రాజ్ తరుణ్ డైరెక్టర్ తో రామ్ చరణ్
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రకంటించిన చెర్రీ, ఓ చిన్న సినిమాల దర్శకుడితో కలిసి పని చేసేందుకు అంగీకరించాడు. రాజ్ తరుణ్ హీరోగా సినిమా చూపిస్తా మామ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు త్రినాథరావు నక్కిన.
తరువాత నాని హీరోగా నేను లోకల్ సినిమాతో మరో హిట్ కొట్టిన త్రినాథరావు, ఇప్పుడు రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడట. రామ్ చరణ్ కొరటాల శివ సినిమా పూర్తయిన తరువాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతానికి చరణ్ నుంచి గానీ, దిల్ రాజు నుంచి గాని ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తుంది.