Trinadh Rao Nakkina
-
ఏం జరుగుతుంది
‘నా పేరు మీనాక్షి’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుసూదన్ హీరోగా నటించిన చిత్రం ‘డబ్లూ డబ్లూ డబ్లూ. మీనా బజార్’. రానా సునీల్ కుమార్ సింగ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కద్రి మణికాంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘సినిమా తీయడం కష్టమైన పని. చిన్న సినిమాలను ఆదరించాలి’’ అన్నారు డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. క్లైమ్యాక్స్ చూసేవరకు సినిమాను ఊహించలేరు’’ అన్నారు మధుసూదన్. రానా సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి మనిషిలో అహం ఉంటుంది. అహం ఉన్న ఐదు పాత్రలు కలిస్తే ఏమవుతుంది? అనేదే ఈ సినిమా. తర్వాత ఏం జరుగుతుంది? అనేది ప్రేక్షకులు ఊహించలేరు’’ అన్నారు. నటి హేమ, నవీన్ యాదవ్ మాట్లాడారు. వైభవీ జోషి, శ్రీజిత ఘోష్, రానా సునీల్ కుమార్ సింగ్, నటించిన ఈ చిత్రానికి కెమెరా: మ్యాథీవ్. -
ట్రిపుల్ ధమాకా!
గతేడాది ‘గురు’ సినిమా తర్వాత మళ్లీ థియేటర్లో ప్రేక్షకులను పలకరించలేదు వెంకటేశ్. ఈ ఏడాది ఆయన సినిమాలు థియేటర్స్‌లోకి రావన్న విషయంపై క్లారిటీ వచ్చింది. కానీ ఆయన అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది వెంకీ సినిమాలు కనీసం రెండు విడుదల అవుతాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో కలసి ఆయన హీరోగా నటిస్తున్న ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా ఈ నెల 7న విడుదల కానుందని సమాచారం. అలాగే కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి వెంకీ ‘వెంకీమామ’ అనే సినిమాలో నటిస్తారు. ఈ సినిమా డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో.. ఈ రెండు సినిమాలు కచ్చితంగా వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి వస్తాయి. ‘ఎఫ్ 2, వెంకీమామ’ సినిమాలే కాకుండా తాజాగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరోగా నటించడానికి వెంకటేశ్ పచ్చజెండా ఊపారని సమాచారం. త్రినాథరావు ఓ ఆసక్తికరమైన కథ చెప్పడం, వెంకీ విని సరే అనడం జరిగిపోయాయట. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో కానీ లేదా వచ్చే ఏడాది జనవరిలో కానీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. అంటే.. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. సో.. అభిమానులకు వెంకీ ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నారన్న మాట. -
రీ షూట్లో ‘హలోగురూ ప్రేమ కోసమే’
ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తరువాత ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హలో గురూ ప్రేమకోసమే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అయితే నిర్మాత దిల్ రాజు కొన్ని సన్నివేశాల విషయంలో సంతృప్తిగా లేకపోవటంతో వాటిని రీషూట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఇటీవల దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన లవర్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాలు నిరాశపరిచాయి. అందుకే హలో గురూ ప్రేమకోసమే సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దిల్ రాజు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో రామ్‌కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 18న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాజ్ తరుణ్ డైరెక్టర్ తో రామ్ చరణ్
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రకంటించిన చెర్రీ, ఓ చిన్న సినిమాల దర్శకుడితో కలిసి పని చేసేందుకు అంగీకరించాడు. రాజ్ తరుణ్ హీరోగా సినిమా చూపిస్తా మామ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు త్రినాథరావు నక్కిన. తరువాత నాని హీరోగా నేను లోకల్ సినిమాతో మరో హిట్ కొట్టిన త్రినాథరావు, ఇప్పుడు రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడట. రామ్ చరణ్ కొరటాల శివ సినిమా పూర్తయిన తరువాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతానికి చరణ్ నుంచి గానీ, దిల్ రాజు నుంచి గాని ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తుంది.