ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తరువాత ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హలో గురూ ప్రేమకోసమే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అయితే నిర్మాత దిల్ రాజు కొన్ని సన్నివేశాల విషయంలో సంతృప్తిగా లేకపోవటంతో వాటిని రీషూట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట.
ఇటీవల దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన లవర్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాలు నిరాశపరిచాయి. అందుకే హలో గురూ ప్రేమకోసమే సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దిల్ రాజు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో రామ్‌కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 18న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment