Shubhalekha+Lu
-
శుభలేఖ+లు మన ఇంట్లో సినిమా
సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘శుభలేఖ+లు’. ప్రియా వడ్లమాని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రలు చేశారు. ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి శిష్యుడు శరత్ నర్వాడే ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి. విద్యాసాగర్, జనార్థన్ ఆర్.ఆర్ నిర్మించిన ఈ సినిమాను నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారు. ‘ఆనంద్, గోదావరి, చందమామ’ వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించిన కేఎమ్ రాధాకృష్ణన్ ఈ సినిమాకు సంగీత దర్శకునిగా వ్యవహరించారు. వివాహం పట్ల నేటి యువతరం ఆలోచనా ధోరణి ఎలా ఉంది? అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చెప్పిన విశేషాలు.... సందర్భానుసారంగానే పాటలు నేను సంగీతం అందించిన మంచి సినిమాల్లో ‘శుభలేఖ+లు’ ఒకటి. ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి. అన్నీ సందర్భానుసారంగానే వస్తాయి. ఇందులో ఉన్న ‘పద్మనాభ పాహి’ అనే పాట పాడింది నేనే. పెద్దాడ మూర్తిగారు రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ‘వేదవాసిని’ అనే పాట పాడారు. ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులోని ‘శృంగారలహరి’ సాంగ్ నా ఫేవరెట్. ‘చెప్పక తప్పదు’ అనే సంగీత్ సాంగ్ ఓ ఆకర్షణ. దాదాపు 23 రోజులు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌కి పట్టింది. అంత డీటైల్డ్‌గా చేశాను. నాకా సంతోషం ఉంది ఈ సినిమాలోని సాంగ్స్ కోసం మా టీమ్ జరిపిన సంభాషణలు నాకు మరింత మంచి పాటలు ఇచ్చే చాన్స్ కలిపించాయి. దర్శకుడు శరత్ కూల్‌గా ఉంటారు. నిర్మాత జనార్థన్ ఈ సినిమాకు కథ కూడా అందించారు. ఆయనతో నాకు ఉన్న స్నేహం నా బాధ్యతను మరింత పెంచింది. నా సినిమాలో ఆరు పాటలు హిట్ కావాలని నేను కోరుకుంటాను. అందుకే లిమిటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. ఎక్కువ సినిమాలు చేస్తే మజ్జిగ పలచన అవుతుందనిపిస్తోంది. తక్కువ సినిమాలు చేయడం నాకు వ్యక్తిగతంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ పెరిగిన సంతోషం ఉంది నాకు. యువత ఆలోచనలకు దృశ్యరూపం వివాహం పట్ల యువతరం ఆలోచనా ధోరణి మారింది. అరేంజ్డ్ మ్యారేజేస్ విషయంలో వధూవరుల సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పెద్దలు చూసిన సంబంధాలకు అడ్జెస్ట్ అయ్యే ఒక ధోరణి ఉండేది. ఇప్పుడు అలా లేదు. పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండబోతుందనే ఇన్సెక్యూరిటీ అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దర్లోనూ ఉంది. కొత్త ఇంట్లో ఎలా సర్దుకుపోవాలనే ఆలోచనలతో అమ్మాయిలు సతమతం అవుతుంటారు. నేటి పరిస్థితులను ప్రతిబింబించేలా శుభలేఖ+లు చిత్రం ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్రలోనూ బాధ్యతాయుతమైన ప్రవర్తన కనిపిస్తుంది. సిస్టర్ పెళ్లి కోసం హీరో పడే తపన, హీరోయిన్ పెళ్లి గురించి ఆలోచించే విధానం ఇలా ప్రతిదీ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. యూత్ అభిప్రాయాలకు, మనస్తత్వాలకు, ఆలోచనలకు దృశ్యరూపం ఇచ్చారు దర్శకుడు శరత్. రిలీజ్ ముందే సక్సెస్ అయ్యాం రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోంది. మార్కెట్లో మంచి మౌత్ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో మంచి బజ్ ఉంది. ఆల్రెడీ మా సినిమాను నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డిగారు తీసుకున్నారు. దీంతో రిలీజ్ ముందే సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాం. ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే మాతో పాటు ఇతర సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయన్న టెన్షన్ లేదు. ఇది మన ఇంట్లో సినిమానే. మన ఇంట్లో జరుగుతున్న విధివిధానాలే ఈ సినిమా కథనం. వాటిని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించాం. ఎస్పీబీతో హరికథ ప్రస్తుతం ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమా చేస్తున్నాను. ఎస్పీ బాలూగారితో ‘భీష్మ’ అనే హరికథ ప్లాన్ చేస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు కమిట్ అవ్వబోతున్నాను. -
త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘శుభలేఖ+లు’
శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దిక్ష శర్మ ప్రధాన పాత్రలో శరత్ నర్వాడే దర్శకత్వంలతో తెరకెక్కుతున్న సినిమా ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా సినిమా రెండో ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ త్రిమిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ... ఇటీవలె విడుదలైన మా ట్రైలర్, టీజర్లకి ఇంత అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇండస్ర్టీలో ఉన్న పెద్దలందరూ చూసి అభినందించారు. ఇంత మంది ప్రముఖుల ఆదరణ ఈ సినిమాకి లభించడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ట్రైలర్‌ని మేము అడిగిన వెంటనే త్రివిక్రమ్‌గారు విడుదల చేయడం చాలా సంతోషం ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు విద్యాసాగర్, జనార్ధన్, బెల్లం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరూ మెచ్చే శుభలేఖ+లు
‘‘పెళ్లి అనే శుభకార్యానికి ముందు అందులోని సమాచారాన్నంతా క్లుప్తంగా శుభలేఖలో రాసి కావాల్సిన బంధువులందరికీ పంచుతాం. మరి సినిమాకు శుభలేఖలంటే ‘టీజర్, ట్రైలర్స్’లే. బంధువులు ఎవరంటే ప్రేక్షకులే. పెళ్లి కార్డ్‌ని చూసి పెళ్లి ఏ రీతిలో జరగబోతోందో అని ఊహించినట్టుగా, ‘శుభలేఖ+లు’ చిత్రం కూడా బావుండబోతోందని టాక్ వినిపిస్తోంది. ‘మా ‘శుభలేఖ+లు’ చిత్రం కూడా కచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మం ఉంది’’ అంటున్నారు చిత్రబృందం. సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్ నర్వాడే దర్శకత్వంలో సి. విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్థన్ నిర్మించారు. చిత్రాన్ని వీక్షించి, బాగా నచ్చడంతో చిత్రం హక్కులను పుష్యమి ఫిల్మ్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి కొనుగోలు చేశారు. ఈ చిన్న చిత్రాన్ని సుమారు మూడున్నర కోట్ల ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేశారని టాక్. ‘శుభలేఖ+లు’ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం చెప్పిన విశేషాల్లో కొన్ని... ‘వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి జరిపించాలి అన్నది పాత నానుడి. ఇప్పటి యువత నాడి తెలిసిన దర్శక– నిర్మాతలు ఒక అబద్ధం ఆడకుండా ఒకరి బలహీనతలు ముందుగానే మరొకరికి పరిచయం చేసి ఎలా ఒక్కటవ్వాలనుకుంటున్నారు అనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు వేరు కాపురాలు పెట్టేశాయి. నిర్ణయాలు కలిసి తీసుకోవడం నుంచి ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్లు తీసుకుని కేవలం నిర్ణయాలను తెలియజేస్తున్నారు. కొంచెం కష్టం అయినా సరే పెద్దలను ఒప్పించవచ్చు. ఇలాంటి కాంటెపరరీ సబ్జెక్ట్‌కి యువత బాగా కనెక్ట్ అవుతారు. పాటలకు విశేష స్పందన లభిస్తోంది. కథను ముందుకు తీసుకువెళ్లేలా పాటలుంటాయి. చిన్న చిత్రాలకు పెద్ద సంవత్సరం 2018 చిన్న సినిమాలకు చాలా పెద్ద సంవత్సరం. రిలీజ్ అప్పుడు చిన్న స్థాయిలో కనిపించినా, బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి చేస్తున్నాయి. మా సినిమా కూడా కచ్చితంగా అదే స్థాయిలో ఉంటుంది. ‘ఛలో, ఆర్ఎక్స్ 100, కంచరపాలెం, సమ్మోహనం, గూఢచారి’ లాంటి చిత్రాల జాబితాలో మా చిత్రం కూడా చోటు సంపాదించుకుంటుందని నమ్ముతున్నాం. కంటెంట్ బాగుంటే... పెద్ద సినిమాలకు పెట్టింది తిరిగొస్తే హిట్ అను కుంటాం. లాభాలు చూసేది చాలా తక్కువ ఉంటుంది. కానీ చిన్న సినిమాల విషయంలో అలా కాదు. సినిమా టాక్ని బట్టి ఎన్నింతలైనా లాభం చూడొచ్చు నిర్మాతలు. కంటెంట్ బావుంటే చిన్న హీరో, పెద్ద హీరో అనే బేధాలను బాక్సాఫీస్ అంకెల్లో ప్రేక్షకుడు చూపించడం లేదు. మా సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందనే నమ్మకం ఉంది. మంచి ఇంపాక్ట్ అటెన్షన్ స్పాన్ తక్కువ ఉన్న ఈ రోజుల్లో కూడా ప్రేక్షకులు ‘శుభలేఖ+లు’ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూసున్నారంటే అది కచ్చితంగా టీజర్స్, ట్రైలర్స్, సినిమాలోని పాటలు క్రియేట్ చేసిన ఇంపాక్టే. సాయి శ్రీనివాస్, ప్రియా వడ్లమాని, దీక్షా శర్మ గుర్తుండిపోయేలా స్క్రీన్ ప్రెజెన్స్ కనబరిచారు. శరత్ నర్వాడ్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంతైనా చెప్పొచ్చు. డిసెంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రం కోసం పాటలు వింటూ, ట్రైలర్ చూస్తూ ఆసక్తిగా ఎదురు చూడటమే’’ అంటూ తమ చిత్రం గ్యారంటీగా హిట్ అనే నమ్మకాన్ని కూడా చిత్రబృందం వ్యక్తం చేశారు. -
ఒక్క ఫ్రేమ్ అశ్లీలత లేకుండా...
‘‘ఈ మధ్య వస్తున్న కొన్ని చిత్రాలు కుటుంబంతో కలసి చూసేలా ఉండటం లేదు. కానీ ‘శుభలేఖ+లు’ చిత్రం సకుటుంబంతో చూడొచ్చు. నాకు చాలా నచ్చింది. ఒక్క ఫ్రేమ్ కూడా అశ్లీలంగా అనిపించలేదు. అందుకే ఈ సినిమాను కొన్నాను. డిసెంబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు బెల్లం రామకృష్ణారెడ్డి. సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్ నర్వాడే దర్శకత్వంలో సి. విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్థన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న బెల్లం రామకృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు శరత్ మాట్లాడుతూ – ‘‘యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా మాది. యువతని పెద్దలు ఎలా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్‌ని చూపించాం. నిర్మాతలు మంచి సపోర్ట్ అందించారు. రాధాకృష్ణ సంగీతం స్పెషల్ హైలైట్’’ అన్నారు.‘‘కంటెంట్‌ని నమ్మి ప్రారంభించిన సినిమా ఇది. నచ్చి బెల్లం రామకృష్ణా రెడ్డి థియేట్రికల్, శాటిలైట్ హక్కులను కొనుక్కున్నారు. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత జనార్థన్. ‘‘నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శరత్ మేలు ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు హీరో. -
రెండు ప్రేమకథలు
పెళ్లంటే నూరేళ్ల పంట. అందులో అబద్ధాలకి తావులేదు. అన్నీ నిజాలే ఉండాలి అనుకుంటోంది నేటి యువత. ఈ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘శుభలేఖ+లు’. శ్రీనివాస సాయి, దీక్షశర్మ రైనా జంటగా ప్రియా వడ్లమాని లీడ్ రోల్లో నటించారు. శరత్ నర్వాడే దర్శకత్వంలో సి.విద్యాసాగర్, జనార్థన్ ఆర్.ఆర్. నిర్మించిన ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైంది. సి.విద్యాసాగర్, జనార్థన్ ఆర్.ఆర్. మాట్లాడుతూ– ‘‘ఓ పెళ్లింట్లో జరిగిన రెండు ప్రేమ కథల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. నటీనటులందరూ దాదాపుగా కొత్తవారే అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ ఉండదు. సహజంగా నటించారు. వాళ్లని చూస్తే మన హైదరాబాద్‌లో ఇంతమంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నారా? అనిపిస్తుంది. జంధ్యాలగారి సినిమాను మధుర్ భండార్కర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో మా చిత్రం అలా ఉంటుంది. కె.ఎం.రాధాకృష్ణన్ ఓ సినిమా అంగీకరించారంటే అందులో సంగీతానికి ప్రాధాన్యం ఉన్నట్టే. ఆయన సంగీతం అందించిన ‘ఆనంద్, చందమామ’ చిత్రాల జాబితాలో మా సినిమా నిలుస్తుంది’’ అన్నారు. వంశీ నెక్కంటి, మోనా బేద్రే, అప్పాజీ, డా. ఇర్ఫాన్, తిరువీర్, సింధు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: సి.సుధాసాగర్, కెమెరా: యస్. మురళీమోహన్ రెడ్డి. -
టైటిల్లో ప్లస్ ఏంటి?
సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా శరత్ నర్వాడే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శుభలేఖ+లు’. ప్రియా వడ్లమాని, వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి.విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్ధన్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత ‘దిల్’ రాజు హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు శరత్ నర్వాడే మాట్లాడుతూ– ‘‘శుభలేఖ+లు’ డిఫరెంట్ సినిమా అని చెప్పను కానీ, మన ఇంట్లో చూసిన కథలానే ఉంటుంది. టైటిల్లో ప్లస్ గురించి చాలా మంది అడిగారు. ఒక పెళ్లి వల్ల కొందరి లవ్స్టోరీస్కి క్లియరెన్స్ వచ్చి మరో రెండు జంటలు పెళ్లికి సిద్ధమవుతాయి. అందుకే టైటిల్ అలా పెట్టాం’’ అన్నారు. ‘‘ఎప్పటి నుంచో సినిమా చేయాలనే ఆసక్తి ఉండేది. ఈ చిత్రం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడే చెప్పను. సినిమా సక్సెస్ తర్వాత మాట్లాడతా’’ అన్నారు జనార్ధన్. ‘‘నా హృదయానికి దగ్గరైన సినిమా ఇది. శరత్‌గారు హార్ట్ టచింగ్‌గా తెరకెక్కించారు’’ అన్నారు సాయి శ్రీనివాస్. దీక్షా శర్మ, రచయిత విస్సు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్, కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
పెళ్లి కూతురి డైలమా
సాధారణంగా కాబోయే పెళ్లి కూతురు శుభలేఖలను చూసినప్పుడు ఊహల్లో తేలిపోవడమో, చుట్టూ నలుగురూ ఉంటే సిగ్గు పడటమో.. సీన్ ఇలా ఉంటుంది. కానీ ఒక చేతిలో శుభలేఖను పట్టుకుని మరో చేతితో సిగరెట్ పట్టుకుని కాబోయే పెళ్లి కూతురు ఏదో ఆలోచిస్తుంటే మాత్రం ఎక్కడో తేడా ఉన్నట్లే. ‘శుభలేఖ+లు’ సినిమా టీజర్లో పెళ్లి కూతురు ఇలానే కనిపిస్తుంది. శ్రీనివాస సాయి, దీక్షా శర్మ జంటగా శరత్ నర్వాడే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సి. విద్యాసాగర్, ఆర్. ఆర్. జనార్థన్ నిర్మించారు. ఈ సినిమాలోని తొలి సాంగ్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. ‘‘వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు. కానీ పెళ్లికి ముందు ఎలాంటి విషయాలనూ దాచకూడదని నేటి తరం యువత అభిప్రాయపడుతున్నారు. ఫలితం ఎలా ఉన్నా స్వీకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెలలోనే సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ప్రియా వడ్లమాని, వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాకు కేఎమ్ రాధాకృష్ణన్ సంగీతం అందించారు. -
‘పెళ్లి.. అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్’
కొత్త టేకింగ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాలు ఘనవిజయాలు సాదిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీనివాస సాయి, ప్రియ వడ్లమాని, దీక్షా శర్మ ప్రధాన పాత్రల్లో శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్ నర్వాడే దర్శకుడు. ఇప్పటికే ఇంట్రస్టింగ్ టీజర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ మరో డిఫరెంట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రధాన పాత్రదారులను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అదే బాటలో మరో టీజర్‌ను రిలీజ్ చేశారు. పెళ్లి గురించి ఓ మోడ్రన్ అమ్మాయి అభిప్రాయాన్ని టీజర్ రూపంలో రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్ పై విద్యా సాగర్, ఆర్ ఆర్ జనార్థన్ లు నిర్మిస్తుండగా కే ఎమ్ రాథాకృష్ణన్ సంగీతమందిస్తున్నారు. -
‘శుభలేఖ+లు’ మరో డిఫరెంట్ టీజర్ రిలీజ్
-
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శుభలేఖ+లు’
కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో అదే జానర్లో మరో ఇంట్రస్టింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ల వీడియోలను కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే లీడ్ క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దిక్ష శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శరత్ నర్వాడే దర్శకత్వం వహిస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్ పై విద్యా సాగర్, ఆర్ ఆర్ జనార్థన్ లు నిర్మిస్తుండగా కే ఎమ్ రాథాకృష్ణన్ సంగీతమందిస్తున్నారు. -
‘అందరి నాన్నలు ఇంతే’
సినిమా మేకింగ్ విషయంలోనే కాదు ప్రమోషన్ విషయంలో కూడా కొత్త ఆలోచిస్తున్నారు కొత్త తరం దర్శకులు. ఇటీవల పెళ్లికూతురిలా ముస్తాబైన ఓ అమ్మాయి సిగరెట్ తాగుతూ కనిపించిన ఓ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రెండో టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నూతన నటి ప్రియా వడ్లమానిని నిత్య పాత్రలో కనిపించిన ఈ సినిమాలో.. పలు చిత్రాల్లో బాలనటుడిగా ఆకట్టుకున్న శ్రీనివాస సాయి హీరోగా నటిస్తున్నాడు. రెండో టీజర్లో శ్రీనివాస సాయిని చందుగా పరిచయం చేశారు. దర్శకుడు రవిబాబు చేతుల మీదకు ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్ పై విద్యా సాగర్, ఆర్ ఆర్ జనార్థన్ లు నిర్మిస్తున్న ఈ సినిమాకు కే ఎమ్ రాథాకృష్ణన్ సంగీతమందిస్తున్నారు.శ్రీనివాస సాయి, దీక్షా శర్మ, వంశీ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
శుభలేఖ+లు రెండో టీజర్ విడుదల
-
ఆసక్తికరంగా ‘శుభలేఖ+లు’
విభిన్న ఆలోచనలతో తెరకెక్కుతున్న చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ‘శుభలేఖ+లు’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్ నర్వాడే దర్శకుడు. నూతన నటి ప్రియా వడ్లమానిని నిత్య పాత్రలో పరిచయం చేస్తూ ఓ ఆసక్తికర టీజర్‌ను రిలీజ్ చేశారు. నిత్య పాత్రను మోడ్రన్ అమ్మాయిగా పరిచయం చేశారు. పెళ్లి వేడుకకు సిద్ధమవుతున్న అమ్మాయి సిగరెట్ తాగుతూ కనిపించటం చూస్తే కథా కథనాలు బోల్డ్‌గా ఉండబోతున్నాయని అర్ధమవుతోంది. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్ పై విద్యా సాగర్, ఆర్ ఆర్ జనార్థన్ లు నిర్మిస్తున్న ఈ సినిమాకు కే ఎమ్ రాథాకృష్ణన్ సంగీతమందిస్తున్నారు.శ్రీనివాస సాయి, దీక్షా శర్మ, వంశీ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.