
జాతీయ అవార్డు గెల్చుకున్న సినిమాను చేజార్చుకుంటే ఆ బాధ ఎలా ఉంటో పోగొట్టుకున్నవారికే తెలుస్తుంది. 2020లో వచ్చిన కలర్ ఫోటో (Colour Photo Movie) ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో సుహాస్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే తొలుత చాందినికి బదులు ప్రియ వడ్లమాని (Priya Vadlamani)ని హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చాందిని రంగంలోకి అడుగుపెట్టింది.
ఫేస్‌బుక్‌లో సినిమా ఛాన్స్
తాజాగా ఆ సంగతుల గురించి ప్రియ వడ్లమాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. 2015లో నా జర్నీ మొదలైంది. ఫేస్‌బుక్ ద్వారా నాకు సినిమా ఆఫర్ వచ్చింది. వాళ్లు మరీమరీ అడిగేసరికి ఓకే చెప్పాను. ఆడిషన్ అయింది. సినిమా చేశాను కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. తర్వాత ప్రేమకు రెయిన్‌చెక్, శుభలేఖలు, హుషారు ఒకేసారి షూట్ చేశాను. హుషారులో ఉండిపోరాదే పాట అంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు.

చదవండి: ఛావా తెలుగు వర్షన్.. వచ్చేవారమే రిలీజ్!
తెలియక...
కలర్‌ఫోటో సినిమా ఛాన్స్ వచ్చింది. అది నాకు సరైన ప్రాజెక్ట్ అన్న ఆలోచన తట్టలేదు. పైగా ఏ సినిమా సెలక్ట్ చేసుకోవాలి? ఏది వదిలేయాలి? అన్న పరిజ్ఞానం కూడా అంతగా లేదు. నాకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. గైడ్ చేసేవారు కూడా లేరు. కాబట్టి ఎలాంటి కథలు ఎంచుకోవాలి? ఏ హీరోతో యాక్ట్ చేయాలి? ఏ ప్రాజెక్ట్స్ చేయాలి? అని తెలియదు. అమ్మానాన్న, నేను ముగ్గురం కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటాం.
ఇప్పటికీ బాధపడుతుంటా
ఆ సమయంలో ఏమైందంటే నాకు కొంచెం సమయం కావాలని చెప్పాను. పల్లెటూరమ్మాయి పాత్రలో నేను సెట్ కానేమో అని వాళ్లూ కాస్త డౌట్‌పడ్డారు. అలా ఆ ఛాన్స్ మిస్సయింది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకున్నానని చాలా బాధపడ్డాను. నా జీవితంలో అదొక పెద్ద రిగ్రెట్ అని చెప్పుకొచ్చింది. ప్రియ వడ్లమాని.. ప్రేమకు రెయిన్‌చెక్, శుభలేఖలు, హుషారు, ఆవిరి, ముఖచిత్రం, ఓమ్ భీమ్ బుష్, వీరాంజనేయులు విహారయాత్ర, బ్రహ్మా ఆనందం (Brahma Anandam Movie) చిత్రాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment