
సాగర్ శైలేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ 143’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ సినిమాలోని ఓ పాటను జేడీ చక్రవర్తి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కథ, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ చేసి హీరోగా శైలేష్ నటించాడని విని ఆశ్చర్యపోయా. ‘రహస్యం’లో తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ బావున్నాయి. ఇందులో డీఎస్ రావు మంచి పాత్ర చేశారు’’ అన్నారు. ‘‘శివ 143’ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నాం. సెన్సార్ పూర్తి కాకపోవడంతో ఆగాం. యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు రామసత్యనారాయణ. ‘‘జేడీ చక్రవర్తిగారు నా సినిమాను గుర్తుపెట్టుకొని, అభినందించడం హ్యాపీ’’ అన్నారు సాగర్ శైలేష్.
Comments
Please login to add a commentAdd a comment