పవన్ కల్యాణ్ హీరోగా గోపాల గోపాల, సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రాలను తెరకెక్కించిన శరత్ మరార్ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ బ్యానర్ రూపొందిన సినిమా ‘ప్రేమకు రెయిన్ చెక్’. డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమాకు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ దర్శకులు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు.
అభిలాష్, ప్రియా వడ్లమానిలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమాలో సుమన్, రఘు కారుమంచి, కిరీటీ దామరాజు, మౌనికలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపక్ కిరణ్ సంగీతం, శరత్ గురువుగిరి సినిమాటోగ్రఫి సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకువస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment