Priya Vadlamani
-
ఆ గ్యారంటీ ఇవ్వగలను
‘‘ఏ సీజన్లో అయినా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇప్పుడు మేం తీసిన ‘మను చరిత్ర’ కూడా ఓ మంచి చిత్రంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే గ్యారంటీ ఇవ్వగలను’’ అని శివ కందుకూరి అన్నారు. శివ కందుకూరి హీరోగా భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్. శ్రీనివాసరెడ్డి నిర్మించిన చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో శివ కందుకూరి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మను అనే క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఏడెనిమిదేళ్ల టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా సాగుతుంది. అందుకే ‘మను చరిత్ర’ అని టైటిల్ పెట్టాం. ట్రైలర్లో యాక్షన్ కనిపిస్తున్నప్పటికీ సినిమాలో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది. తన నిజజీవితంలోని వ్యక్తుల నుంచి స్ఫూర్తి ΄÷ంది ఈ సినిమాలోని ΄ాత్రలను డిజైన్ చేసినట్లు, అలాగే తన ముగ్గురు స్నేహితుల వ్యక్తిత్వాలను మిళితం చేసి మను ΄ాత్రను డిజైన్ చేసినట్లు దర్శకుడు భరత్ నాతో చె΄్పారు. మా నాన్నగారు (నిర్మాత రాజ్ కందుకూరి) ‘మను చరిత్ర’ సినిమా చూసి, నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బాగా యాక్ట్ చేశావని అన్నారు. దాన్ని పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను’’ అని అన్నారు. -
ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేలా 'ముఖచిత్రం'
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'ముఖచిత్రం'. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు, మీడియాతో పంచుకున్నారు. (ఇది చదవండి: నన్ను డస్కీ అని పిలిచేవారు.. ప్రియాంక చోప్రా ఆవేదన) రచయిత సందీప్ రాజ్ మాట్లాడుతూ.. 'లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నా అభిమాన దర్శకుడు బాలచందర్ సినిమాలోని ఓ సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నా. కరోనా పాండమిక్ తర్వాత ప్రేక్షకులు పెద్ద పెద్ద చిత్రాలనే చూసేందుకు వస్తున్నారు. కానీ ఈ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాం. మా చిత్రాన్ని విశ్వక్ సేన్‌తో పాటు రవితేజ కూడా చూశారు.' అని అన్నారు. దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ..'నేను పిల్ల జమీందార్, భాగమతి సినిమాలకు వర్క్ చేశా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి సందేశాన్నిచ్చే సినిమా ఇది. ఈ సినిమాలో ఒక న్యాయవాది పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం విశ్వక్ సేన్ అయితే బాగుంటుందని భావించాం. విశ్వక్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.' అని అన్నారు. -
షూటింగ్ టైమ్‌లో యాక్సిడెంట్..ఇప్పటికీ పెయిన్ తగ్గలేదు: హీరోయిన్
‘ముఖచిత్రం’ నా తొలి తెలుగు సినిమా. మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో యాక్సిడెంట్ సీన్స్ చేసేప్పుడు కష్టపడ్డాను. నాకూ గాయాలయ్యాయి. రెండు నెలలు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ వల్ల పెయిన్స్ వస్తుంటాయి. ఏమైనా కష్టపడితే గానీ లైఫ్ లో ఏదీ దక్కదు అన్నట్లు ఈ సినిమాకు గాయపడినా మంచి చిత్రంలో భాగమవడం సంతృప్తిగా ఉంది’అని హీరోయిన్ అయేషా ఖాన్ అన్నారు. వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం". ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించగా, గంగాధర్ దర్శకత్వం వహించారు. ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ...నేను ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించాను. ఈ చిత్రంలో ఒక మంచి సందేశాన్ని చూపిస్తున్నాం. మన రియల్ లైఫ్ లో చాలాసార్లు విన్నదే, చూసిందే కానీ ఇప్పటిదాకా తెరపై ఇలాంటి పాయింట్ ను ఎవరూ తెరకెక్కించలేదు. . మేము మా విజన్ కంటే దర్శకుడు సందీప్ ఎలా మమ్మల్ని తెరపై చూపించాలనుకుంటున్నాడు అనే విజన్ ను నమ్మాము. దాన్నే ఫాలో అయ్యాము. సందీప్ ఒక కొత్త తరహా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాడు. తప్పకుండా ఆదరిస్తాని కోరుకుంటున్నాను అన్నారు. హీరోయిన్ అయేషా ఖాన్ మాట్లాడుతూ...ఈ సినిమాలో సిటీ గర్ల్ మాయా ఫెర్నాండేజ్ పాత్రలో నటించాను. లైఫ్ లో ఎలా ఉండాలనే విషయంలో కంప్లీట్ గా అవేర్ నెస్ ఉన్న అమ్మాయి తను. దేనికీ కాంప్రమైజ్ కాకుండా, తను అనుకున్న పని చేస్తుంటుంది. నాకు తెలుగులో తొలి సినిమా. మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ చిత్రం నా డెబ్యూ మూవీగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. -
హీరోయిన్ ప్రియ వడ్లమని సూపర్ లుక్ ఫొటోలు
-
కలర్ ఫొటో దర్శకుడి కొత్త సినిమా 'ముఖచిత్రం' టీజర్
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యా రావ్, అయేషా ఖాన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ముఖచిత్రం’. ఎస్కేఎన్ సమర్పణలో ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ చిత్రానికి గంగాధర్ దర్శకుడు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టీజర్‌ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. ‘‘నిర్మాణంలో మాకు అనుభవం లేకపోయినా మా టీమ్ అర్థం చేసుకుని సినిమాని పూర్తి చేశారు’’ అన్నారు ప్రదీప్. ‘‘టీజర్లో కొంతే చూపించాం. సినిమా ఇంతకు వంద రెట్లు ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు గంగాధర్. ‘‘ఓ బలమైన అంశాన్ని ఎంచుకుని సందీప్ రాజ్ కథ రాశాడు. ఇది డిఫరెంట్ మూవీ అవుతుంది’’ అన్నారు ఎస్కేఎన్. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ -
ఉండిపోరాదే..
-
హీరోయిన్ ప్రియా వడ్లమాని హాట్ ఫోటో గ్యాలరీ
-
అందరికీ కనెక్ట్ అవుతుంది
‘‘కన్నడలో ఘన విజయం సాధించిన ‘కాలేజ్ కుమార్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాం. తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలు ఈ సినిమాలో మెయిన్ హైలైట్. ప్రస్తుతం విద్యావిధానం ఎలా ఉంది? మన చదువుకు తగ్గట్లు ఉద్యోగం చేస్తున్నామా?.. వంటి విషయాల్ని ఈ సినిమాలో చర్చించాం’’ అన్నారు రాహుల్ విజయ్. కన్నడ ‘కాలేజ్ కుమార్’ చిత్రదర్శకుడు హరి సంతోష్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటించారు. లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ డ్రామా, ఎమోష¯Œ ్స ఉన్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. నేను ప్రతి సినిమా నుండి కొంత నేర్చుకుంటూ వస్తున్నాను. ఒక నటుడిగా నా వంతు పూర్తి కృషి చేస్తాను.. ఫలితం అనేది మన చేతిలో ఉండదు. కన్నడ ప్రేక్షకులు ఆదరించిన ట్టు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇందులో రాజేంద్రప్రసాద్, మధుబాల, నాజర్గార్లతో పని చేయడం సంతోషంగా అనిపించింది.. వారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రసుతం ‘బ్లాక్ అండ్ వైట్‘ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
రాహుల్ పెద్ద హీరో కావాలి
‘‘కాలేజ్ కుమార్’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ కథలో అన్ని భావోద్వేగాలు ఉన్నాయనిపిస్తోంది. దర్శకుడు హరికి ఈ సినిమా తెలుగులో మంచి బ్రేక్ అవ్వాలి’’ అన్నారు గోపీచంద్. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్ర ప్రసాద్, మధుబాల ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలేజ్ కుమార్’. ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ హరి సంతోష్ తెలుగుకి పరిచయమవుతున్నారు. లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ సినిమా ఈ 6న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్‌గారు సెట్స్‌లో ఉంటే యాక్టింగ్ డిక్షనరీ ఉన్నట్లే. మాలాంటి హీరోలకు యాక్షన్ ఇమేజ్ వచ్చిందంటే కారణం ఫైట్ మాస్టర్స్ విజయ్, రామ్–లక్ష్మణ్‌లే. విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ పెద్ద హీరో కావాలి’’ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఏ నటుడైనా నటిస్తున్నంత కాలం సంతోషంగా ఉంటాడు. ఇన్నేళ్లు వినోదం అందించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషిస్తున్నా’’ అన్నారు మధుబాల. ‘‘కాలేజ్ కుమార్’ వంటి మంచి సినిమాని తెలుగు, తమిళ్లో చేసే చాన్స్ ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్’’ అన్నారు హరి సంతోష్. ‘‘చదవడం గొప్పా? చదివించడం గొప్పా? అనే విషయంలో తండ్రీకొడుకు మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు బాగా తెరకెక్కించారు’’ అన్నారు రాహుల్. ప్రియ వడ్లమాని, ఫైట్ మాస్టర్స్ రామ్– లక్ష్మణ్, దర్శకుడు మలినేని గోపీచంద్ తదితరులు మాట్లాడారు. -
అపరిచితుల ప్రయాణం
నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్లు రోడ్డుపై ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం? ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేంటి? అనే కథాంశంతో ఓ సినిమా మొదలైంది. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, నగేష్ కుకునూర్ వద్ద పని చేసిన గురుపవన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్ష¯Œ ్స పతాకంపై జి. మహేష్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కెమెరామేన్ సి. రాంప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎన్.బి. బాలసుబ్రహ్మణ్యం క్లాప్ ఇచ్చారు. గురుపవన్ మాట్లాడుతూ –‘‘భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు అపరిచితులు హైదరాబాద్ నుంచి బైకులపై చేసే ప్రయాణమే ఈ సినిమా. మార్చి 2న తొలి షెడ్యూల్ మొదలుపెడతాం’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, ఇంద్రజ వంటి మంచి నటులతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘శ్రీకాంత్, నేను ‘జంతర్ మంతర్’ సినిమాతో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యాం. ఇన్నాళ్లకు ఆయనతో మళ్లీ సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఇంద్రజ. ‘‘గురు పవన్ చెప్పిన కథ నచ్చడంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నా’’ అన్నారు మహేష్. ప్రియ వడ్లమాని, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చిరంజీవి ఎల్. మాట్లాడారు. అమ్ము అభిరామి, నాజర్, పృథ్వీ, ఈశ్వరీ రావు, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. -
‘నలుగురు అపరిచితులు.. గమ్యం ఒకటే’
సినిమా సినిమాకు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు సుమంత్ అశ్విన్. ఫలితాలతో సంబంధం లేకుండా హార్రర్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ వంటి డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ నటుడిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథా చిత్రం-2 తర్వాత ఈ హీరో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం గురు పవన్ అనే దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన ప్రియా వడ్లమాని కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో శ్రీకాంత్, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేశ్ నిర్మిస్తున్నారు . తాజాగా ఈ చిత్ర షూటింగ్ స్థానిక రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. త్వరలోనే చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం సుమంత్ అశ్విన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నలుగురు అపరిచితులు.. 3450 కిలోమీటర్ల ప్రయాణం.. గమ్యం ఒకటే.. చివరికి ఏమైంది.. ఎందుకు ప్రయాణించారు’.. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: 50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
మరోసారి జోడీగా...
‘అల్లరి ప్రియుడు, జెంటిల్‌మేన్, చిలక్కొట్టుడు, గణేష్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించి తెలుగుప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మధుబాల. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘అంతకుముందు ఆ తర్వాత, సూర్య వర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో’ సినిమాల్లోనూ ముఖ్య పాత్రలతో తనదైన ముద్ర వేశారామె. అటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తున్న మధుబాల తాజాగా ‘కాలేజ్ కుమార్’ అనే మరో తమిళ చిత్రం అంగీకరించారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో నటుడు ప్రభుతో కలిసి ఆమె నటిస్తుండటం విశేషం. సీమాన్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ సినిమాలో తొలిసారి జోడీ కట్టారు మధుబాల, ప్రభు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించింది లేదు. తాజాగా అరుణ్ విజయ్ హీరోగా, ప్రియా వడ్లమాని జంటగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాలేజ్ కుమార్’ చిత్రంలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు మధు–ప్రభు. -
ఈ సినిమాతో నేను అప్డేట్ అయ్యాను
తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమా ఇంగ్లే, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘హుషారు’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘బెక్కెం వేణుగోపాల్ అంటే అందరికీ ఇష్టం. ముఖ్యంగా కొత్తవాళ్లకు. మంచి కథను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. చిన్న సినిమా తీసి పెద్ద లెవల్లో రిలీజ్ చేయగలరు. ‘సినిమా చూపిస్త మావ’ అంత హిట్ కావాలి’’ అన్నారు. ‘‘నా 9 సినిమాలను ఒక్కో అనుభవంలానే భావిస్తా. సినిమా పరంగా నేను అప్డేట్ అయ్యాను. టీమ్ నన్ను సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎంజాయ్ చేశాను. కొత్తవాళ్లతో సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్.‘‘క్వాలిటీ సినిమా తీసే నిర్మాతల్లో వేణుగోపాల్‌గారు ఒకరు’’ అన్నారు మధుర శ్రీధర్. ‘‘వేణు గోపాల్ తపనున్న నిర్మాత. అందుకే ఈ సినిమా ఇంత అందంగా ఉంది’’ అన్నారు రాజ్‌తరుణ్. ‘‘వేణుగోపాల్‌గారు సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. పాటలు బావున్నాయి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘‘5 ఏళ్ల క్రితం గోపీగారితో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా చేశాను. ఆ తర్వాత నుంచి ఆయన సలహాలు తీసుకుంటున్నాను’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ‘‘అవకాశం ఇచ్చిన బెక్కెం వేణుగోపాల్గారికి థ్యాంక్స్. సినిమాలో ఓ మ్యాజిక్ ఉంది అది చూసి ఎంజాయ్ చేయాల్సిందే’’ అన్నారు దర్శకుడు శ్రీహర్ష. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు. -
హుషారుగా ఆడి పాడి...
లక్కీ మీడియా సంస్థలో వస్తున్న 9వ చిత్రం ‘హుషారు’. శ్రీహర్ష కోనుగంటి దర్శకుడు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకల్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ‘‘ఇటీవలే మా యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సు టూర్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ టీమ్ ప్రధాన నగరాల్లోని అన్ని కాలేజీలకు వెళ్లాం. వెళ్లిన కాలేజీల్లో విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని చిత్ర యూనిట్‌లోని నటీనటులతో ఆడి పాడారు. ‘ఉండి పోరాదే’..., ‘పిచాక్...’ పాటలను ఆలపించి మా టీమ్‌లో ఆనందాన్ని నింపారు’’ అని చిత్రనిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. -
త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘శుభలేఖ+లు’
శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దిక్ష శర్మ ప్రధాన పాత్రలో శరత్ నర్వాడే దర్శకత్వంలతో తెరకెక్కుతున్న సినిమా ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా సినిమా రెండో ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ త్రిమిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ... ఇటీవలె విడుదలైన మా ట్రైలర్, టీజర్లకి ఇంత అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇండస్ర్టీలో ఉన్న పెద్దలందరూ చూసి అభినందించారు. ఇంత మంది ప్రముఖుల ఆదరణ ఈ సినిమాకి లభించడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ట్రైలర్‌ని మేము అడిగిన వెంటనే త్రివిక్రమ్‌గారు విడుదల చేయడం చాలా సంతోషం ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు విద్యాసాగర్, జనార్ధన్, బెల్లం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్ళిచూపులు రోజులు గుర్తొస్తున్నాయి
‘‘పెళ్ళిచూపులు’ సినిమాకి ముందే ‘హుషారు’ కథని దర్శకుడు హర్ష పంపించారు. స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే నాకు విపరీతంగా నవ్వు వచ్చింది. నాకు నచ్చే అర్బన్ టైప్ కామెడీ ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. ‘హుషారు’ పోస్టర్, ట్రైలర్లను చూస్తుంటే నాకు ‘పెళ్ళిచూపులు’ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగర్కర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లుగా రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలవుతోంది. ఈ సినిమాలోని మూడో పాటను ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్లో విజయ్ దేవరకొండ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఫ్రెండ్షిప్పై రూపొందించిన పాట బాగుంది. ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఉండే ఉత్సాహం హర్షలో కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘విజయ్‌తో మంచి రిలేషన్ ఉంది. అందుకే పాటను రిలీజ్ చేయమని అడగ్గానే సంతోషంగా ఒప్పుకొన్నారు’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ‘‘పెళ్ళిచూపులు’కి ముందు నుంచి విజయ్‌తో పరిచయం ఉంది’’ అని హర్ష చెప్పారు. -
జీవితమంటే జ్ఞాపకాలు
తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, హేమ ఇంగ్లే, ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రల్లో శ్రీహర్ష కానుగంటి తెరకెక్కించిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. రియాజ్ మరో నిర్మాత. ఈ సినిమాను డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – ‘‘రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ రిలాక్స్‌గా అనిపిస్తోంది. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డిసెంబర్ 7 మంచి డేట్ అని సలహా ఇచ్చారు. అలాగే రిలీజ్ చేస్తున్నాం. ఈలోపు ఏమైనా మార్పులు ఉంటే సరిదిద్దుకుంటాం. 7వ తేదీన తెలంగాణ లో ఎన్నికలు ఉన్నప్పటికీ ఏపీ, ఓవర్సీస్కు మంచి డేట్ అనుకున్నాం. ఫ్రెష్ ఫీల్‌తో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘నలుగురు ఫ్రెండ్స్ సరదాగా థియేటర్స్‌కు వెళ్ళి చూసే సినిమా. సెట్లో అందరం ఫ్రెండ్స్‌లా ఎంజాయ్ చేశాం. రాహుల్ రామకృష్ణ కామెడీ నవ్విస్తుంది. జీవితమంటే జ్ఙాపకాలు. వాటిని ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు దర్శకుడు శ్రీహర్ష. ‘‘వేణుగోపాల్గారికి ఆడియన్స్ పల్స్ తెలుసు. కొత్త కొత్త ఐడియాలతో వస్తుంటారు’’ అన్నారు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ బాబీ. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు. -
ఒక్క ఫ్రేమ్ అశ్లీలత లేకుండా...
‘‘ఈ మధ్య వస్తున్న కొన్ని చిత్రాలు కుటుంబంతో కలసి చూసేలా ఉండటం లేదు. కానీ ‘శుభలేఖ+లు’ చిత్రం సకుటుంబంతో చూడొచ్చు. నాకు చాలా నచ్చింది. ఒక్క ఫ్రేమ్ కూడా అశ్లీలంగా అనిపించలేదు. అందుకే ఈ సినిమాను కొన్నాను. డిసెంబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు బెల్లం రామకృష్ణారెడ్డి. సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్ నర్వాడే దర్శకత్వంలో సి. విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్థన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న బెల్లం రామకృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు శరత్ మాట్లాడుతూ – ‘‘యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా మాది. యువతని పెద్దలు ఎలా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్‌ని చూపించాం. నిర్మాతలు మంచి సపోర్ట్ అందించారు. రాధాకృష్ణ సంగీతం స్పెషల్ హైలైట్’’ అన్నారు.‘‘కంటెంట్‌ని నమ్మి ప్రారంభించిన సినిమా ఇది. నచ్చి బెల్లం రామకృష్ణా రెడ్డి థియేట్రికల్, శాటిలైట్ హక్కులను కొనుక్కున్నారు. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత జనార్థన్. ‘‘నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శరత్ మేలు ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు హీరో. -
నవంబర్ 16న ‘హుషారు’
‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ తరువాత ‘ మేము వయసుకు వచ్చాం’ , ‘ సినిమా చూపిస్త మావ’ లాంటి సూపర్ హిట్లు అందించారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘హుషారు’. రియాజ్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని,హేమ ఇంగ్లే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’ ఫేం రధన్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 16న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు చిత్రయూనిట్. -
సెప్టెంబర్ 7న ‘ప్రేమకు రెయిన్ చెక్’
