‘అందరి నాన్నలు ఇంతే’ | Shubhalekhalu Movie Second Teaser | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 27 2018 1:51 PM | Last Updated on Wed, Jun 27 2018 1:58 PM

Shubhalekhalu Movie Second Teaser - Sakshi

సినిమా మేకింగ్ విషయంలోనే కాదు ప్రమోషన్‌ విషయంలో కూడా కొత్త ఆలోచిస్తున్నారు కొత్త తరం దర్శకులు. ఇటీవల పెళ్లికూతురిలా ముస్తాబైన ఓ అమ్మాయి సిగరెట్‌ తాగుతూ కనిపించిన ఓ టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రెండో టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

నూతన నటి ప్రియా వడ్లమానిని నిత్య పాత్రలో కనిపించిన ఈ సినిమాలో..  పలు చిత్రాల్లో బాలనటుడిగా ఆకట్టుకున్న శ్రీనివాస సాయి హీరోగా నటిస్తున్నాడు. రెండో టీజర్‌లో శ్రీనివాస సాయిని చందుగా పరిచయం చేశారు. దర్శకుడు రవిబాబు చేతుల మీదకు ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌ పై విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌ లు నిర్మిస్తున్న ఈ సినిమాకు కే ఎమ్‌ రాథాకృష్ణన్‌ సంగీతమందిస్తున్నారు.శ్రీనివాస సాయి, దీక్షా శర్మ, వంశీ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement