ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ భాషా భేదం లేకుండా ఎడాపెడా నటిస్తోన్న నటుడు విజయ్‌సేతుపతి. అదే విధంగా కథానాయకుడు, ప్రతినాయకుడు అని కూడా ఆలోచించకుండా.. పాత్ర నచ్చితే ఓకే చెప్పేస్తున్నారు. అలా ఏక కాలంలో హీరోగా, విలన్‌గా నటిస్తున్న అరుదైన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనొక్కరే అని చెప్పక తప్పదు. తాజాగా హీరోగా నటించిన తమిళ చిత్రం మహారాజా. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం విజయ్‌సేతుపతికి 50వ చిత్రం కావడం గమనార్హం.
కాగా విజయ్ సేతుపతి ఇప్పటికే ఫర్జ్ అనే హిందీ వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యారు. తాజాగా జవాన్ చిత్రంలో షారూఖ్‌ఖాన్‌కు విలన్‌గా నటించి బాలీవుడ్‌లో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న మేరీ క్రిస్మస్ చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా బాలీవుడ్ క్రేజీ భామ కత్రినా కై ఫ్ నటించడం విశేషం.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్నారు. టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మేరీ క్రిస్మస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. అయితే తాజాగా ఒక వారం ముందే అంటే డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని హిందీ, తమిళం భాషల్లో వేర్వేరుగా రూపొందించినట్లు వారు తెలిపారు. దీంతో మేరీ క్రిస్మస్ చిత్రంపై కోలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది.
Christmas comes even earlier this year!! Be ready to feel the chills and thrills of #SriramRaghavan's #MerryChristmas, now on 8th December, in cinema halls near you.@TipsFilmsInd #MatchboxPictures @RameshTaurani #SanjayRoutray #JayaTaurani #KewalGarg #KatrinaKaif #SanjayKapoor… pic.twitter.com/PHp65E9KPx
— VijaySethupathi (@VijaySethuOffl) October 3, 2023
Comments
Please login to add a commentAdd a comment