టైటిల్‌లో ప్లస్‌ ఏంటి? | Shubhalekha+Lu Theatrical Trailer | Sakshi
Sakshi News home page

టైటిల్‌లో ప్లస్‌ ఏంటి?

Aug 27 2018 5:10 AM | Updated on Aug 27 2018 5:11 AM

Shubhalekha+Lu Theatrical Trailer - Sakshi

శరత్‌ నార్వాడే, సాయి శ్రీనివాస్, ‘దిల్‌’ రాజు, ప్రియా వడ్లమాని, జనార్దన్‌

సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా శరత్‌ నర్వాడే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శుభలేఖ+లు’. ప్రియా వడ్లమాని, వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమా తెలుగు మూవీస్‌ పతాకంపై సి.విద్యాసాగర్, ఆర్‌.ఆర్‌. జనార్ధన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత ‘దిల్‌’ రాజు హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు శరత్‌ నర్వాడే మాట్లాడుతూ– ‘‘శుభలేఖ+లు’ డిఫరెంట్‌ సినిమా అని చెప్పను కానీ, మన ఇంట్లో చూసిన కథలానే ఉంటుంది. టైటిల్‌లో ప్లస్‌ గురించి చాలా మంది అడిగారు.

ఒక పెళ్లి వల్ల కొందరి లవ్‌స్టోరీస్‌కి క్లియరెన్స్‌ వచ్చి మరో రెండు జంటలు పెళ్లికి సిద్ధమవుతాయి. అందుకే టైటిల్‌ అలా పెట్టాం’’ అన్నారు. ‘‘ఎప్పటి నుంచో సినిమా చేయాలనే ఆసక్తి ఉండేది. ఈ చిత్రం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడే చెప్పను. సినిమా సక్సెస్‌ తర్వాత మాట్లాడతా’’ అన్నారు జనార్ధన్‌. ‘‘నా హృదయానికి దగ్గరైన సినిమా ఇది. శరత్‌గారు హార్ట్‌ టచింగ్‌గా  తెరకెక్కించారు’’ అన్నారు సాయి శ్రీనివాస్‌. దీక్షా శర్మ, రచయిత విస్సు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేఎమ్‌ రాధాకృష్ణన్, కెమెరా: మురళీమోహన్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement