
ఏదైనా సినిమా ప్రకటిస్తే చాలు దాని టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? టీజర్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు? ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు అభిమానులు. చిత్రయూనిట్ చెప్పేవరకు ఆగట్లేదు. టాప్ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)ని కూడా ఇలాగే విసిగిస్తున్నారట. విజయ్ దేవరకొండ 12వ సినిమా (#VD12) టైటిల్ చెప్తావా? లేదా? అని ఏకంగా బండబూతులు తిడుతున్నారట.
తిట్టు భరించాక..
ఈ విషయాన్ని నాగవంశీ సోషల్ మీడియాలో వెల్లడించాడు. మీ అందరి తిట్లు భరించాక.. నేను దర్శకుడు గౌతమ్‌ను చాలా హింస పెట్టాక ఎట్టకేలకు ఓ టైటిల్ ఫిక్స్ చేశాం. అదేంటో అతి త్వరలోనే ప్రకటిస్తాం అన్నాడు. అప్పటివరకు ఎదురుచూస్తూ ఉండండి అన్నాడు. అయితే ఆ సినిమా టైటిల్ సామ్రాజ్యం అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!
పోలీసాఫీసర్‌గా విజయ్?
విజయ్ దేవరకొండ చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు. కల్కి 2898 ఏడీలో ముఖ్య పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది విజయ్ కెరీర్‌లో 12వ సినిమా. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా విడుదల ఆలస్యం కావచ్చని టాక్ వినిపిస్తోంది.
#VD13 సినిమా
మరోవైపు విజయ్ తన పదమూడో సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు
పీరియాడిక్ మూవీలో విజయ్
విజయ్ తన పద్నాలుగో సినిమాను శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment