Madhu sudan
-
ఏం జరుగుతుంది
‘నా పేరు మీనాక్షి’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుసూదన్ హీరోగా నటించిన చిత్రం ‘డబ్లూ డబ్లూ డబ్లూ. మీనా బజార్’. రానా సునీల్ కుమార్ సింగ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కద్రి మణికాంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘సినిమా తీయడం కష్టమైన పని. చిన్న సినిమాలను ఆదరించాలి’’ అన్నారు డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. క్లైమ్యాక్స్ చూసేవరకు సినిమాను ఊహించలేరు’’ అన్నారు మధుసూదన్. రానా సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి మనిషిలో అహం ఉంటుంది. అహం ఉన్న ఐదు పాత్రలు కలిస్తే ఏమవుతుంది? అనేదే ఈ సినిమా. తర్వాత ఏం జరుగుతుంది? అనేది ప్రేక్షకులు ఊహించలేరు’’ అన్నారు. నటి హేమ, నవీన్ యాదవ్ మాట్లాడారు. వైభవీ జోషి, శ్రీజిత ఘోష్, రానా సునీల్ కుమార్ సింగ్, నటించిన ఈ చిత్రానికి కెమెరా: మ్యాథీవ్. -
సంక్షేమంలో అవినీతి సామ్రాట్
నెల్లూరు(అర్బన్): దళిత వర్గాల అభ్యున్నతికి పాటు పడేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ (సోషల్ వెల్ఫేర్) జిల్లాలో అవినీతికి అడ్డాగా మారింది. ఫైళ్ల క్లియరెన్స్ పేరిట భారీగా వసూళ్లు, బ్యాంక్‌ల ఖాతాల్లో నగదు తారుమారు, గురుకుల పాఠశాలల పేరుతో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ చేయడం వంటివి పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన డీడీ మధుసూదన్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి కంపు మరోసారి గుప్పుమంది. జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డీడీగా మధుసూదన్‌రావు 2015 డిసెంబర్లోబాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 81 వరకు సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహ అధికారుల నుంచి ప్రతి నెలా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయనకు ముడుపులు ఇచ్చుకునేందుకు వసతి గృహ అధికారులు విద్యార్థుల మెనూకు కోత వేసి తమ అధికారిని సంతృప్తి పరిచేవారనే ఆరోపణలు లేకపోలేదు. వసూళ్లకు శ్రీకారం ఆ శాఖకు చెందిన బ్యాక్లాగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తున్నారని నమ్మించి పలువురు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాల్లో వసూళ్లు చేశారనే ప్రచారం జరుగుతోంది. నాయుడు పేటలో దళిత వర్గాల కోసం స్ఫూర్తి గురుకుల పాఠశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇక్కడ కళాశాల ప్రారంభించక ముందే ప్రారంభించినట్టు చూపి రూ.కోటి వరకు నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 17 బ్యాంక్‌ల్లో రూ. 86.90 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇందులో ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయానికి రూ.42 లక్షలకే లెక్కలు చూపుతున్నట్టు సమాచారం. డీడీ కార్యాలయ కోటరీపైన ఏసీబీ దృష్టి మధుసూదనరావుకు డిప్యూటీ డైరెక్టర్ కార్యాయలంలో కొందరు ఉద్యోగులు అన్ని తామై చూసుకునే వారు. నెలవారీ మామూళ్లు మొదలుకుని అన్ని అంశాలు వీరే చక్కబెట్టేవారు. గతంలో ఎన్ని బదిలీలు జరిగినా పైరవీలు, కోర్టులకు వెళ్లి మరీ బదిలీలు నిలుపుదల చేయించుకున్నారు. తాజాగా మధుసూదనరావు నివాసంలో ఏసీబీ సోదాల నేపథ్యంలో కొందరు కార్యాలయ సిబ్బందిలో తీవ్ర అలజడి మొదలైంది. ముఖ్యంగా 8 మంది ఉద్యోగులు అన్ని తామై చక్రం తిప్పారని సమాచారంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు వారిపై దృష్టి సారించినట్లు సమాచారం. బదిలీ జరిగినా వారాల తరబడి ఇక్కడే అక్టోబర్ 12వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా మధుసూదన్‌రావు తూర్పుగోదావరి జిల్లాకు డీడీగా బదిలీ అయ్యారు. అయితే ఆయన రెండు వారాలకు పైగా జిల్లా నుంచి రిలీవ్ కాలేదు. తన బదిలీని నిలుపుదల చేయించుకునేందుకు పైస్థాయిలోనే పైరవీలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రిలీవ్ కాకుండానే కార్యాలయానికి వచ్చి ప్రమోషన్ల, ఇన్చార్జీ, బదిలీలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ పేరిట పెద్దఎత్తున అక్రమ వసూళ్లకు తెర లేపారని సమాచారం. అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్ వంటి మహానేతల జయంతులను ప్రభుత్వం రాష్ట్ర పండగలుగా గుర్తించి నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ వారి ఉత్సవాల పేరిట వసతిగృహ అధికారుల నుంచి నిధులు వసూలు చేసి ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని దిగమింగారనే వార్తలు గుప్పుమన్నాయి. భారీగా ఆస్తులు గుర్తింపు ఏసీబీ అధికారులు దాడి చేసి మధుసూదనరావుకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన నివాసంలో బహిరంగ మార్కెట్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. ఒక కిలో బంగారం నగలు, ఒకటిన్నర కిలోల వెండి, రూ.లక్ష వరకు నగదు దొరికింది. ఇవి కాక వివిధ బ్యాంక్ ఖాతాలు.. అందులో ఉన్న నగదు, చెక్కులకు సంబంధించి మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. డీడీ ఉద్యోగ ప్రస్థానాలు దాసరి మధుసూదనరావు నెల్లూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తూ ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. అదే నెల 29వ తేదీన ఆయన నెల్లూరు నుంచి బదిలీ అయ్యారు. ఇంత వరకూ తూర్పుగోదావరి జిల్లాలో బాధ్యతలు స్వీకరించలేదు. గుంటూరు జిల్లాకు చెందిన మధుసూదనరావు 2004 జూలై 20వ తేదీన చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి (సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్)గా విధుల్లో చేరారు. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పని చేశారు. 2010 ఏప్రిల్ 6వ తేదీన డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. డీడీగా వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాలో పని చేసి 2015 డిసెంబర్లో నెల్లూరు సోషల్ వెల్ఫేర్ డీడీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పాటు జిల్లాలో పని చేసి ఇటీవల బదిలీ అయ్యారు. -
శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు..
అశ్రునయనాల మధ్య శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు ⇒ రాయదుర్గం శ్మశానవాటికలో చితికి నిప్పంటించిన తండ్రి ⇒ ట్రంప్ వ్యతిరేక నినాదాలతో మారుమోగిన మహాప్రస్థానం ⇒ శ్రీనివాస్ నివాసానికి భారీగా తరలివచ్చిన బంధువులు, స్నేహితులు ⇒ అంత్యక్రియల్లో పాల్గొన్న దత్తాత్రేయ, చుక్కా రామయ్య తదితరులు హైదరాబాద్: అమెరికాలో జాతి విద్వేష తూటాకు బలైన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటిక లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మల్లం పేట గ్రామ పరిధిలోని ప్రణీత్ నేచర్స్ బౌంటీ లోని నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీని వాస్ భౌతికకాయాన్ని ఊరేగింపుగా శ్మశానవాటి కకు తీసుకొచ్చారు. శ్రీనివాస్ తండ్రి మధు సూదన్‌రావు శాస్త్రోక్తంగా కర్మకాండలను నిర్వ హించారు. శ్రీనివాస్ చితికి నిప్పంటిస్తూ.. ఆయన కన్నీటిపర్యంతమైన తీరు అందరినీ కల చివేసింది. శ్రీనివాస్ అంత్యక్రియల్లో బంధువు లు, స్నేహితులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు శ్మశాన వాటికకు చేరుకున్న శ్రీనివాస్ భార్య సునయన, తల్లి వర్ధినిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, విద్యా వేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీనటులు రాజశేఖర్, జీవిత దంపతులు ఓదార్చారు. ఈ క్రమంలో తమ కుమారుడిని అన్యా యంగా చంపేశారని తల్లి రోదించడం అందరినీ కంట తడిపెట్టించింది. ఇప్పటికైనా రక్షణ కల్పించాలి సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో శ్రీనివాస్ భౌతికకాయం ఆయన స్వగృహానికి చేరుకోగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బోరున విలపిస్తున్న శ్రీనివాస్ తల్లి వర్ధిని, భార్య సునయనలను ఆపడం ఎవరితరం కాలేదు. ‘పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారని ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే తిరిగి వచ్చేయాలని శ్రీనివాస్‌కి చెప్పేదానిని. అలాంటివేమీ లేవని శ్రీనివాస్ చెప్తూ ఉండేవాడు. ఇప్పటికైనా అమెరికాలో ఉండే భారతీయులకు రక్షణ కల్పించాలని కోరు తున్నా’ అంటూ వర్ధిని బోరుమన్నారు. మంగళ వారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10.30 వరకు శ్రీనివాస్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శ నార్థం ఉంచారు. అనంతరం శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యు లు, బంధువులు, స్నేహితులు అశ్రునయనాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనివాస్ పార్థివదేహాన్ని అంతిమయాత్ర రథంలో మహాప్రస్థానానికి తరలించారు. భద్రతకు చర్యలు తీసుకుంటాం: దత్తాత్రేయ అమెరికాలో భారతీయుల భద్రతకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటుందని దత్తాత్రేయ చెప్పారు. రాయదుర్గంలోని మహాప్రస్థానం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని అమెరికాలోని భారత ఎంబసీ, ఇక్కడి అమెరికా ఎంబసీ అధికారులతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. అమెరికా ప్రభుత్వంతోనూ మాట్లాడి భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల్లో కొంత భయాందోళన ఉన్నా ప్రభుత్వ చర్యలతో వారిలో భరోసా పెరుగుతోందన్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల భాగస్వామ్యం ఎంతో ఉందని చుక్కా రామయ్య పేర్కొన్నారు. గ్లోబలైజేషన్లో విజ్ఞానవంతులకు ఎక్కడైనా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శ్రీనివాస్ లాంటి అమాయకులు ఇలా బలి కాకుండా కేంద్రం, అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవా లన్నారు. శ్రీనివాస్ హత్యను అందరూ ఖండిం చాలని, ఈ హత్య తర్వాత ప్రధాని మోదీ తగిన చర్యలు చేపట్టాలని అందరూ ఎదురు చూస్తున్నా రని జీవిత, రాజశేఖర్ చెప్పారు. భారతీయులు ఎక్కడున్నా వారి భద్రతకు ప్రభుత్వ భరోసా ఉండేలా చర్యలు ఉండాలన్నారు. పలువురు ప్రముఖుల పరామర్శ.. మంగళవారం ఉదయం శ్రీనివాస్ నివాసానికి పలువురు ప్రముఖులు వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, సీపీఐ జాతీయ నేత నారాయణ, వైఎస్సార్సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్‌గుప్తా, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, బీజేపీ సీనియర్ నేత మల్లారెడ్డి నివాళులర్పించారు. ట్రంప్ డౌన్‌డౌన్ నినాదాలు శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొనేం దుకు వచ్చిన బంధువులు, స్నేహితులు, వివిధ పార్టీలకు చెంది న వారంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతి రేకంగా నినాదాలు చేయడంతో మహాప్రస్థానం శ్మశానవాటిక మారుమోగింది. ‘ట్రంప్.. డౌన్ డౌన్’.. ‘భారత్ మాతాకీ జై’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొందరు ట్రంప్‌కు వ్యతిరేకంగా, హత్యను ఖండిస్తూ ప్లకార్డులను పట్టుకుని అంత్యక్రియలకు హాజరయ్యారు. నచ్చిన సూట్‌లోనే.. శ్రీనివాస్‌కు ఓ సూట్ అంటే చాలా ఇష్టం. శ్రీనివాస్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు అమెరికా నుంచి అతనికి అత్యంత ఇష్టమైన సూట్‌లోనే తీసుకుచ్చారు. శ్రీనివాస్ సాయిబాబా భక్తుడు కావడంతో బాబా కండువాను పార్థివదేహంపై కప్పారు. -
హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం
-
మరో వ్యక్తి మృతి
హైదరాబాద్ క్రై: గల్ప్ ఆయిల్ కంపెనీలో సోమవారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడ్డ వారిని డీఆర్డీవో ఆపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం చికిత్స పొందుతున్న మధుసూదన్‌రెడ్డి(59) అనే వ్యక్తి మృతిచెందాడు. అంతేకాకుండా, అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
300మి.ట. ఉక్కు ఉత్పత్తి సాధ్యమే
సాక్షి,విశాఖపట్నం: 2025 నాటికి దేశంలో ఉక్కు ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు చేరుకోవడం అసాధ్యమేం కాదని వైజాగ్‌స్టీల్‌ప్లాంట్ సీఎండీ మధుసూదన్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి అనేక సానుకూల అంశాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నంలో గురువారం ‘ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ విజన్- 2025’ అనే అంశంపై రెండురోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీనికి మధుసూదన్ ముఖ్య ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తలసరి ఉక్కు వినియోగం 60కేజీలు ఉండగా, చైనాలో 500 కేజీలు, అంతర్జాతీయ సరాసరి 225 కేజీలు ఉందన్నారు. ఈనేపథ్యంలో దేశీయంగా ఉక్కు ఉత్పత్తికి భారీగా అవకాశం ఉందని విశ్లేషించారు. ఉక్కు ఉత్పత్తి,వినియోగంలో చైనాతో భారత్ పోటీపడాల్సి ఉందన్నారు. ఏ దేశానికి లేనవిధంగా దేశంలో ఇనుప గనులు భారీగా ఉన్నాయని,ఇది దేశీయ ఉక్కు రంగానికి వరంగా పరిగణించాలన్నారు. ప్రస్తుతం ఒక టన్ను ఉక్కు ఉత్పత్తికి 1.5టన్నుల ఇనుప ఖనిజం అవసరం ఉందని, భవిష్యత్తులో సాధించాల్సి ఉన్న 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి 450 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం కావాలని చెప్పారు. అనంతరం సర్డా మెటల్స్ అండ్ అల్లాయిస్ డెరైక్టర్ మనిష్సర్డా,స్టాల్బర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బిమల్ కే సర్కార్, స్టీల్‌ప్లాంట్ మాజీ సీఎండీ శివసాగరరావు, ఆర్ఐఎన్ఎల్ ప్రస్తుత డెరైక్టర్ డి.ఎన్.రావు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఎండీ వి.కె.నొవాల్ తదితరులు ప్రసంగించారు. భారత్ జీడీపీ వృ ద్ధి రేటు 9శాతానికి చేరుకోవాలంటే ఉక్కు రంగానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత కల్పించాలని వీరంతా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.