హరి, రాహుల్, ప్రియ, రాజేంద్రప్రసాద్, గోపీచంద్, పద్మనాభ
‘‘కాలేజ్ కుమార్’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ కథలో అన్ని భావోద్వేగాలు ఉన్నాయనిపిస్తోంది. దర్శకుడు హరికి ఈ సినిమా తెలుగులో మంచి బ్రేక్ అవ్వాలి’’ అన్నారు గోపీచంద్. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్ర ప్రసాద్, మధుబాల ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలేజ్ కుమార్’. ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ హరి సంతోష్ తెలుగుకి పరిచయమవుతున్నారు. లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ సినిమా ఈ 6న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్‌గారు సెట్స్‌లో ఉంటే యాక్టింగ్ డిక్షనరీ ఉన్నట్లే. మాలాంటి హీరోలకు యాక్షన్ ఇమేజ్ వచ్చిందంటే కారణం ఫైట్ మాస్టర్స్ విజయ్, రామ్–లక్ష్మణ్‌లే.
విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ పెద్ద హీరో కావాలి’’ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఏ నటుడైనా నటిస్తున్నంత కాలం సంతోషంగా ఉంటాడు. ఇన్నేళ్లు వినోదం అందించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషిస్తున్నా’’ అన్నారు మధుబాల. ‘‘కాలేజ్ కుమార్’ వంటి మంచి సినిమాని తెలుగు, తమిళ్‌లో చేసే చాన్స్ ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్’’ అన్నారు హరి సంతోష్. ‘‘చదవడం గొప్పా? చదివించడం గొప్పా? అనే విషయంలో తండ్రీకొడుకు మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు బాగా తెరకెక్కించారు’’ అన్నారు రాహుల్. ప్రియ వడ్లమాని, ఫైట్ మాస్టర్స్ రామ్– లక్ష్మణ్, దర్శకుడు మలినేని గోపీచంద్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment