కొన్ని సినిమాల్ని చూసినప్పుడు అద్భుతం అనకుండా ఉండలేం. అలాంటి కోవలోకే వస్తుంది తుంబాడ్. బాలీవుడ్ నటుడు సోమహ్ షా నటన సినిమాను మరింత రక్తికట్టించింది. ఇందులో ఆయన నటించడమే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించాడు. తాజాగా ఇతడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీ పేరు క్రేజీ (Crazxy Movie).
ఇందులో సోహమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శనివారం (ఫిబ్రరి 1న) ఈ క్రేజీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తుంబాడ్‌లోని ఫేమస్ క్యారెక్టర్లు హస్తర్, వినాయక్, బామ్మ పాత్రలతో విడుదల డేట్‌ను రివీల్ చేశారు. క్రేజీ సినిమాకు గిరీశ్ కోహ్లి దర్శకత్వం వహిస్తుండగా సోహమ్ షాతో పాటు ముకేశ్ షా, అమిత్ సురేశ్, ఆదేశ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తుంబాడ్ (2018) విషయానికి వస్తే.. హారర్ జానర్‌లో సెన్సేషన్ హిట్ అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది.
చదవండి: 'మీ తిట్లు విన్నాక ఆ పని పూర్తి చేశా..' ఇంతకీ టైటిల్ అదేనా?
Comments
Please login to add a commentAdd a comment