’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుసూదన్ హీరోగా నటించిన చిత్రం ‘డబ్లూ డబ్లూ డబ్లూ. మీనా బజార్’. రానా సునీల్ కుమార్ సింగ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కద్రి మణికాంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘సినిమా తీయడం కష్టమైన పని. చిన్న సినిమాలను ఆదరించాలి’’ అన్నారు డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. క్లైమ్యాక్స్ చూసేవరకు సినిమాను ఊహించలేరు’’ అన్నారు మధుసూదన్. రానా సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి మనిషిలో అహం ఉంటుంది. అహం ఉన్న ఐదు పాత్రలు కలిస్తే ఏమవుతుంది? అనేదే ఈ సినిమా. తర్వాత ఏం జరుగుతుంది? అనేది ప్రేక్షకులు ఊహించలేరు’’ అన్నారు. నటి హేమ, నవీన్ యాదవ్ మాట్లాడారు. వైభవీ జోషి, శ్రీజిత ఘోష్, రానా సునీల్ కుమార్ సింగ్, నటించిన ఈ చిత్రానికి కెమెరా: మ్యాథీవ్.
Comments
Please login to add a commentAdd a comment