పవన్ కల్యాణ్ హీరోగా గోపాల గోపాల, సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రాలను తెరకెక్కించిన శరత్ మరార్ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ బ్యానర్ రూపొందిన సినిమా ‘ప్రేమకు రెయిన్ చెక్’. డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమాకు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ దర్శకులు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. అభిలాష్, ప్రియా వడ్లమానిలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమాలో సుమన్, రఘు కారుమంచి, కిరీటీ దామరాజు, మౌనికలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపక్ కిరణ్ సంగీతం, శరత్ గురువుగిరి సినిమాటోగ్రఫి సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకువస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
'ప్రేమకు రెయిన్ చెక్.. కొత్తగా ఉంటుంది'
‘ప్రేమకు రెయిన్ చెక్’ అంటే.. వర్షం వల్ల ఓ జంటకు వచ్చే అడ్డంకులేమో అనుకుంటాం. కానీ ‘రెయిన్ చెక్ ’ అంటే ఇచ్చిన ఆఫర్‌ను భవిష్యత్‌లో తీసుకుంటా అని అర్థం అంటున్నారు ఆకెళ్ల శ్రీనివాస్. స్వీయ దర్శకత్వంలో ఆయన ఈ చిత్రం తెరకెక్కించారు. శరత్ మరార్ నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో, స్టోన్ మీడియా ఫిలింస్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనిక తమనం నాయకా నాయికలుగా నటించారు. చిత్ర కథానాయకుడు అభిలాష్ మాట్లాడుతూ – ‘‘నా తొలి సినిమా నార్త్‌స్టార్ లాంటి పెద్ద సంస్థలో రావటం నా లక్ . మా దర్శకుడు ఎంతో ఎంకరేజ్ చేశారు. టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ఆకెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో పనిచేశాను. నా మొదటి సినిమా థీమ్ లోగోను ఇంద్రగంటిగారు లాంచ్ చేసినందుకు హ్యాపీగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమాకు కంటెంట్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ రెండూ ఇంపార్టెంటే. మా సినిమాలో ఈ రెండూ ఉన్నాయి’ అన్నారు. ‘‘ఆకెళ్ల పేరి శ్రీనివాస్ నాకు ‘గోల్కొండ హైస్కూల్’ సినిమా టైమ్‌లో పరిచయం. తను చేసిన ఈ ఫస్ట్ సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. టెక్నికల్‌గా సినిమా వర్క్ బావుంది’’ అన్నారు ఇంద్రగంటి. ‘‘టైటిల్ ఎంత ఫ్రెష్‌గా ఉందో సినిమా అంతే కొత్తగా ఉంటుంది’’ అన్నారు శరత్ మరార్. ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, కెమెరా: శరత్ గురువుగారి. -
‘పెళ్లి.. అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్’
కొత్త టేకింగ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాలు ఘనవిజయాలు సాదిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీనివాస సాయి, ప్రియ వడ్లమాని, దీక్షా శర్మ ప్రధాన పాత్రల్లో శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్ నర్వాడే దర్శకుడు. ఇప్పటికే ఇంట్రస్టింగ్ టీజర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ మరో డిఫరెంట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రధాన పాత్రదారులను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అదే బాటలో మరో టీజర్‌ను రిలీజ్ చేశారు. పెళ్లి గురించి ఓ మోడ్రన్ అమ్మాయి అభిప్రాయాన్ని టీజర్ రూపంలో రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్ పై విద్యా సాగర్, ఆర్ ఆర్ జనార్థన్ లు నిర్మిస్తుండగా కే ఎమ్ రాథాకృష్ణన్ సంగీతమందిస్తున్నారు. -
‘శుభలేఖ+లు’ మరో డిఫరెంట్ టీజర్ రిలీజ్
-
డిఫరెంట్ టైటిల్‌తో నార్త్ స్టార్ సినిమా
పవన్ కల్యాణ్ హీరోగా గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన శరత్ మరార్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రేమకు రెయిన్‌చెక్. ‘రెయిన్ చెక్’ అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ట్రెండీ లవ్ స్టోరిగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఈ రోజు (శనివారం) విడుదల చేశారు. నూతన నటీనటులు అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శుభలేఖ+లు’
కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో అదే జానర్లో మరో ఇంట్రస్టింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ల వీడియోలను కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే లీడ్ క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దిక్ష శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శరత్ నర్వాడే దర్శకత్వం వహిస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్ పై విద్యా సాగర్, ఆర్ ఆర్ జనార్థన్ లు నిర్మిస్తుండగా కే ఎమ్ రాథాకృష్ణన్ సంగీతమందిస్తున్నారు.