'హ‌లో గురు ప్రేమ కోస‌మే' మూవీ రివ్యూ | Hello Guru Prema Kosame Telugu Movie Review | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 18 2018 12:23 PM | Last Updated on Thu, Oct 18 2018 2:16 PM

Hello Guru Prema Kosame Telugu Movie Review - Sakshi

టైటిల్ :  హ‌లో గురు ప్రేమ కోస‌మే
జానర్ : రొమాంటిక్ కామెడీ
తారాగణం : రామ్ పోతినేని, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌కాష్ రాజ్‌, సితార‌, జ‌య ప్ర‌కాష్‌
సంగీతం : దేవీ శ్రీ ప్ర‌సాద్‌
దర్శకత్వం : త్రినాధ్ రావు న‌క్కిన‌
నిర్మాత : దిల్ రాజు

యంగ్ హీరో రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హ‌లో గురు ప్రేమ కోసమే’. భారీ హిట్ కోస‌మే ఎదురుచూస్తున్న రామ్ ఈ సినిమా మీద చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. సినిమా చూపిస్త మామ‌, నేను లోక‌ల్ సినిమాలతో స‌క్సెస్ సాధించిన త్రినాథ్ రావు న‌క్కిన ఈ సినిమాతో హ్యాట్రిక్ మీద క‌న్నేశాడు. (సాక్షి రివ్యూస్‌)ఇటీవ‌ల శ్రీనివాస క‌ళ్యాణం సినిమాతో షాక్ తిన్న దిల్ రాజు, ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాల‌ని భావిస్తున్నాడు. మ‌రి హ‌లో గురు ప్రేమ కోస‌మే రామ్‌, త్రినాధ్, దిల్ రాజుల కోరిక తీర్చిందా..?

క‌థ ;
సంజూ(రామ్ పోతినేని) కాకినాడలో అమ్మానాన్నలతో కలిసి సంతోషంగా ఉండే కుర్రాడు. తనకి ఇష్టం లేకపోయినా అమ్మానాన్నల కోసం హైదరాబాద్‌లో జాబ్‌ చేయడానికి బయల్దేరాడు. ట్రైన్‌లో కాకినాడ గురించి తక్కువ చేసి మాట్లాడిందని అను(అనుపమా పరమేశ్వరన్‌)ను టీజ్‌ చేస్తాడు. తర్వాత అను.. తను ఎవరి ఇంట్లో ఉండటానికి వచ్చాడో ఆ విశ్వనాథ్‌‌(ప్రకాశ్‌ రాజ్‌) కూతురు అని తెలిసి సంజూ షాక్‌కు గురవుతాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌లో జాయిన్‌ అయిన సంజూ అక్కడ రీతు(ప్రణీత)ను ఇష్టపడతాడు. అయితే ఓ సంఘటన కారణంగా తన మనసులో ఉన్నది అను అని తెలుసుకుంటాడు. (సాక్షి రివ్యూస్‌) కానీ అదే సమయంలో విశ్వనాథ్‌, అనుకి వేరే సంబంధం చూడటంతో కథ మలుపు తిరుగుతుంది. సంజు ప్రేమను అను అంగీకరించిందా? తన ప్రేమను కాపాడుకోవటానికి సంజూ ఏం చేశాడు? అన్నదే మిగతా కథ.  

న‌టీన‌టులు ;
రామ్ మ‌రోసారి త‌న‌దైర ఎనర్జిటిక్ ప‌ర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. కామెడీతోనూ మెప్పించాడు. లుక్, బాడీ లాంగ్వేజ్‌ విష‌యంలో పెద్ద‌గా కొత్తదనం చూపించ‌క‌పోవ‌టం నిరాశ‌ క‌లిగిస్తుంది. అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు మ‌రోసారి న‌ట‌నకు ఆస్కారం ఉన్న పాత్ర ద‌క్కింది. ప్ర‌ణీత తెర మీద క‌నిపించింది కొద్దిసేపే అయినా ఉన్నంత‌లో త‌న ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకుంది. కీల‌క పాత్ర‌లో న‌టించిన ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో సినిమాను న‌డిపించాడు. (సాక్షి రివ్యూస్‌)దాదాపు హీరోకు స‌మాన‌మైన పాత్ర‌లో కామెడీ, ఎమోష‌న్స్‌ను అద్భుతంగా పండించాడు. జ‌య‌ప్రకాష్, సితార, ఆమని, పోసాని కృష్ణ‌ముర‌ళీ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేష‌ణ ;
సినిమా చూపిస్త మామ‌, నేను లోక‌ల్ లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన మ‌రోసారి సేఫ్ గేమ్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. రామ్ లాంటి ఎన‌ర్జిటిక్ స్టార్ ఉన్నా కామెడీ, ఫ్యామిలీ డ్రామా మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టాడు. ప్ర‌కాష్ రాజ్, రామ్ ల మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. కూతురుని పడేయటానికి తండ్రినే సహాయం అడగటం కాస్త సిల్లీగా అనిపించినా.. కామెడీ బాగానే పండింది. అయితే తొలి అర్థభాగం చాలా సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. ప్రకాశ్‌ రాజ్‌, రామ్‌ల కెమిస్ట్రీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. (సాక్షి రివ్యూస్‌) కామెడీ టైమింగ్‌లోనూ రామ్‌, ప్ర‌కాష్ రాజ్‌లు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డి మ‌రీ న‌టించారు. సినిమాకు ప్ర‌ధాన బ‌లం మాట‌లు, కామెడీతో పాటు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లోనే డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి. దేవీ శ్రీ ప్ర‌సాద్ పాట‌లతో పర్వాలేదనిపించాడు. నేపథ్య సంగీతంతోనూ తన మార్క్‌ చూపించాడు. విజ‌య్ కే చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు క‌ల‌ర్‌ఫుల్ లుక్ తీసుకువ‌చ్చాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. 

ప్ల‌స్ పాయింట్స్ :
కామెడీ 
రామ్‌, ప్రకాశ్‌ రాజ్‌ల కాంబినేషన్‌ సీన్స్‌ 

మైన‌స్ పాయింట్స్ : 
రొటీన్‌ టేకింగ్‌
కొన్ని బోరింగ్‌ సన్నివేశాలు, పాటలు

స‌తీష్ రెడ్డి జ‌డ్డా, ఇంట‌ర్‌నెట్ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement